ఉట్నూరు మండలం

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా లోని మండలం

ఉట్నూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] ఉట్నూరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 38 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో ఒకటి నిర్జన గ్రామం.

ఉట్నూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E / 19.3667; 78.7667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం ఉట్నూరు
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,465
 - పురుషులు 32,358
 - స్త్రీలు 31,107
అక్షరాస్యత (2011)
 - మొత్తం 56.08%
 - పురుషులు 68.51%
 - స్త్రీలు 43.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

పునర్వ్యవస్థీకరణ

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 388 చ.కి.మీ. కాగా, జనాభా 63,465. జనాభాలో పురుషులు 32,358 కాగా, స్త్రీల సంఖ్య 31,107. మండలంలో 13,486 గృహాలున్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు

మండల ప్రముఖులు

మార్చు

•వెంకటరావు రాథోడ్

 
వెంకటరావు రాథోడ్-తొలి ఉట్నూరు మండల అధ్యక్షులు

వెంకట్ రావు రాథోడ్ ఉట్నూరు మండలం లక్కారాం గ్రామంలో జన్మించాడు.ఉట్నూరు మండల ప్రజా పరిషత్తు తొలి అధ్యక్షుడు. 1987లో జరిగిన ఎన్నికల్లో మండల అధ్యక్షుడు గా పదవి బాధ్యతలు స్వికరించి సేవాలందించారు. వెంకటరావు ఉట్నూరు మండలములోని లక్కారాం నివాసి వీరు రాథోడ్ ముద్దు నాయక్ దంపతులకు 18 జూలై 1953 లో జన్మించారు.ప్రాథమిక,మాధ్యమిక, ఉన్నత విద్య ఉట్నూరులోనే అభ్యసించి, డిగ్రీ ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా పట్టా పొందారు. 1981 నుండి 1987 వరకు లక్కారాం గ్రామపంచాయితీ సర్పంచుగా పని చేసి గ్రామపంచాయితీ అభివృద్ధి కోరకు కృషి చేశారు‌. ఉట్నూరు గ్రామ పంచాయితి కి సర్పంచు గా సేవాలందించారు. ఉట్నూరు మండల ప్రజాపరిషత్తు పరిధిలోని అన్ని గ్రామములకు మంచినీటి సౌకర్యం,విద్యుత్ సరఫరా ,విద్య, వైద్యం ,పశువైద్యం ,స్త్రీ శిశు సంక్షేమ ము,వ్యవసాయ కుటీర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. 1981నుండి1987 వరకు ఆదిలాబాదు జిల్లా గ్రంథాలయ సంస్థకు డైరెక్టరుగా పని చేశారు.2017 జూన్ 14 న స్వర్గవాసులైనారు.

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

మార్చు