ఉత్తర గోవా
గోవారాష్ట్రం లోని రెండు జిల్లాలలో నార్త్ గోవా లేదా ఉత్తర గోవా జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 1736 చ.కీ.మి. ఉత్తర, తూర్పు సరిహద్దులలో వరుసగా మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన సిందుబర్గ్, కోల్హాపూరు జిల్లాలు ఉన్నాయి. అలాగే దక్షిణ సరిహద్దులో దక్షిణ గోవా జిల్లా, పడమటి సరిహద్దులో అరేబియన్ సముద్రం ఉన్నాయి.
చారిత్రక నేపథ్యంసవరించు
నార్త్ గోవా భూభాగాలు (పెర్నం, బిచోలిం, సత్తారీ) సవంత్వాడీ సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. పాండా సుంద సామ్రాజ్యం, మరికొంత కాలం మరాఠీ, మరికొంత కాలం సవంతంవాడీ సంరాజ్యాలలో భాగంగా ఉంటూ ఉండేది. ఒకప్పుడు ఈ ప్రాంతాలు పోర్చుగీసుల దాడి నుండి రక్షించుకోవడానికి హిందువుల స్వర్గభూమిగా ఉంటూ వచ్చింది. 18 శతాబ్ధపు పోర్చుగీసు దాడులలో పాండా భూభాగం పోర్చుగీసు వశం అయింది. తరువాత ఈ భూభాగం భారతదేశంలో విలీనం అయ్యేవరకు పోర్చుగీసు ఆధీనంలో ఉంటూ వచ్చింది. గోవా, పోర్చుగీసువారి భుభాగాలైన డయ్యూ, డామన్ భూభాగాలు కలిసి 1965 వరకు సమైక్యంగా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంటూ వచ్చాయి. 1987 మే 30 తరువాత డయ్యూ, డామన్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండి పోయి గోవాకు రాష్ట్ర అంతస్తు ఇవ్వబడింది. అలాగే గోవా నార్త్ గోవా, సౌత్ గోవాలుగా వేరు చేయబడ్డాయి.
భౌగోళికంసవరించు
నార్త్ గోవా ఉత్తరంగా 15o 48’ 00” నుండి 14o 53’ 54” అక్షాంశం, తూర్పుగా 73o నుండి 75o రేఖాంశం మద్య ఉపస్థితమై ఉంది.
వాతావరణంసవరించు
Panaji-వాతావరణం | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగస్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 31.6 | 31.5 | 32.0 | 33.0 | 33.0 | 30.3 | 28.9 | 28.8 | 29.5 | 31.6 | 32.8 | 32.4 | — |
సగటు అల్ప °C (°F) | 19.6 | 20.5 | 23.2 | 25.6 | 26.3 | 24.7 | 24.1 | 24.0 | 23.8 | 23.8 | 22.3 | 20.6 | — |
అవక్షేపం mm (inches) | 0.2 | 0.1 | 1.2 | 11.8 | 112.7 | 868.2 | 994.8 | 518.7 | 251.9 | 124.8 | 30.9 | 16.7 | — |
Source: wunderground.com[1] |
2001 లో గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య .. | 817, 761 [2] |
ఇది దాదాపు | కొమొరోస్ జనసంఖ్యకు [3] |
అమెరికాలోని | సౌత్ డకోటా జనసంఖ్యకు [4] |
640 భారతదేశ జిల్లాలలో | 480 |
1చ.కి.మీ జనసాంద్రత | 471 |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 7.8% |
స్త్రీ పురుష నిష్పత్తి | 959:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 88.85%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
భాషలు | కొంకణి, మరాఠీ, పోర్చుగీసు |
పాలనా నిర్వహణసవరించు
పనాజీ నార్త్ గోవా జిల్లా కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇది గోవా రాష్ట్రానికి కేంద్రంగా ఉంది. కొంకణిలోని అతి పెద్ద భాభాగమే నార్త్ గోవా జిల్లాగా ఏర్పాటు చెయ్యబడింది. జిల్లా భూభాగం పనజీ, మపుసా, బిచోలిం, పాండాలుగా విభజించబడ్డాయి.
హోటల్సవరించు
- కాండోలింలో " గోల్డెన్ తులిప్ " 4 అనే స్టార్ రిసార్ట్ ఉంది.
మూలాలుసవరించు
- ↑ "Historical Weather for Panaji, India". Weather Underground. Archived from the original on 2019-01-06. Retrieved November 27, 2008.
- ↑ 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Comoros 794,683 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". United States Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
South Dakota 814,180