ఉపాధి (Employment) అనగా మనిషి తన జీవన అవసరాల కొరకు ఎంచుకున్న ఆదాయ మార్గం. దీనిని రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఉపాధి లేకపోతే నిరుద్యోగం అని అంటారు. ప్రభుత్వము, ఉపాధి కల్పించడానికి పథకాలు ప్రవేశపెట్టుతుంది. వాటిలో ముఖ్యమైనది జాతీయ ఉపాధి హామీ పథకం

ఆంధ్ర ప్రదేశ్ స్థితి సవరించు

ఆంధ్ర ప్రదేశ్ మానవాభివృద్ధి నివేదిక 2007[1] ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి స్థితి ఈ క్రింది విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని జనాభాలో 50.2 శాతం పనిలో పాల్గొంటున్నారు. ఇది దేశంలోనే ఆత్యధికం. మహిళలు ఎక్కవగా పనిలో పాల్గొంటున్నారు.

వర్గం1993-94 (%) 2004-2005 (%) పెరుగుదల

వ్యవసాయం67.158.5-0.29

వ్యవసాయేతర32.941.53.10

గనులు, త్రవ్వకాలు0.91.23.62

ఉత్పత్తి9.210.92.50

విద్యుత్ శక్తి0.30.1-6.85

నిర్మాణం2.94.55.06

వ్యాపార, ఆతిధ్యం7.510.54.11

రవాణా, గిడ్డంగులు, సమాచార2.54.46.39

ఆర్ధిక, వ్యాపార సేవలు0.71.47.20

పాలన, సమాజసేవలు8.98.40.44

పెరుగుదల: పనివారి సంఖ్యలో (శాతం)

సరళీకరణ విధానాల ఫలితంగా, వ్యవసాయేతర రంగంలో ఉపాధి అంతగా పెరగలేదు. జాతీయ సాంపుల్ సర్వే 61 (2006-07) ప్రకారం ఐటి రంగం (ఐటి ఆధారిత సేవలతో) ఉపాధిశాతం 0.21 (187450 మంది) గా ఉంది. ఇది చాలా వరకు హైదరాబాదు నగరానికి పరిమితమైంది. మధ్య తరగతి ఆదాయ వర్గం పెద్ద పరిమాణంలో వుండటంతో, సరళీకరణ విధానాలవలన బహుళ జాతి సంస్థలు, దేశీయ సంస్థలు వినూత్న ఉత్పత్తులు, సేవలతో రంగంలో దిగటంతో, ఎక్కువ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

నిరుద్యోగం సవరించు

నిరుద్యోగాన్ని సాధారణ స్థితి, ప్రస్తుత వార స్థితి, ప్రస్తుత దిన స్థితిగా లెక్కిస్తారు. సాధారణ స్థితి ఎక్కువకాలపు నిరుద్యోగాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వార స్థితి, ప్రస్తుత దిన స్థితి ఎక్కువకాలపు నిరుద్యోగంతోబాటు, స్వల్ప కాలపు నిరుద్యోగాన్ని కూడా సూచిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగం గణాంకాలు క్రింద ఇవ్వబడినవి.

విద్యా స్థాయి పరిగణించకుండా (ఉపాధి పై ఆసక్తి గల వారందరు)
నిరుద్యోగిత రకం గ్రామీణ (1993-94) పట్టణ (1993-94) గ్రామీణ (2004-05) పట్టణ (2004-05)
సాధారణ స్థాయి 0.8 3.7 1.3 4.0
ప్రస్తుత వార స్థితి 2.7 5.1 3.8 5.2
విద్యా స్థాయి ( మాధ్యమిక ఆ పై, 15 సం వయస్సు పై బడి)
నిరుద్యోగిత రకం గ్రామీణ (1993-94) పట్టణ (1993-94) గ్రామీణ (2004-05) పట్టణ (2004-05)
సాధారణ స్థాయి 7.4 9.5 7.0 7.8
ప్రస్తుత వార స్థితి 7.7 9.7 9.2 10.4

నిరుద్యోగిత 2004-05 లో పెరిగింది. ఇది భారతదేశం గణాంకాల కంటే తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. విద్యావంతులలో నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.

ఉపాధి మార్పులు (1993-94, 2004-05)
ఉపాధి రకం గ్రామీణ (1993-94) పట్టణ (1993-94) మొత్తం (1993-94) గ్రామీణ (2004-05) పట్టణ (2004-05) మొత్తం (2004-05)
స్వయం ఉపాధి 47.2 40.1 45.9 47.9 44.5 47.2
క్రమ వేతనం/జీతం 5.2 34.1 10.6 7.2 36.2 13.4
అవసరానికి పనివారు 47.2 25.3 43.1 44.9 19.3 39.4

2004-05 లెక్కల ప్రకారం, 39.4 శాతం అవసరానికి పనివారు ( Casual Labour) గా ఉన్నారు. వీరి శాతం గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ. 1993-94 లెక్కలతో పోల్చితే అవసరానికి పనివారి శాతం తగ్గి స్వయం ఉపాధి, క్రమ వేతనం/జీతం శాతం పెరిగింది.

ఉపాధి శిక్షణ సవరించు

 
కాటోవైస్ 02 యొక్క ప్రాంతీత సాంస్కృతిక ఇనిస్టిట్యూట్ లో ఉద్యోగులకు వికీ-శిక్షణ

ప్రభుత్వ రంగం సవరించు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సామాజికంగా బలహీన వర్గాలకి వివిధ రకాల శిక్షణ ఇస్తున్నది. బిసి స్టడీ సర్కిల్, ఎపి స్టడీ సర్కిల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్, స్టాఫ్ సెలెక్షన్ కమీషన్, బ్యాంకింగ్ సర్వీసు మొదలగు పరీక్షలకుశిక్షణ ఇస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ ఉద్యోగశ్రీ సంస్థ [2] ద్వారా ఉపాధి శిక్షణ కార్యక్రమాలని సమన్వయంచేస్తున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, ఉపాధి కల్పన , మార్కెటింగు పథకం[3] ద్వారా ఉపాధి కల్పన అనుసంధానించబడిన శిక్షణ కోర్సులు ఇస్తున్నది. పేదరిక స్వయంసహాయ బృందాల సభ్యుల కుటుంబాలలో ఒక యువతకి ప్రయోజనం లక్ష్యంగా ఉంది.2003 -2009 మధ్య 270000 మంది శిక్షಣ పొంది అందులోదాదాపు 70 శాతం మంది ఉపాధి పొందారు.

యువజన సేవలు , ఆటల శాఖ [4] వారిశిక్షణ , ఉపాధి అభివృద్ధి సంస్థ (society for training and employment promotion) ద్వారా వివిధ రకాల చేతి వృత్తులలో స్వల్ప కాలిక కోర్సులు నిర్వహించి, ఉపాధి కలిగిస్తున్నారు. దీనిలో ముఖ్యంగా భవన నిర్మాణ రంగ వృత్తులైన ఎలెక్ట్రికల్ హౌస్ వైరింగ్ (10 వతరగతి ఉత్తీర్ణత), రాడ్ బెండింగ్, ప్లంబింగ్ లాంటి (8 వ తరగతి ఉత్తీర్ణత) వాటిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తారు. ఈ కోర్సులు ఒకటి నుండి మూడు నెలల పాటు వుంటాయి. సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాచ్ లు నడుపుతారు. ప్రతి జిల్లా కేంద్రములో స్టెప్ సిఇఒ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు.

భారత ప్రభుత్వ కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌశల్య వృద్ధి పథకం (స్కిల్ డవలప్మెంట్ ఇనీషియేటివ్ స్కీమ్) ద్వారా, 5 వ తరగతి చదివి పాఠశాల వదిలిన వారు, అసంఘటిత రంగంలో కార్మికులు, ఐటిఐ చదివిన వారు, ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చు. 46 రంగాలలో, 1090 మాడ్యులర్ ఎంప్లాయబల్ స్కిల్స్ కోర్సులు [5] అందుబాటులో ఉన్నాయి.. శిక్షణ ఇచ్చే సంస్ధలు, పరీక్ష పెట్టి సర్టిఫికేటు ఇచ్చే సంస్థలు వేరుగా వుంటాయి.ఉత్తీర్ణులైన విద్యార్థులకు, శిక్షణ ఫీజు, పరీక్ష ఫీజు చెల్లిస్తారు. 2007-2012 నాటికి 10 లక్షల లబ్ధిదారులకి ప్రయోజనం చేర్చే లక్ష్యంగా ఉంది.

ప్రైవేట్ రంగం సవరించు

కంప్యూటర్ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువవడంతో, ప్రవేట్ రంగంలో శిక్షణ, సర్టిఫికేషన్ అందుబాటులోకొచ్చాయి. నియత విద్యా రంగంలో విద్యావ్యాసంగం ఆధునిక సాంకేతికాలకు అనుగుణంగా వుండకపోవడం, సంస్థలకు ఆధునిక సాంకేతికాంశాలలో శిక్షణ పొందిన అభ్యర్థులు అవసరమవడంతో, చాలా మంది విద్యార్థులు 10+2 లేక డిప్లొమా లేక డిగ్రీ తరువాత ఇటువంటి కోర్సులు చేసి ఉపాధి పొందగలగుతున్నారు. భారతదేశంలో ఎన్ఐఐటి, ఆప్టెక్, సిఎమ్ఎస్ లాంటి సంస్థలు వీటిని మొదటగా ప్రారంభించగా ఆ తరువాత చాలా సంస్థలు వివిధ రకాల కోర్సుల అందుబాటులోకి తెచ్చాయి. ప్రభుత్వరంగ సంస్థ సి-డాక్ కూడా కోర్సులను ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా అధీకృత సంస్థల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సులు కాలపరిమితి మూడు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు ఉంది. కొన్ని సంస్థలు నియత విద్యారంగంలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని డిగ్రీ కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయి. కొన్ని ప్రధాన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ లు ఈ క్రింద ఇవ్వబడినవి.

ఉపాధి అవకాశమున్న రంగము సవరించు

వ్యవసాయము సవరించు

రైతులు, రైతుకూలీలు ముఖ్యమైన వర్గాలు. రైతుకూలీలకి పంటలు పండే కాలంలో పని దొరుకుతుంది. వ్వవసాయంలో యంత్రాలు వాడటంతో మానవ పని తగ్గుతున్నది. దీనివలన కూలీలు, పంటలు సరిగా పండక రైతులు జీవన అభద్రతకి గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 50% కంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయము ప్రధాన ఉపాధి వనరు.

వ్యాపారము సవరించు

వ్యాపార రంగం స్వయం ఉపాధి అవకాశాలు, సరళీకరణ విధానాల వలన పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలు గొలుసు అంగడులు ఏర్పాటుచేయటంతో, ఆ సంస్థలలో ఉపాధి అవకాశాలు ఎక్కువైనవి.

వస్తు ఉత్పత్తి సవరించు

వస్తు ఉత్పత్తి రంగం అనగా ఆహార పదార్ధాలనుండి, రాకెట్ విడి భాగాల వరకు ఏదైనా ఉత్పత్తి చేయడం.

సేవలు సవరించు

మానవ సమాజానికి అవసరమయ్యే, టెలిఫోన్, బ్యాంకు, వినోదం లాంటి వివిధ రకాల సేవలు. సరళీకరణ విధానాలవలన, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువైనవి. ఈ రంగానికి ఐటి అవసరం ఎక్కువ కావటంతో, బిపిఒ రంగంలో ఎక్కువ ఆవకాశాలు ఏర్పడుతున్నాయి.

బ్యాంకింగ్ సవరించు

బ్యాంకు పరపతి అభివృద్ధికి కీలకం. ప్రైవేటు రంగం ప్రభుత్వ రంగానికి గట్టి పోటీ ఇస్తున్నది.

ఆరోగ్యము సవరించు

ఆరోగ్య సేవలు ప్రైవేటులో ఎక్కువవుతున్నాయి

విద్య సవరించు

మన దేశంలో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి.. పనిచేసే వయస్సు గల జనాభా మనదేశంలో ఎక్కువ. మానావాభి వృద్ధికి ఈ రంగం కీలకం కావటంతో, ఉపాధి అవకాశాలు ఎక్కువవుతున్నాయి.

ఇతరాలు సవరించు

టెలిఫోన్, కోరియర్, ఆతిధ్యం, రవాణా లాంటి ఎన్నోరంగాలలో ఉద్యోగవకాశాలున్నాయి.

ఉపాధి పొందే పద్దతి సవరించు

స్వయం ఉపాధి సవరించు

శిక్షణ, లేక ఐటిఐ కోర్సులు ( 6 నెలలు లేక 12 నెలలు శిక్షణ) తో రకరకాల వృత్తులలో నైపుణ్యతగల కార్మికునిగా స్వయం ఉపాధి లేక ఉద్యోగం పొందవచ్చు. అలాగే ఉన్నత చదువులు, వృత్తి విద్య చదివివన వారు స్వయం ఉపాధిగా కాని వివిధ రకాలైన వస్తు సేవా పరిశ్రమలు ఏర్పాటు చేని కాని స్వయం ఉపాధి పొందవచ్చు. పరిశ్రమల శాఖ, బ్యాంకులు రుణాలు అందజేస్తాయి.

సంస్థలో ఉపాధి (ఉద్యోగం) సవరించు

ప్రభుత్వము సవరించు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు సివిల్ సర్వీస్ పరీక్షలు ముఖ్య మార్గం.

సహకారము సవరించు

వివిధ రకాలైన సహకార సంస్థలలో (బ్యాంకు, పరపతి, వ్యవసాయం మార్కెటింగ్..) వివిధ స్థాయిలలో ఉపాధి అవకాశాలున్నాయి.

స్వచ్ఛంద సంస్థలు సవరించు

దేశంలోని వివిధ సమస్యలకు పరిష్కారం దిశగా లాభాపేక్షలేని సంస్థలలో వివిధ స్థాయిలలో అవకాశాలున్నాయి,

ప్రైవేటు సవరించు

ప్రభుత్వం పబ్లిక్, ప్రేవేటు భాగస్వామ్య పద్ధతిలో చాలా పనులు చేపట్టటంతో, ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి.

కనీస విద్య ఆధారంగా సవరించు

5 నుండి 9 వ తరగతి సవరించు

ఐదవ తరగతి చదివిన వారు వివిధ శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి పొందవచ్చు. ఎనిమిదవ తరగతి చదివిన తరువాత ఐటిఐ కోర్సులు ( 6 నెలలు లేక 12 నెలలు శిక్షణ) తో రకరకాల వృత్తులలో నైపుణ్యతగల కార్మికునిగా స్వయం ఉపాధి లేక ఉద్యోగం పొందవచ్చు.

పదవ తరగతి సవరించు

సెక్యూరిటీ గార్డు, కార్యాలయ సహాయకునిగా ఉపాధి అవకాశాలున్నాయి.

ఇంటర్మీడియట్ విద్య సవరించు

స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ పరీక్ష (ఎంపిసి చదివిన వారు)

డిప్లొమా సవరించు

స్వయం ఉపాధి లేక పరిశ్రమలలో సాంకేతిక నిపుణుడి హోదాలో ఉద్యోగం.

డిగ్రీ సవరించు

సివిల్ సర్వీస్ , ఇతర అవకాశాలు

డాక్టరేట్ సవరించు

పరిశోధన సంస్థలు, బోధనలో అవకాశాలెక్కువ.

ఇవీ చూడండి సవరించు

మూలాలు సవరించు

 1. "ఆంధ్ర ప్రదేశ్ మానవాభివృద్ధి నివేదిక 2007". Archived from the original on 2011-05-31. Retrieved 2010-01-31.
 2. రాజీవ్ ఉద్యోగశ్రీ సంస్థ వెబ్సైటు [permanent dead link]
 3. "ఉపాధి కల్పన , మార్కెటింగు పథకం వెబ్సైటు". Archived from the original on 2010-09-27. Retrieved 2020-01-13.
 4. "యువజన సేవలు , ఆటల శాఖ". Archived from the original on 2010-08-23. Retrieved 2010-11-20.
 5. "మాడ్యులర్ ఎంప్లాయబల్ స్కిల్స్ కోర్సులు వెబ్సైటు". Archived from the original on 2010-03-27. Retrieved 2010-04-17.
 6. "డిఒఇఎసిసిసర్టిఫికేషన్". Archived from the original on 2009-08-06. Retrieved 2011-06-05.
 7. "కాంప్ టిఐఎ". Archived from the original on 2009-05-07. Retrieved 2011-06-05.
 8. "ఐఇఇఇ కంప్యూటర్ సొసైటీ సర్టిఫికేషన్". Archived from the original on 2011-06-07. Retrieved 2011-06-05.
 9. "సి-డాక్ విద్య , శిక్షణ". Archived from the original on 2011-08-08. Retrieved 2011-06-05.
 10. సిస్కో సర్టిఫికేషన్
 11. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్
 12. "రెడ్హేట్ సర్టిఫికేషన్". Archived from the original on 2011-06-08. Retrieved 2011-06-05.
 13. అడోబి సర్టిఫికేషన్
"https://te.wikipedia.org/w/index.php?title=ఉపాధి&oldid=3845551" నుండి వెలికితీశారు