ఉట్నూరు

తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం లోని జనగణన పట్టణం

ఉట్నూరు, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం [1] ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివాసులుగా ఆదివాసులు గోండులు, కొలాములు, నాయకపోడులు,లంబడిలు మొదలైన గిరిజన తెగలు ని జీవిస్తున్నారు.

ఉట్నూరు
—  రెవెన్యూ గ్రామం  —
ఉట్నూరు కొమురం భీమ్ కాంప్లెక్సు
ఉట్నూరు కొమురం భీమ్ కాంప్లెక్సు
ఉట్నూరు కొమురం భీమ్ కాంప్లెక్సు
ఉట్నూరు is located in తెలంగాణ
ఉట్నూరు
ఉట్నూరు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°22′31″N 78°46′45″E / 19.375255°N 78.779064°E / 19.375255; 78.779064
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండలం ఉట్నూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్-504311
ఎస్.టి.డి కోడ్
ఉట్నూర్ బస్ స్టాండ్ ఆదిలాబాద్ జిల్లా

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2]

చరిత్ర సవరించు

ఉట్నూరు ప్రాంతాన్ని పూర్వం గోండు రాజులైన ఆత్రం వంశస్తులు పరిపాలించేవారు.

గణాంకాల వివరాలు సవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 63,465 - పురుషులు 32,358 - స్త్రీలు 31,107.

వ్యవసాయం, పంటలు సవరించు

ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు, రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు, పత్తి, మొక్కజొన్న, వరి, ఉలువలు, పట్టు పురుగుల పెంపెకం మొదలగునవి.

పరిశ్రమలు సవరించు

  • ఇప్ప పువ్వు లడ్డుల పరిశ్రమ
  • పల్లి పట్టి పరిశ్రమ,
  • పట్టు పరిశ్రమ, [3]

రవాణా సదుపాయాలు సవరించు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్టేషను ఉంది.

ప్రభుత్వ కార్యాలయాలు సవరించు

  • సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ
  • రెవిన్యూ డివిజన్ కార్యాలయం
  • పోలీస్ స్టేషన్
  • తపాల కార్యాలయం
  • గ్రామ పంచాయతీ
  • తహశీల్దార్ కార్యాలయం
  • విద్యుత్ శాఖ కార్యాలయం
  • కోర్టు

పర్యాటక ప్రదేశాలు సవరించు

  • గోపాల చెరువు మినీ ట్యాంక్ బండ్

ఉట్నూరు సాహితీ వేదిక సవరించు

ఉట్నూరు మండల కేంద్రంలో సాహితీ కార్యక్రమాలు నిర్వహించడానికి 2013 సంవత్సరంలో ఏర్పడింది.

మూలాలు సవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116
  4. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక). "గోండు రాజుల కోటలు". ఎడిటర్. Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 6 October 2019.
  5. ఈనాడు, ప్రధానాంశాలు. "గత వైభవానికి ఆనవాళ్లు.. గోండురాజుల కోటలు!". Archived from the original on 6 అక్టోబరు 2019. Retrieved 6 October 2019.

వెలుపలి లంకెలు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉట్నూరు&oldid=3967156" నుండి వెలికితీశారు