ఎం.ఎం.కల్బుర్గి కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, హేతువాది.[1] ఆయన అసలు పేరు "మల్లేషప్ప మాదివలప్ప కల్బుర్గి".ఆయన వచన సాహిత్యంలో భారతీయ పండితుడు. ఆయన కన్నడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా పనిచేసారు. 2006 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు.[2]

ఎం.ఎం.కల్బుర్గి
పూర్తిపేరుమల్లేషప్ప మాదివలప్ప కల్బుర్గి
జననం(1938-11-28)1938 నవంబరు 28
యారగల్,బొంబాయి ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా.
మరణం2015 ఆగస్టు 30(2015-08-30) (వయసు 76)
ధర్వాడ్, కర్ణాటక, భారతదేశం.
చదివిన విశ్వవిద్యాలయాలుకర్ణాటక విశ్వవిద్యాలయం.
సాంప్రదాయం
వచన సాహిత్యం
ప్రధాన అభిరుచులు
కన్నడ భాష

జీవిత విశేషాలు

మార్చు

ఆయన కర్నాటక రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లాకు చెందిన యారగల్ గ్రామంలో 1938 లో జన్మించారు. ఆయన హంపీలోని కన్నడ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. 2009లో ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. నృపతుంగ, పంపా అవార్డులను కూడా అందుకున్నారు.

సాహితీ సేవలు

మార్చు

ఆయన 20 ప్రచురణలను ప్రచురించారు. వాటిలో :

  • నీరు నీరాదిసిట్టు
  • సరంగర్షి
  • కెట్టిట్టుకల్యన్

అవార్డులు

మార్చు
  • కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2006)
  • కేంద్ర (సెంట్రల్) సాహిత్య అకాడమీ అవార్డు.
  • జానపద్ అవార్డు
  • యక్షజ్ఞా అవార్డు
  • పద్మ అవార్డు
  • నృపతుంగ అవార్డు
  • రానా అవార్డు
  • బసవ పురస్కారం (2013)
  • వచన సాహిత్యశ్రీ అవార్డు (2013)
  • నాడోజ అవార్డు

ఆయనను గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఆగష్టు 30 2015 ఉదయం ధార్వాడ్‌లోని తన నివాసంలో ఉండగా బైకుపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కల్బుర్గిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.[3]

ఆయనకు అనేక బెదిరింపు సందేశాలు వస్తున్నపుడు ఆయన కర్ణాటక ప్రభుత్వానికి రక్షణ కొరకు అభ్యర్థించాడు కానీ తొలుత ప్రభుత్వం రక్షక దళాన్ని అందించలేదు.[4] ఆయనకు ప్రభుత్వం రక్షణ దళాన్ని అందించినప్పటికీ ఆగష్టు 2015 నుండి తొలగించమని పోలిసులను అభ్యర్థించాడు.[5] ఆగష్టు 30 2015 న భారతీయ కాలమానం ప్రకారం 8:40 గంటలకు ధర్వాడ్ లోని ఆయన నివాసంలో దుందగులు కాల్చి చంపారు. దుందగులు ఆయన శిష్యులమని చెప్పి ఆయన ఇంటి తలుపు తట్టారు. ఆయన భార్య ఉమాదేవి వారికీ కాఫీలు తయారుచేయుటకు లోపలికి వెళ్ళిన వెంటనే రెండు రౌండ్లు కాల్పులు జరిపి ఆయనను చంపారు.[6] వెంటనే వారు పారిపోయారు. ఆయనను మొదట ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తరువాత ధర్వాడ్ లోని జిల్లా సివిల్ హాస్పటల్ కు తరలించారు. కానీ అయన మరణించాడు.[7]

మూలాలు

మార్చు
  1. "ప్రముఖ రచయిత హత్య". Archived from the original on 2015-09-01. Retrieved 2015-09-05.
  2. "Kalburgi gets Sahitya Akademi award". The Hindu. December 22, 2006. Archived from the original on 7 నవంబరు 2012. Retrieved 3 February 2010.
  3. "ప్రముఖ రచయిత ఎం.ఎం.కల్బుర్గి కాల్చివేత". Archived from the original on 2015-09-02. Retrieved 2015-09-05.
  4. "Karnataka govt did not oblige with MM Kalburgi's request for protection: Former minister BT Lalithaa Naik". Daily News and Analysis. 30 August 2015. Retrieved 30 August 2015.
  5. Aravind S., Kamal (31 August 2015). "Rationalist MM Kalburgi's cold blooded killing shocks Karnataka's literary capital". Firstpost. Retrieved 31 August 2015.
  6. Aiyappa, Manu (30 August 2015). "Malleshappa M Kalburgi, controversial writer and scholar shot dead". The Times of India. Retrieved 30 August 2015.
  7. Nayak, Dinesh (30 August 2015). "Kannada writer M.M. Kalburgi shot dead". The Hindu. Retrieved 31 August 2015.

ఇతర లింకులు

మార్చు