ఉట్నూరు రెవెన్యూ డివిజను
ఉట్నూరు రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. ఆదిలాబాదు జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం ఉట్నూరులో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం, ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
ఉట్నూరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాదు |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
గణాంకాలు
మార్చుఈ డివిజను పరిధిలో మొత్తం 2,02,607 జనాభా ఉంది.
పరిపాలన
మార్చుఉట్నూరు డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | ఉట్నూరు రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | ఇంద్రవెల్లి మండలం | 25 రెవెన్యూ గ్రామాలు |
2 | నార్నూర్ మండలం | 24 రెవెన్యూ గ్రామాలు |
3 | ఉట్నూరు మండలం | 38 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం) |
4 | గాదిగూడ మండలం | 30 రెవెన్యూ గ్రామాలు |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 27 January 2022.
- ↑ "Revenue Division | Adilabad District | India". www.adilabad.telangana.gov.in. Archived from the original on 2022-02-15. Retrieved 2022-02-20.
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2022-02-20.