ఉనకోటి జిల్లా
ఉనకోటి జిల్లా, త్రిపుర రాష్ట్ర జిల్లా. 2012, జనవరి 21న త్రిపురలో కొత్తగా ఏర్పాటుచేసిన నాలుగు కొత్త జిల్లాల్లో ఇది ఒకటి. ఈ జిల్లా ముఖ్య పట్టణం కైలాషహర్. అంతకుముందు ఇది ఉత్తర త్రిపుర జిల్లాలో భాగంగా ఉండేది.
ఉనకోటి జిల్లా | |
---|---|
త్రిపుర జిల్లాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | త్రిపుర |
విస్తీర్ణం | |
• Total | 686.97 కి.మీ2 (265.24 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 2,98,574 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://unakoti.nic.in/ |
పద వివరణ
మార్చుఉనకోటి కొండ మీదుగా ఈ జిల్లాకు ఉనకోటి అనే పేరు వచ్చింది. ఉనకోటి అంటే బెంగాలీలో ఒక కోటి తక్కువ అని అర్థం. ఇది పురాతన శైవ ప్రార్థనా స్థలం.[1]
భౌగోళికం
మార్చుఉనకోటి జిల్లాకు ఈశాన్యం వైపు ధర్మనగర్ ఉపవిభాగం, తూర్పు వైపు పానిసాగర్ ఉపవిభాగం, ఆగ్నేయం వైపు ఉత్తర త్రిపుర జిల్లా లోని కాంచనపూర్ ఉపవిభాగం ఉన్నాయి. దక్షిణం వైపు కమల్పూర్ ఉపవిభాగం, దలై జిల్లా లాంగ్తారి లోయ ఉపవిభాగం ఉన్నాయి. దీనికి ఉత్తర వైపు భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
విభాగాలు
మార్చుఈ జిల్లా కైలాషహర్, కుమార్‌ఘాట్ అనే రెండు ఉప విభాగాలు (డివిజన్లు)గా విభజించబడింది. ఈ జిల్లాను కుమార్‌ఘాట్, పెచార్తల్, చండీపూర్, గౌనగర్ అనే నాలుగు బ్లాక్‌లుగా విభజించి అభివృద్ధి కార్యకలాపాల కొనసాగిస్తున్నారు.[2]
రవాణా
మార్చురోడ్డుమార్గం
మార్చుఅస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ నుండి త్రిపుర రాష్ట్రంలోని సబ్రూమ్ వరకు ఉన్న 8వ జాతీయ రహదారి ఈ జిల్లా మీదుగా వెళుతుంది.[3]
రైలుమార్గం
మార్చుఈశాన్య సరిహద్దు రైల్వేకు చెందిన లమ్డింగ్-సబ్రూమ్ రైలు మార్గం ఉనకోటి జిల్లా గుండా వెళుతోంది. జిల్లాలోని ప్రధాన స్టేషను కుమార్‌ఘాట్ రైల్వే స్టేషను నుండి త్రిపుర రాజధాని అగర్తలా, అస్సాం, ధర్మనగర్, ఉదయ్‌పూర్, బెలోనియా వంటి ఇతర ప్రధాన నగరాలకు రైల్వే సౌకర్యం ఉంది.[4]
మూలాలు
మార్చు- ↑ "Feature". Archived from the original on 21 August 2001.
- ↑ "Unakoti District Map".
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 30 December 2020.
- ↑ "Kumarghat Railway station, Indian Rail Info".