ఉదయ్ కోటక్

(ఉదయ్ కొటక్ నుండి దారిమార్పు చెందింది)

ఉదయ్ కోటక్ (జననం 15 మార్చి 1959) ఒక భారతీయ బిలియనీర్ బ్యాంకర్. ఆయన కోటక్ మహింద్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.

ఉదయ్ కోటక్
జననం (1959-03-15) 1959 మార్చి 15 (వయసు 65)
జాతీయతభారతీయుడు
విద్యయూనివర్సిటీ అఫ్ ముంబై
వృత్తి
నికర విలువUS$10.9 బిల్లియన్ (జూన్ 2020)[2]
జీవిత భాగస్వామిపల్లవి కోటక్
పిల్లలు2

1980 ప్రారంభంలో భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండి, ఆర్థిక వృద్ధి కూడా ఆగిపోయిన సమయంలో, మల్టీ నేషనల్ సంస్థలో లభించిన లాభదాయకమైన ఉద్యోగాన్ని తిరస్కరించి కోటక్, తానే స్వయంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తరువాతి సంవత్సరాల్లో, అతను తన వ్యాపారాన్ని ఆర్థిక సేవల లోని వివిధ రంగాలలోకి విస్తరించాడు. బిల్ డిస్కౌంటింగ్, స్టాక్ బ్రోకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కార్ ఫైనాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ రంగాల్లోకి ప్రవేశించి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. 22 మార్చి 2003 న, భారత కార్పొరేట్ చరిత్రలో కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన మొట్టమొదటి సంస్థగా అవతరించింది.

ఫోర్బ్స్ 2019 అంచనా ప్రకారం అతని సంపద 14.8 బిలియన్ డాలర్లు. [3] 2006 లో, రెండు అనుబంధ సంస్థలలో గోల్డ్మాన్ సాచ్స్ కు ఉన్న 25% వాటాను 72 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి, ఆ సంస్థతో తనకున్న 14 సంవత్సరాల భాగస్వామ్యాన్ని ముగించాడు.

బాల్యం, విద్య

మార్చు

కోటక్ ఒక ఉన్నత మధ్యతరగతి గుజరాతీ ఉమ్మడి-కుటుంబంలో పెరిగాడు.[4] ఒకే ఇంట్లో ఒకే వంటగదితో 60 మంది జీవించేవారు. ఈ కుటుంబం మొదట పత్తి వ్యాపారంలో ఉండేది. అతను దీనిని "పనిలో పెట్టుబడిదారీ వాదం, ఇంట్లో సామ్యవాదం (క్యాపిటలిజం ఎట్ వర్క్ అండ్ సోషలిజం ఎట్ హోమ్)" అని అన్నాడు. [5]

అతనికి రెండు కాలక్షేపాలు ఉండేవి ఒకటి క్రికెట్ మరొకటి సితార్ వాయించడం. 2014 లో ఎన్‌డిటివికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సితార్‌ను వాయించడం మానేసానని తెలిపాడు.[6]

గణితంలో తన ప్రతిభ అతని కెరీర్ ఎంపికను ప్రభావితం చేసింది. సిడెన్హామ్ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ ని సంపాదించి, 1982 లో జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి మేనేజ్మెంట్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశాడు. [7]

కెరీర్

మార్చు

ఎంబీఏ పూర్తి చేసిన తరువాత ఆయన కోటక్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్‌ను ప్రారంభించాడు (ఇది తరువాత కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ అయింది). కుటుంబం, స్నేహితుల నుండి అరువు తెచ్చుకున్న US $ 80,000 కంటే తక్కువ మూలధనం నుండి, 19 బిలియన్ డాలర్ల (మార్చి 2014 నాటికి) ఆస్తులతో బిల్-డిస్కౌంట్ స్టార్ట్-అప్‌ను ఆర్థిక సేవల సమ్మేళనంగా మార్చాడు. ఇది భారతదేశంలో 1250 కి పైగా శాఖలతో, మార్కెట్ క్యాపిటలైజేషన్ (ప్రైవేట్, పిఎస్‌యు) పరంగా చూస్తే రెండవ అతిపెద్ద షెడ్యూల్ వాణిజ్య బ్యాంకు.[8]

2014 లో, కోటక్ తన సంపదను దాదాపు రెట్టింపు చేశాడు, 2014 నవంబరులో 2.4 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రత్యర్థి ఐఎన్జి వైశ్యా బ్యాంక్ (కొంత వరకు డచ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ ఐఎన్జి యాజమాన్యంలో ఉంది) తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న తరువాత కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల విలువ ఒకే సారి గరిష్టాన్ని తాకింది.

2015లో, కోటక్ సాధారణ భీమా వ్యాపారంలోకి ప్రవేశించారు. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్ కు చెందిన భారతి ఎయిర్‌టెల్‌తో తో చిన్న పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభించారు.[9]

అతను కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో తన వాటాను ఇప్పటికి 30 శాతానికి తగ్గించారు, ఎందుకంటే ఆర్‌బిఐ ఆదేశాల మేరకు దానిని 20 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉంది. [10]

2019 ఆగష్టులో, అత్యధిక జీతం తీసుకునే బ్యాంకు సిఇఓలలో అతనొకడు. అతని నెలవారీ వేతనం 27 లక్షలు (US $ 38,000).[11]

గౌరవాలు, అవార్డులు

మార్చు
  • జూన్ 2014 లో, అతను "ఎర్నెస్ట్ & యంగ్ వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్‌గా" ఎంపికయ్యాడు . [12]
  • ఫోర్బ్స్ మ్యాగజైన్, యుఎస్ (మే 2016) నిర్వహించిన "మనీ మాస్టర్స్: ది మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది ఫైనాన్షియల్ వరల్డ్" లో ఏకైక భారతీయ ఫైనాన్షియర్ ఇతను [13]
  • ఇండియా టుడే మ్యాగజైన్ 2017 జాబితాలో భారతదేశపు 50 అత్యంత శక్తివంతులలో #8 వ స్థానంలో నిలిచారు. [14]

సభ్యత్వాలు

మార్చు

కోటక్ భారత ప్రభుత్వ ఫైనాన్సింగ్ మౌలిక సదుపాయాల కమిటీ, సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ప్రాథమిక మార్కెట్ సలహా కమిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, ఐ.సి.ఆర్.ఐ.ఇ.ఆర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో సభ్యుడు. ఇది జాతీయ న్యాయ సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగల్‌దాస్‌కు సలహా ఇచ్చే వ్యూహాత్మక బోర్డులో కూడా సభ్యుడు, .[15]

మూలాలు

మార్చు
  1. "IL&FS - Board of Directors". Archived from the original on 2020-12-30. Retrieved 2020-08-25.
  2. "Forbes profile: Uday Kotak". Forbes.com. Retrieved 20 June 2020.
  3. "Uday Kotak". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2020-08-25.
  4. "ఉదయ్ కోటక్". ఎన్‌డిటివి.
  5. "Uday Kotak: Latest News, Videos and Uday Kotak Photos | Times of India". The Times of India. Retrieved 2020-08-25.
  6. "ఉదయ్ కోటక్". ఎన్‌డిటివి.
  7. "Uday Kotak Biography". mapsofindia.com. 2015-06-03.
  8. "Uday Kotak". Vir Sanghvi.
  9. "Uday Kotak". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.
  10. "Uday Kotak". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2020-08-26.
  11. Rebello, Joel. "Aditya Puri | Hdfc bank ceo: remains top-paid bank CEO". The Economic Times. Retrieved 2020-08-26.
  12. "Uday Kotak named EY World Entrepreneur Of The Year 2014". Biharprabha. 12 June 2014. Retrieved 17 January 2018.
  13. "Sole Indian Financier to feature in Money Masters: The Most Powerful People in the financial World". Forbes Magazine. May 11, 2016. Retrieved 17 January 2018.
  14. "India's 50 powerful people". India Today. April 14, 2017. Retrieved 17 January 2018.
  15. Vyas, Maulik. "Cyril Shroff ropes in business luminaries like Narayana Murthy, Deepak Parekh, Uday Kotak and others for advisory board of his law firm". The Economic Times. Retrieved 2020-08-27.