త్రిపుర
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్రిపుర (Bengali: ত্রিপুরা) ఈశాన్య భారత దేశము లోని రాష్ట్రము. రాష్ట్ర రాజధాని అగర్తల, ఇక్కడ మాట్లాడే ప్రధాన భాషలు బెంగాళీ, కోక్‌బరోక్.
త్రిపుర | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
అగర్తలా - 23°50′N 91°17′E / 23.84°N 91.28°E |
పెద్ద నగరం | అగర్తలా |
జనాభా (2001) - జనసాంద్రత |
3,191,168 (21వది) - 304/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
10,492 చ.కి.మీ (26వది) - 8 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[త్రిపుర |గవర్నరు - [[త్రిపుర |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
21 జనవరి 1972 - - - ఒకే సభ (60) |
అధికార బాష (లు) | బెంగాళీ, కోక్‌బరోక్ |
పొడిపదం (ISO) | IN-TR |
వెబ్‌సైటు: tripura.nic.in | |
త్రిపుర రాజముద్ర |
చరిత్రసవరించు
త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యముగా ఉండేది. 1949 లో భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యము యొక్క రాజధాని దక్షిణ త్రిపురలో గోమతీ నది తీరమున రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉంది. రాజధానిని తొలుత పాత అగర్తలకు ఆ తర్వాత 19వ శతాబ్దములో ప్రస్తుత అగర్తలకు తరలించబడింది. రాచరిక పరిపాలనకు వ్యతిరేకముగా గణముక్తి పరిషద్ ఉద్యమము ప్రారంభమైనది. ఈ ఉద్యమము యొక్క విజయానికి ఫలితముగా త్రిపుర భారత దేశములో విలీనమైనది. దేశ విభజన తీవ్ర ప్రభావము చూపిన ప్రాంతములలో త్రిపుర కూడా ఒకటి. రాష్ట్రములో ఇప్పుడు బెంగాళీలు (ఇందులో చాలామంది 1971లో బంగ్లాదేశ్ యేర్పడిన తర్వాత పారిపోయి ఇక్కడ ఆశ్రయము పొందిన వారే) స్థానిక గిరిజనులు పక్కపక్కనే సహజీవనము సాగిస్తున్నారు.
రాజకీయాలుసవరించు
త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతము విప్లవ్ కుమార్ ముఖ్యమంత్రిగా భా.జ.పా పరిపాలించుచున్నది. 1977 వరకు రాష్ట్రాన్ని కాంగ్రేసు పార్టీ పరిపాలించింది. 1978 నుండి 1988 వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి 1993లో అధికారములోకి వచ్చింది. 1988 నుండి 1993 వరకు భారత జాతీయ కాంగ్రేసు, త్రిపుర ఉపజాతి యుబ సమితి యొక్క సంకీర్ణ ప్రభుత్వము పాలించింది.2018లో జరిగిన ఎన్నికలలో అప్పటి వరకు ఉన్న వామపక్ష కోటను బద్దలుకొట్టి భాజపా అధికారంలోకి వచ్చింది.
1970 దశాబ్దము చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతున్నది.
దేవాలయాలుసవరించు
జిల్లాలుసవరించు
త్రిపుర జిల్లాలుసవరించు
సంఖ్య | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం
(కి.మీ.²) |
జన సాంద్రత
(/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | DH | దలై జిల్లా | అంబస్స | 3,77,988 | 2,400 | 157 |
2 | GM | గోమతి జిల్లా | ఉదయ్‌పూర్ | 4,36,868 | 1522.8 | 287 |
3 | KH | ఖోవాయ్ జిల్లా | ఖోవాయ్ | 3,27,391 | 1005.67 | 326 |
4 | NT | ఉత్తర త్రిపుర జిల్లా | ధర్మనగర్ | 4,15,946 | 1444.5 | 288 |
5 | SP | సిపాహీజాల జిల్లా | బిశ్రామ్‌గంజ్ | 4,84,233 | 1044.78 | 463 |
6 | ST | దక్షిణ త్రిపుర జిల్లా | బెలోనియా | 4,33,737 | 1534.2 | 283 |
7 | UK | ఉనకోటి జిల్లా | కైలాషహర్ | 2,77,335 | 591.93 | 469 |
8 | WT | పశ్చిమ త్రిపుర జిల్లా | అగర్తలా | 9,17,534 | 942.55 | 973 |