ఉజ్జల్ భుయాన్

(ఉజ్జల్‌ భుయాన్‌ నుండి దారిమార్పు చెందింది)

ఉజ్జల్‌ భుయాన్‌ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 05 అక్టోబర్ 2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడై[1][2] 2022 జూన్ 28 నుండి 2023 జులై 13 వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు నిర్వహించాడు.[3][4]

ఉజ్జల్‌ భుయాన్‌
ఉజ్జల్ భుయాన్


పదవీ కాలం
2022 జూన్ 28 – 2023 జులై 13
ముందు సతీశ్‌ చంద్ర శర్మ

పదవీ కాలం
2021 అక్టోబర్ 05 – 2022 జూన్ 28

వ్యక్తిగత వివరాలు

జననం (1964-08-02) 1964 ఆగస్టు 2 (వయసు 59)
గౌహతి, అసోం

జననం, విద్యాభాస్యం

మార్చు

ఉజ్జల్‌ భూయాన్‌ అస్సాం రాష్ట్రం, గువహాటిలో 2 ఆగస్టు 1964న జన్మించాడు. ఆయన గువాహటిలో ఇంటర్‌ వరకు పూర్తి చేసి, ఢిల్లీలో ఆర్ట్స్‌ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఉజ్జల్‌ భూయాన్‌ గువహాటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ, గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందాడు.

కుటుంబ నేపథ్యం

మార్చు

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తండ్రి సుచేంద్ర నాథ్‌ భూయాన్‌ అస్సాం మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ గా పని చేశాడు.[5]

వృత్తి జీవితం

మార్చు

ఉజ్జల్‌ భూయాన్‌ 1991లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఆయన 21 జులై 2011లో అస్సాం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా, 17 అక్టోబర్, 2011న గౌహతి హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యాడు. జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 1 అక్టోబర్ 2019లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమితుడై , అక్టోబర్ 3న ప్రమాణం స్వీకారం చేశాడు.[6]జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 05 అక్టోబర్ 2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[7] తెలంగాణ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.[8] తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అవ్వడంతో ఆయన స్థానంలో మే 17న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది.[9] ఆయన 2022 జూన్ 28 నుండి 2023 జులై 13 వరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు నిర్వహించాడు. ఉజ్జల్‌ భూయాన్‌ 2023 జులై 13న సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా నియమితుడై, 14న న్యాయ‌మూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[10]

మూలాలు

మార్చు
  1. Andrajyothy (6 October 2021). "తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ భుయాన్‌". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  2. Deccan Chronicle (6 October 2021). "Bhuyan from Bombay for Telangana High Court, M.S. Rao sent to Punjab". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  3. Eenadu (28 June 2022). "తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం". Archived from the original on 28 June 2022. Retrieved 28 June 2022.
  4. Andhra Jyothy (5 July 2023). "తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బదిలీ". Archived from the original on 14 జూలై 2023. Retrieved 14 July 2023.
  5. Namasthe Telangana (6 October 2021). "తాత్కాలిక సీజే ఎమ్మెస్సార్‌ బదిలీ". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  6. Bombay High Court (2021). "JUSTICE SHRI. UJJAL BHUYAN". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  7. Sakshi (6 October 2021). "తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌". Archived from the original on 6 October 2021. Retrieved 6 October 2021.
  8. Sharma, Ravi. "Justice Ujjal Bhuyan to be the new Chief Justice of Telangana". Frontline. Retrieved 2022-05-18.
  9. Eenadu (18 May 2022). "హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌". Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  10. The Hindu (12 July 2023). "Supreme Court gets two new judges" (in Indian English). Archived from the original on 14 జూలై 2023. Retrieved 14 July 2023.