ఉద్యోగం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
ఉద్యోగం (Employment) అనగా యజమాని (Boss) వద్ద, యజమాని కొరకు పనిచేస్తూ ఆ పనికి తగిన జీతం (Salary / Wage) పొందటం. ఉద్యోగాన్ని గ్రాంధిక భాషలో ఊడిగం, పని, నౌకరీ అని అంటారు. ఉద్యోగం ఇచ్చేవారిని Employer అని, ఉద్యోగం చేసేవారిని Employee అని అంటారు. పూర్వకాలంలో "ఉత్తంకేతి మద్యంవాన్ కరె చాకిరి కుకర్ నినాన్" అనే హిందీ నానుడి ప్రచారంలో ఉండేది. దీనికి అర్ధం - వ్యవసాయం ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం. ఉద్యోగం ఒక గాడిద చేసే పనిగా చెప్పబడింది. హరిత విప్లవంతో రసాయన మందులు వాడి వ్యవసాయం దెబ్బతినడం వల్ల గత 40, 50 సంవత్సరాలుగా ఉద్యోగం ఉత్తమంగా భావించబడుచున్నది.[1]
(ఇంకా వుంది)
ఉద్యోగం ఎవరికి అవసరం?సవరించు
సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన స్వశక్తి మీద నమ్మకం లేనివాడు, భవిష్యత్తు అంటే భయం ఉన్నవాడు, లేదా ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేనివాడు ఉద్యోగాన్ని నమ్ముకుంటాడు. (ఇంకా వుంది)
లాభాలుసవరించు
- తప్పనిసరిగా ప్రతి నెలా చివర జీతం వస్తుంది. కనుక దైనందిన జీవితం ఆర్థికంగా లోటు లేకుండా హాయిగా గడిచిపోతుంది.
- క్రమశిక్షణ (టైం మేనేజ్మెంట్) అలవరుతుంది.
(ఇంకా వుంది)
నష్టాలుసవరించు
- ఉద్యోగస్తునికి సమాజంతో కొన్ని సంబంధాలు తెగిపోతాయి.
- వచ్చే జీతంతో రోజులు గడుపుకోవడమే కాని సంపాదన మిగులు ఉండదు.
- జీతం పెరిగే కొలదీ ఖర్చులు పెరుగుతాయి.
- ఉద్యోగం వల్ల వచ్చే జీతంతో ఆస్తులు సంపాదించడం దాదాపు అసాధ్యం.
- అనారోగ్యం వచ్చి ఉద్యోగం మానివేసినప్పుడు భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది.
అభిప్రాయాలుసవరించు
పూర్వం విద్యార్థులు విజ్ణాన సముపార్జనకి విద్యను అభ్యసించేవారు, నేటి విద్యార్థులు కేవలం ఉద్యోగం కోసం విద్యను అభ్యసిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. చదువు పరమార్ధం విజ్ణానమే కాని ఉద్యోగం కాదు. చదువు వల్ల సంపాదించిన విజ్ణానాన్ని ఉపయోగించుకొని జీవితంలో ఎదగాలి. దిక్కులేని పరిస్థితుల్లో ఉద్యోగం చేయాలి.
ఉద్యోగం వల్ల సంపాదన ఉండదని, అది కేవలం చదువుకొనేవారు దిక్కులేని పరిస్థితిలో చేసుకొనేది అని, దేశవ్యాప్తంగా ఉద్యోగస్తుల్లో నెలకు 5,000 నుండి 25,000 రూపాయలు తెచ్చుకొనేవారు సుమారు 90% ఉండవచ్చని, వీరు ఎప్పుడూ నిత్యం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూవుంటారని, నెలకు లక్షల రూపాయల జీతం తీసుకొనేవారు 10% మాత్రమే ఉంటారని నిపుణుల అభిప్రాయం.
'ఉద్యోగంతో రోజులు గడుపుకోవడమే గాని సంపాదన ఉండదు, ఆస్తులు సంపాదించలేము, చదువుకి - సంపాదనకి సంబంధం లేదు, సంపాదనకి కావాల్సింది తెలివితేటలే గాని చదువు కాదు, సెటిల్మెంట్ అంటే పని చేయకపోయినా నెల తిరుగకుండా చేతికి డబ్బు వచ్చే స్థితి అని, సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తి వయసులో ఉండగానే సెటిల్మెంట్ కోసం ప్లాన్ చేయాలని పలువురి అభిప్రాయం.