శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం. అందుకే పూర్వకాలం నుండి శమీవృక్షం పూజనీయమైంది.[1]

జమ్మి చెట్టు
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
P. cineraria
Binomial name
Prosopis cineraria

భౌతిక లక్షణాలు

మార్చు
 
జమ్మిచెట్టు కొమ్మ

జమ్మి వేలాడే శాఖలతో ముళ్ళున్న మధ్యరకంగా పెరిగే వృక్షం. జమ్మి పత్రాలు సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు. ఈ ఆకు సన్నటి పొడుగాటి కంకులలో అమర్చబడిన పసుపురంగు పుష్పాలు రంగులో ఉంటుంది. ఆకారం సన్నగా దీర్ఘవృత్తాకారంగా గురు అగ్రంతో పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రాలు ఉంటుంది. పరిమాణం వేలాడే శాఖలతో ముళ్ళున్న మధ్యరకంగా పెరిగే వృక్షం. ఈ చెట్టు లోతైన నొక్కులు గల ద్విదారక ఫలం గా పెరుగుతుంది.

పురాణాల్లో జమ్మి

మార్చు

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు. ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు , ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితి. విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్ద గల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

"శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, 
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ, 
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, 
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."

పైశ్లోకం వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి , తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది. అంతేగాక శమీవృక్షం అగ్ని కాంతికి ప్రతీక. ఏ పేరుతో పిలిచినా ఇవన్నీ శుభకరమైనవే.వినాయక చవితి రోజు జమ్మిచెట్టు ఆకులను వినాయక వ్రత కల్ప విధానం లోని గణేశ పత్రపూజలో ఉపయోగిస్తారు.

జమ్మిచెట్టు పూజ

మార్చు

శమీ పూజ ఎప్పటినుండి మొదలైందో తెలియదు కాని "అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం" అనేదానిని బట్టి ఈ ఇద్దరు మహాపురుషులకు శమీవృక్ష పూజతో సంబంధముందని తెలుస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న రాముడికి శమీవృక్షం విశ్రాంతినిచ్చిందంటారు. త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు భారతకథ కూడా నిదర్శనమంటారు. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ద కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జునుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తనను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే.[2]

జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీని వ్యవహార నామం ‘జమ్మి’. విరాట పర్వంలో పాండవులు మారువేషాలు ధరించినప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షం మీదనే దాచారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. "ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి". దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. "ఓం ఇభవక్త్రాయ నమః - శమీ పత్రం సమర్పయామి"

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళీ తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు.

ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు, ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితీ. ఈ పత్రి ఈ వృక్షానికి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు 12 వది.

"శమీ శమయితే పాపం
శమీ శతృ వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనీ"

అనే శ్లోకం చదువుతారు.

ఆయుర్వేదంలో

మార్చు
 
జమ్మి చెట్టు (Prosopis cineraria)

సుగంధభరితంగా/దుర్వాసనతో కూడి ఉన్న జమ్మి ఆకుల ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది.రోగాల నివారణకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది.[3] బిళ్వాష్టకాలలో జమ్మి ఒకటి.

జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాక , ఎడారి ప్రాంతవాసులకు జమ్మిచెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును , ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందు వల్ల భూమి సారవంతముగా ఉంటుంది . వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది . జమ్మిచెట్టు కాయలు పోషకాహారం , "సాంగ్రియా " గా పిలిచే వీటితో కూరలు వండుతారు . జమ్మిచెట్టు గింజలను ఎండ బెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు . జమ్మిపూలను చక్కెరతో కలిపి తీసుకుంటే గర్భస్రావం రాదు. చెట్టు బెరడుతో పొడి చేసుకొని , నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతునొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి. జమ్మిచెట్టు జయాలను ఇచ్చేదే గాక సర్వరోగనివారిణి అని పేర్కొనవచ్చును.[4][1]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. కె, రామ్మోహన్‌రావు. "పాపాలు తుడిచిపెట్టు జమ్మి చెట్టు". ఆంధ్రప్రభ. No. 25 Sep 2011. Retrieved 28 November 2014.[permanent dead link]
  3. "బంగారం అని పవిత్రంగా పిలిచేది జమ్మిఆకు". నమస్తే తెలంగాణ. No. 10/3/2014. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 28 November 2014.
  4. https://www.eenadu.net/archivespage/archivenewsdetails/320000927/25-10-2020/sunday

బయటి లింకులు

మార్చు