పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. వీరి జన్మ నామం ఎన్. యాదగిరి. స్వస్థలం జడ్చర్ల. ఆంగ్ల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె, ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు ఉదయ్, ఉజ్జ్వల్ లతో కలిసి, దేవులాట పేరుతో కవితా సంకలనాన్ని; పరిమళ్, ఉజ్జ్వల్లతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణను వెలువరించారు. వీరు తమ కవితలకు రెండు సార్లు కుందుర్తి - రంజని అవార్డులు అందుకున్నారు. వీరి కవితలను కొన్నిటిని కొడవటిగంటి శాంతాసుందరి హిందీలోకి అనువదించింది.

ఉదయమిత్ర
ఉదయమిత్ర.jpg
జననంఎన్. యాదగిరి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల
నివాస ప్రాంతంజడ్చర్ల
ఇతర పేర్లుఎన్. యాదగిరి
వృత్తివిశ్రాంత అధ్యాపకులు
ప్రసిద్ధిఅభ్యుదయ కవి
మతంహిందూ

రచనలుసవరించు

  • అమ్మను జూడాలె (కథలసంకలనం)
  • ఆఖరి కుందేలు ( కథలసంకలనం)
  • పాట సంద్రమై(కవితా సంకలనం)
*కాలిబాట (కవితా సంకలనం )
  • దోసెడు నల్లులు. (కథలసంకలనం)
  • నేను గారిని (నాటకాల సంకలనం )
  • నదిలాంటి మనిషి (కవితా సంకలనం)
ఇతరులతో కలిసి
  • దేవులాట
  • ఓడిపోలే...పల్లె
  • దుఃఖాగ్నుల తెలంగాణ
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయమిత్ర&oldid=3704494" నుండి వెలికితీశారు