ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 31 వ కులం.ఉప్పర లేదా సగర కులస్థులు భగీరథ వంశీయులు. కులవృత్తి ఉప్పర పని. ఉత్‌+పరియా = ఉప్పర అనే పదానికి అర్థం గడ్డపారతో భూమిని తొలిచేవారని అర్థం. వీరిని ఉప్పరులని అంటారు. ఒరిస్సాలో వీరిని ఎస్టీలలో చేర్చారు. కర్ణాటకలో వీరు బిసి- ఏ వర్గంలో ఉన్నారు.దాదాపు 30 లక్షల జనాభా ఉన్న సగర కులస్థులు దేశమంతటా ఉన్నారు.జోడీ (భార్యాభర్త) లెక్కన వీరికి కాంట్రాక్టర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళతారు. జోడీకి రోజుకు 250 నుంచి 300 రూపాయలకు కూలి. వీరి కులానికి కాంట్రాక్టులు కనీసం 30 శాతం పనులైనా కల్పించాలని కోరుతున్నారు.పనికి వాడే పరికరాల విషయానికి వస్తే ఎంతో కాలం నుంచి సగరులు పార, బొచ్చెకే పరిమితం కాగా, వీరి రెక్కల కష్టంతో పైకెదిగినవారు రెడీమిక్సర్లు తెస్తున్నారు. ఇవి ఒక్క రోజుకు 25 నుంచి 30 మంది ముఠా పనివారి ఉపాధిని మింగేస్తున్నాయి. మిక్సర్‌లు 10 నుంచి 15మంది ఉప్పరులు చేసే పనిని, నాలుగు అంతస్తుల లోపు వినియోగిస్తున్న లిఫ్టులు 15మంది పనిని, పొక్లయినర్లు 50మంది పనిని చేయడంతో వీరు ఉపాధి కోల్పోతున్నారు.జలయజ్ఞం పనుల్లో 200 కోట్ల రూపాయల విలువైన అండర్‌ టనెల్‌ యూనిట్లను బడా కాంట్రాక్టర్లు ప్రవేశపెడుతున్నారు. ఐదు సంవత్సరాలపాటు జరిగేపని వీటివల్ల రెండేళ్ళలోపూర్తవుతోంది. ఎర్త్ వర్క్ మిషన్లు, రోడ్లు వేసే మిషన్లు ఫలితంగా దాదాపు 70 శాతం పనులను ఉప్పర కార్మికులు కోల్పోయారు.ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌ లేకుండా టెండర్లలో పాల్గొనే అవకా శం ఉప్పర్లకు కల్పించాలని కోరుతున్నారు. భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియాను రాష్ర్త ప్రభుత్వం 2007 మే ఒకటవ తేదీ కార్మిక దినోత్సవ వేడుకల్లో ప్రకటించింది.దాన్ని రెండులక్షలకు పెంచుతున్నామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.మృతి చెందినవారికి రిజిస్ట్రేషన్‌, గుర్తింపు కార్డులు లేకపోవటం వల్ల యజమాని లేదా, కాంట్రాక్టర్‌ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.కాంట్రాక్టరు దగ్గర పనిచేస్తూ మరణిస్తే అతనిదే బాధ్యత కనుక కార్మికునికి ముందుగా ఇన్సూరెన్స్ చేయించాల్సిఉంది. కానీ అటువంటి సహాయక చర్యలు జరగడం లేదు.గర్భిణులకు మూడు నెలలపాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కర్నాటక ప్రభుత్వం అక్కడి సగరుల అభివృద్ధికి `కర్నాటక రాజ్య ఉప్పర వెల్‌ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ'ని ఏర్పాటు చేసి ఏడాదికి ఐదు కోట్ల రూపాయల నిధుల విడుదల చేస్తోంది.కాగా నిధులను పది కోట్లకు పెంచాలని అక్కడి భవన నిర్మాణ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. కార్పొరేషన్‌ పేరులో హౌసింగ్‌ కూడా చేర్చాలని కోరుతున్నారు. తమిళనాడులో కూడా కర్నాటక విధానం అమలుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కూడా కర్నాటక విధానం అమలుచేయాలని అభిల భారత సగర మహాసభ కోరుతోంది. సగర ఆర్థిక సహకార సంస్ధను ఏర్పాటు చేయాలని సగరుల కోసం ప్రత్యేకంగా హౌపింగ్‌ బోర్డును ఏర్పాటు చేసి సగర కులానికి చెందిన వ్యక్తినే బోర్డు ఛైర్మన్‌గా ప్రభుత్వం నామినేట్‌ చేయాలని సగర లేబర్‌ కాంట్రాక్‌‌ట కో-ఆపరేటివ్‌ సొసైటీలను ఏర్పాటుచేసి నిర్మాణం పనులు, క్వారీ కాంట్రాక్టులు, ఆయా సొసైటీలకు టెండరు డిపాజిట్‌ (ఇయండి) లేని పద్ధతిలో కేటాయించాలని, సగరలను బిసి-డి గ్రూప్‌నుండి ST బికేటగిరీకి మార్చాలని, కార్మికులను గుర్తించి ఎఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ సగర సంఘం డిమాండ్ చేస్తోంది.

మూలాలుసవరించు

ST

"https://te.wikipedia.org/w/index.php?title=ఉప్పర&oldid=2989734" నుండి వెలికితీశారు