జడ్చర్ల

మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం లోని గ్రామం

జడ్చర్ల, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2] ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉన్న ముఖ్య కూడలి. హైదరాబాదు నుంచి కర్నూలు, బెంగుళూరు వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది బాదేపల్లి జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. ఇది జడ్చర్ల పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]

బస్సులు నిలుపు ప్రాంగణం, జడ్చర్ల

గణాంకాలు సవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526.అక్షరాస్యుల సంఖ్య 61056.[4] అందులో జడ్చర్ల పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.

చరిత్ర సవరించు

11వ శతాబ్ది నాటికే జడ్చర్ల ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో ఈ పట్టణంలో తన కాశీయాత్రలో భాగంగా మజిలీచేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ పట్టణాన్ని గురించి తన కాశీయాత్రచరిత్రలో వ్రాశారు. ఆయన వర్ణించినదాని ప్రకారం 1830నాటికే ఇది చక్కని బస్తీగా ఉండేది. రమణీయమైన కొలను, చుట్టూ మండపాలతో మంచి దేవాలయం ఉండేదన్నారు. పట్టణంలో సంపన్న వర్తకులైన ఉండేవారని వ్రాశారు. అప్పటికే జడ్చర్లలో సకల పదార్థాలూ దొరికేవన్నారు. ఆ ఊరు ఆరువేల నియోగి రాజగోపాలరావు అనే వ్యక్తికి తరతరాలుగా జమీందారీ కింద ఉండేదన్నారు. అయితే అతని వయస్సు అప్పటికి 12 సంవత్సరాలు కావడంతో ఆయన తల్లి పరిపాలన చేసేవారు. 3 లక్షల వరకూ సంవత్సరానికి నవాబుకు కట్టుకునే ఆ సంపన్న జమీందారీ పాలకులు ధర్మపాలన చేసేవారని పేరున్నట్టు వీరాస్వామయ్య వ్రాశారు. వారికి రాచూరు అనే గ్రామం రాజధానిగా ఉండేదన్నారు.[5] ఆయూరున్ను ఇంకా 36 గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. 3 లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడు 12 సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.

రవాణా సౌకర్యాలు సవరించు

7 వ నెంబరు జాతీయ రహదారిపై ముఖ్యకూడలి కావడంతో బస్సు సౌకర్యం మంచి స్థితిలో ఉంది. హైదరాబాదు నుంచి దక్షిణం వైపుగా కర్నూలు, బెంగుళురు వైపు వెళ్ళు మార్గమే కాకుండా మహబూబ్ నగర్ నుంచి తూర్పు వైపున దేవరకొండ, నల్గొండ వెళ్ళు మార్గం కూడా ఈ పట్టణం ద్వారానే వెళ్తుంది. అంతేకాకుండా ఈ పట్టణానికి రైలు సదపాయము కూడా ఉంది. రోడ్డు మార్గములో హైదరాబాదు నుంచి 83 కిలోమీటర్లు, రైలు మార్గంలో సికింద్రాబాదు నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వినోదం సవరించు

జడ్చర్ల పట్టణంలో 4 సినిమా థియేటర్లు ఉన్నాయి.

 • శ్రీనివాస థియేటర్
 • దేవి థియేటర్
 • వెంకట రమణ థియేటర్
 • రాఘవేంద్ర థియేటర్

విద్యాసంస్థలు సవరించు

 • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (స్థాపన:1982-1983)
 • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల (స్థాపన :1982-83)
 • మాస్టర్స్ జూనియర్ కళాశాల (స్థాపన :1997-98)
 • సెయింట్ ఆజ్ఞస్ బాలికల హై స్కూల్
 • జిల్లా ప్రజా పరిషత్తు బాలుర హై స్కూల్
 • డాక్టర్ బి.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాల

దేవాలయాలు సవరించు

 • శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం (బాదేపల్లి).
 • హనుమాన్ దేవాలయం, పాతబజార్ (బాదేపల్లి).
 • వేంకటేశ్వర స్వామీ దేవాలయం, కొత్త బస్సుస్టాండు రోడ్డు ( జడ్చెర్ల )
 • రంగనాయక స్వామీ దేవాలయం ( గుట్ట, బాదేపల్లి )
 • శివాలయం, గంగాపురం రోడ్డు, బాదేపల్లి
 • రాఘవేంద్రస్వామి దేవాలయం, సిగ్నల్ గడ్డ రోడ్డు, బాదేపల్లి
 • సాయిబాబా దేవాలయం, బాదేపల్లి చౌరస్తా
 • మైసమ్మ దేవాలయం, పాతబస్టాండ్ రోడ్డు చైతన్య నగర్. బాదేపల్లి

నీటిపారుదల, భూమి వినియోగం సవరించు

మండలంలో 9 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 766 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[6]

పరిశ్రమలు సవరించు

 • గీస‌ర్ల త‌యారీ ప్లాంట్‌: తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సహకారంతో హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేష‌న్ లిమిటెడ్‌, గ్రూప్ అట్లాంటిక్ కంపెనీల ఆధ్వర్యంలో 2023 జనవరి 12న జ‌డ్చ‌ర్ల‌ పట్టణంలో 210 కోట్ల రూపాయలతో గీస‌ర్ల త‌యారీ ప్లాంట్‌ ప్రారంభించబడింది. ఆరు ల‌క్ష‌ల యూనిట్ల‌ త‌యారీ ల‌క్ష్యంతో 5.7 ఎక‌రాల్లో నిర్మించిన ఈ ప్లాంట్‌లో 500 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. ఇక్కడ ఉత్ప‌త్తి అయ్యే యూనిట్ల‌లో 30 శాతం యూనిట్ల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేసి, మిగిలిన యూనిట్ల‌ను స్థానికంగానే వినియోగిస్తారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేష‌న్ చైర్మ‌న్ సందీప్ సోమ‌నీ, గ్రూప్ అట్లాంటిక్ సీఈవో పైర్రె లూయిస్ ఫ్రాంకోసిస్ పాల్గొన్నారు.[7][8]

ప్రభుత్వ ఆసుపత్రి సవరించు

2023, మే 27న జడ్చర్ల పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[9][10]

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు సవరించు

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకంలో భాగంగా ఈ గ్రామంలో 42 కోట్ల రూపాయలతో నిర్మించిన 560 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని 2023, జూన్ 9న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌-పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, లబ్ధిదారులకు అందించాడు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి సిహెచ్. మల్లారెడ్డి, ఎక్సైజ్‌ శాఖామంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగర్ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్‌ రవినాయక్‌, ఎస్పీ నరసింహ, కార్పొరేషన్‌ చైర్మన్లు ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[11][12]

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. నమస్తే తెలంగాణ, తెలంగాణ (3 May 2021). "జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్, అచ్చంపేట‌ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం". Namasthe Telangana. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
 4. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
 5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
 6. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
 7. telugu, NT News (2023-01-12). "జ‌డ్చ‌ర్ల‌లో రూ. 210 కోట్ల‌తో గీస‌ర్ల ప్లాంట్ ప్రారంభం". www.ntnews.com. Archived from the original on 2023-01-12. Retrieved 2023-01-17.
 8. "జ‌డ్చ‌ర్ల‌లో గీస‌ర్ల ప్లాంట్ ప్రారంభం." NavaTelangana. 2023-01-12. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
 9. Telugu, TV9 (2023-05-27). "Telangana: ఆ జిల్లా వాసులకు పండగలాంటి వార్త.. అందుబాటులోకి అత్యాధునిక సదుపాయాలతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి". TV9 Telugu. Archived from the original on 2023-05-27. Retrieved 2023-05-27.
 10. Shanker (2023-05-27). "జడ్చర్లలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు". Mana Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-05-27. Retrieved 2023-05-27.
 11. telugu, NT News (2023-06-09). "'డబుల్‌' ఇండ్ల పండుగ". www.ntnews.com. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.
 12. Nagaraju, Pandari (2023-06-08). "రైతుకు వెన్నుదన్ను బిఆర్‌ఎస్సే". Mana Telangana. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.

వెలుపలి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=జడ్చర్ల&oldid=3915020" నుండి వెలికితీశారు