ఉత్తర ఫల్గుణి నక్షత్రము

(ఉత్తర ఫల్గుణి;జ్యోతిష్యము నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు

మార్చు

ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, గణము మనుష్య, రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రమున జన్మించిన వారు తంద్రి వలన ప్రయోజనము పొందుతారు. సహోద్ర వర్గము బలముగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలములో ఔతుంది, ఉద్యోగము లెక వ్యాపారము ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. తనకు అంతగా పరిచయము లేని రమ్గములో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బమ్ధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనము విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరముగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్తిన దానికి వమ్దరెట్లు ఫలితము ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపమ్చము సరిగా అర్ధము చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దసలు విరికి యోగిస్తాయి.

ఉతార ఫల్గుణినక్షత్ర వివరాలు

మార్చు

ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది పన్నెండవది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
ఉత్తర ఫల్గుణి సూర్యుడు మానవ స్త్రీ గోవు జువ్వి ఆది వడ్రంగి పిట్ట ఆర్యముడు 1 సింహం 2,3,4 కన్య

ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

మార్చు
తార నామం తారలు ఫలం
జన్మ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ శరీరశ్రమ
సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం ధన లాభం
విపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ కార్యహాని
క్షేమతార ఆర్ద్ర, స్వాతి, శతభిష క్షేమం
ప్రత్యక్ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్న భంగం
సాధన తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
మిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం
అతిమిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం, లాభం

ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ

మార్చు
  • 1 వ పాదము - ధనసురాశి.
  • 2 వ పాదము makara
  • 3 వపాదము - కుంభరాశి.
  • 4 వ పాదము - మీనరాశి.

చిత్ర మాలిక

మార్చు

ఇతర వనరులు

మార్చు