ఉమరియా జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఉమరియ జిల్లా (హిందీ:) ఒకటి. ఉమరియా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఉమరియా జిల్లా షాడోల్ డివిజన్‌లో భాగం. 23º38' నుండి 24º20' ఉత్తర అక్షాంశం, 80º28' to 82º12'.తూర్పు రేఖాంశంలో ఉంది. 2011 గణాంకాల ప్రకారం ... రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా ఉమరియా జిల్లా అధ్యధిక జనసంఖ్య కలిగిన జిల్లాలలో రెండవదిగా గుర్తించబడింది.[1] మొదటి స్థానంలో హర్దా జిల్లా ఉంది.

ఉమరియా జిల్లా
उमरिया जिला
మధ్య ప్రదేశ్ పటంలో ఉమరియా జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో ఉమరియా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుShahdol
ముఖ్య పట్టణంUmaria
విస్తీర్ణం
 • మొత్తం4,548 కి.మీ2 (1,756 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం6,43,579
 • జనసాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత67.34%
 • లింగ నిష్పత్తి953
Websiteఅధికారిక జాలస్థలి
ఉమారియా జిల్లా, జోహిల్లా నదిపై జలపాతం

భౌగోళికం

మార్చు

జిల్లా వైశాల్యం 4548 చ.కి.మీ. జనసంఖ్య 515,963. ఉమరియా జిల్లా అరణ్యసంపద, ఖనిజ సంపదతో సుసంపన్నమై ఉంది. బొగ్గుగనులు జిల్లాకు ప్రధాన ఆదాయపు వనరుగా ఉన్నాయి.

ఆర్ధికం

మార్చు

జిల్లాలో ప్రధానంగా బొగ్గు విరివిగా లభిస్తుంది. " సౌత్ ఈస్టర్న్ కోయల్ ఫీల్డ్స్ లిమిటెడ్ " జిల్లాలో 8 గనులను నిర్వహిస్తుంది. జిల్లాలో జ్ప్రముఖ " బంధవ్‌ఘర్ నేషనల్ పార్క్ " (తాలా), " సంజయ్ గాంధీ థత్మల్ పవర్ స్టేషను " (మంగ్థర్) ఉన్నాయి. గతంలో సౌత్ రీవా జిల్లాకు ఉమరియా కేంద్రంగా ఉండేది. తరువాత జిల్లా కేంద్రం బంధవ్‌గర్‌కు బదిలీ అయింది. ఇది షాడోల్‌కు 69కి.మీ దూరంలో ఉంది. పట్టణాన్ని కట్నీ, రీవా, షాడోల్‌లతో రహదారి మార్గం అనుసంధానం చేస్తుంది. జిల్లా నుండి ఇతర పట్టణాలకు క్రమానుసార రైళ్ళు లభ్యం ఔతున్నాయి. ఉమరియా రైలు స్టేషను కట్నీ- బిలాస్‌పూర్ రైలు మార్గంలో ఉంది. ఇది " సౌత్ ఈస్టర్న్ రైల్వేలో " భాగం.

చరిత్ర

మార్చు

1988లో విభజనకు ముందు ఉమరియా షహ్‌డోల్‌ జిల్లాలో భాగంగా ఉండేది. ఉమరియా ప్రాంతాన్ని లోఢీ రాజపుత్రులు పాలించారు. నర్మదా నదీతీరంలో ఉన్న బర్మన్ ఘాట్ వద్ద లోఢీ రాజపుత్రులు ప్రఖ్యాతమైన " లక్ష్మీ నారాయణ " ఆలయం నిర్మించారు. నదికి ఉత్తరతీరంలో ఉన్న కరేలిలో మెట్లలో ఏనుగులు రావడానికి హాథీదర్వాజా పేరుతో బృహత్తరమైన ద్వారం నిర్మించారు. తరువాత రీవాకు చెందిన బఘేల్ రాజపుత్రులు లోఢీలను ఓడించి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంధవ్ఘర్ అరణ్యాలు మాహారాజుల వేటప్రాంతంగా సంరక్షించబడింది.

వాతావరణ

మార్చు
  • సగటు వర్షపాతం: 1093 మి.మీ
  • సగటు గరిష్ఠ. ఉష్ణోగ్రత: 46.2 ; °C
  • సగటు కనిష్ఠ. ఉష్ణోగ్రత: 0.0 ; °C

ఆర్ధికం

మార్చు
 
right l Women working on road repairing, Umaria district

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఉమరియా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 643,579, [1]
ఇది దాదాపు. మోంటెంగ్రో దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. వర్మోంట్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 513వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 158 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 24.73%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 953:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 67.34%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు

మార్చు

ఉమరొయాలో బఘేలి భాష మాట్లాడే ప్రజల శాతం 72-91%. ఇది హిందీ భాషను పోలి ఉంటుంది.[5] (జర్మన్, ఇంగ్లీష్ 60% పోల్చితే) [6] భగేల్ ఖండ్ భాషను 78,00,000 మంది ప్రజలు మాట్లాడుతుంటారు. [5]

బంధ్‌గర్ నేషనల్ పార్క్

మార్చు

జిల్లాలో " బంధవ్ ఘర్ నేషనల్ పార్క్" ఉంది. ఇది గతంలో రాజులు వేటాడే ప్రాంతంగా ఉండేది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఇండియన్ నేషనల్ పార్కులలో ఒకటిగా గుర్తినచబడుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. సాల్, వెదురు, అంబలికా చెట్ల మద్య తిరుగుతుంటాయి. ఈ పార్క్ అంతర్జాతీయ గుర్తింపును పొందుతూ ఉంది. బంధ్‌గర్ పూలుల సాంధ్రత దేశంలో మొదటి స్థానంలో ఉంది. 450 చ.కి.మీ అరణ్యంలో 60 పులులు ఉన్నాయి. ఇది కూడా తెల్ల పులుల ప్రంతంగా గుర్తుంచబడుతుంది. ఇక్కడ చివరిగా రాజామార్తాండవర్మ తెల్ల పులిని పట్టుకున్నాడు. తెల్లపులి మోహన్ ప్రస్తుతం స్టఫ్ చేయబడి రీవా రాజభవంలో సంరక్షించబడుతుంది.

ఆకర్షణలు

మార్చు

బంధవ్‌గర్ కోట

మార్చు

ఉమరియా జిల్లాలోని తాలూకాలలో ఒకటి బంధవ్‌గర్. గతంలో ఇది మఘా రాజవంశానికి చెందిన బంధవ్‌గర్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. తరువాత తాలూకా కేంద్రంగా ఉండేది. తరువాత ఉమరియా జిల్లా కేంద్రంగా అయింది. బంధవ్‌గర్ కోట ఆర్కియాలజీ మరొయు చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. కొండ శిఖరాన నిర్మించబడిన ఛేదింపశఖ్యముగాని కోటలలో ఇది ఒకటి. ఇది సముద్రమట్టానికి 2430 మీ. ఎత్తులో ఉంది. కోట రీవా- ఉమరియా రహదారిలో ఉంది. ఉమరియా పట్టణం నుండి ఇది 41 కి.మీ దూరంలో ఉంది.

చండియా రోడ్

మార్చు

చండియా ఉమరియా- కట్నీ రోడ్‌లో ఉంది. ఉమరియా పట్టణానికి 21 కి.మీ దూరంలో ఉంది. చండియా రోడ్ రైల్వే స్టేషను చండియా రైల్వే స్టేషను‌గా గుర్తించబడుతుంది. చండియాకాస్ అత్యధిక ప్రాధాన్యత కలిగినది భావించబడుతుంది. ఆలయ ప్రధాన దైవం కాళిక. కాళికాదేవి నోరు వెడల్పుగా తెరచి ఉంటుంది. దేవి నోటిలో చాచిన నాలుక విరిగి ఉంటుంది. ఇక్కడ పురాతన రామాలయం ఉంది. ఆలయంలో ప్రధాన దైవాలు సీతారాములు. ఇక్కడ ప్రతిసంవత్సరం శివరాత్రికి 3 రోజులు ఉత్సవం నిర్వహించబడుతుంది.

పాలి బీర్సింగ్‌పూర్

మార్చు

పాలి బీర్సింగ్‌పూర్ ఉమరియా- షాహ్‌డోల్ రోడ్డులో ఉంది. ఇది ఉమరియాకు 36 కి.మీ దూరంలో ఉంది. మరొక రహదారి పాలి - మండ్ల వరకు దిదోరి మీదుగా ఉంది. పాలిలో కూడా రైల్వే స్టేషను ఉంది. ఇక్కడ పర్యాటకులకు రెస్ట్ హౌస్ ఉంది. ఈ రైల్వేస్టేషను‌ను పాలి - బీర్సింగ్ స్టేషను అంటారు. రైల్వే స్టేషను సమీపంలో ఒక బిరసినీదేవి ఆలయం ఉంది. ఆమెను కాళీమాతగా భావిస్తారు. ఆలయంలో పలు జైన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆశ్వీజ, శిరాత్రికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి.

ఉమరియా

మార్చు

ఉమరియా జిల్లా బంధవ్‌గర్ తాలూకాలకు కేంద్రంగా ఉండేది. గతంలో ఉమరియా సౌత్ రీవా జిల్లాకు కేంద్రంగా ఉండేది.

సంగ్రా ఆలయం

మార్చు

సంగ్రా ఆలయం రైల్వే స్టేషను సమీపంలో ఉంది. ఇది పురాతన శివాలయం. సమీపకాలంలో పునరుద్ధరించబడింది. ఆలయ ప్రధానద్వారం శిల్పచాతుర్యంతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడి శిల్పం ఖజూరహోశైలిలో ఉంటుంది. ఇది పట్టణానికి 6.5 కి.మీ దూరంలో జ్వాకముఖీ ఆలయ సమీపంలో ఉంటుంది. ఇక్కడ ఖజూరహో శిశ్ల్పశైలిలో ఉన్న మరివాల్ ఆలయంకూడా ఉంది.

బొగ్గుగనులు

మార్చు

ఉమరియాబొగ్గుగనులకు ప్రసిద్ధి. వీటిని 1881లో ఇది రీవా దర్బారుకు బదిలీ చేయబడింది. .

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Montenegro 661,807 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Vermont 625,741
  5. 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  6. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

బయటి లింకులు

మార్చు

23°31′37″N 80°50′17″E / 23.526847°N 80.838106°E / 23.526847; 80.838106

వెలుపలి లింకులు

మార్చు