ఉప్పాడ రంగబాబు

శాసనసభ్యుడు
(ఉప్పాడ రంగ బాబు నుండి దారిమార్పు చెందింది)

ఉప్పాడ రంగబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఇతడు భారత జాతీయ కాంగ్రెసు సభ్యునిగా ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం నుండి 1955 లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.

ఉప్పాడ రంగబాబు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడు.
పదవీ కాలము
1955, 1972
నియోజకవర్గము ఇచ్ఛాపురం

వ్యక్తిగత వివరాలు

జననం 1925
రాజకీయ పార్టీ కాంగ్రేసు పార్టీ

రంగబాబు 9-10-1925 తేదీన జన్మించాడు. ఇంటర్ మీడియట్ విద్యానంతరం 1942 లో రాజకీయాలలో ప్రవేశించాడు. 1950 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా, తరువాత ప్రజాపార్టీలోను, లోక్ పార్టీలోను సభ్యుడుగా ప్రజాసేవలను అందించాడు. ఇతడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జిల్లా ప్రొహిబిషన్ కమిటీలోను, ప్లానింగు కమిటీలోను సభ్యునిగా సేవ చేశాడు.

ఇతడు 1972లో తిరిగి ఇచ్ఛాపురం నియోజకవర్గం నుండే శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలుసవరించు

  1. "Election Commission of India.A.P.Assembly results.1972" (PDF). మూలం (PDF) నుండి 2007-09-30 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-06-11. Cite web requires |website= (help)
  • ఆంధ్ర శాసనసభ్యులు, 1955., పేజీ: 1.