హర్దా జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హర్దా జిల్లా ఒకటి. హర్దా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 1998లో హర్దా జిల్లా రూపొందించబడింది. జిల్లా భోపాల్ డివిజన్‌లో ఉంది.
హర్దా జిల్లా
हरदा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Narmadapuram |
ముఖ్య పట్టణం | Harda |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,644 కి.మీ2 (1,021 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 5,70,302 |
• జనసాంద్రత | 220/కి.మీ2 (560/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.04% |
• లింగ నిష్పత్తి | 932 |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దులు
మార్చుజిల్లావైశాల్యం 2644 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జనసాంధ్రత 474,174 చ.కి.మీ. 1991 నుండి జనసంఖ్య అభివృద్ధి 25%. హర్దా జిల్లా ఉత్తర సరిహద్దులో సెహోర్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో హోషంగాబాద్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో బేతుల్ జిల్లా, దక్షిణ, పశ్చిమ సరిహద్దులో ఖాండ్వా జిల్లా, వాయవ్య సరిహద్దులో దేవాస్ జిల్లా ఉన్నాయి. 1998లో హోషంగాబాద్ నుండి కొంతభూభాగం వేరుచేసి హర్దా జిల్లా రూపొందించబడింది.
భౌగోళికం
మార్చుహర్దా జిల్లా నర్మదానదీలోయలో ఉంది. నర్మదానది జిల్లాకు ఉత్తర సరిహద్దులో ఉంది. జిల్లా దక్షిణంగా సప్తపురా పర్వతశ్రేణి వైపుగా ఎగువకు పోతుంది. స్త్రీశిశు హత్య ఆధారంగా నిర్మించిన మాతృభూమి చలనచిత్రం హర్దా జిల్లాలో చిత్రీకరించబడింది.
స్వతంత్రోద్యమం
మార్చుమధ్యభారతానికి చెందిన యువ స్వాతంత్ర్య సమరయోధుడు గురు రాధా కిషన్ జిల్లాలోని బిద్ గ్రామంలో 1925లో జన్మించాడు. గురు రాధా కిషన్ బ్రిటిష్ పోలీస్ అధికారులను బహిరంగంగా ఎదిరించాడు. గురు రాధా కిషన్ భారతీయులను దూషిస్తున్న అధికారిని అనేకమంది ప్రజలముందు చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన ఇండోర్లో నిర్వహించిన భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ ఊరేగింపులో జరిగింది. ఈయన ప్రజల అభిమానాన్ని చూదగొన్న స్వతంత్ర సమరయోధుడు.ఆయన విశ్వసనీయత లోకవిదితం. ఆయన పేదలు, సమాజంలో అణగదొక్కబడిన ప్రజల అభివృద్ధి కొరకు వీరోచితంగా పోరాటం సాగించాడు.
మొహమ్మద్ సైయుఫ్ కురేష్
మార్చుమధ్యప్రదేశ్ గవర్నర్ మొహమ్మద్ సైయిఫ్ కురేష్ ఒక సమావేశంలో గురూజి నిస్వార్ధమైన సామాజిల సేవలను కొనియాడాడు. గురూజి స్వాత్రసమరయోధుల భత్యం, సన్మాన నిధి వంటి ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయాన్ని కూడా నిరాకరించాడు. ఆయనకు ఎటువంటి ఆదాయవనరులు లేనప్పటికీ ప్రభుత్వ గుర్తింపును, సహకారాన్ని నిరాకరించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. స్వతంత్ర భారతంలో ఉన్నతాధికార పదవులను అలకరించిన స్వాతంత్ర్య సమరపోరాట వీరులలో గురూజి తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకున్నాడు. హర్దా జిల్లాలోని మరొక స్వాతంత్ర్య సమర యోధుడు వినాయకరావు సహస్రబుదేకు గురూజీతో సత్సంబంధాలు ఉన్నాయి.
సురేష్ మహేష్ దత్ మిశ్రా
మార్చుగాంధేయవాది స్వతంత్ర సమరయోధుడు మహేష్ దత్ మిశ్రా, హిందూ మహాసభ అధ్యక్షుడు నారాయణరావు రఘునానధరావు కెక్రె, గత మంత్రి, ఆర్.ఎస్.ఎస్ ప్రవారక్ మధుకర్ హర్నె, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్లీన్ స్లేట్ ఇంటర్నెట్ డిజైన్ ప్రోగ్రాం, కంసల్టింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఇ.ఇ స్టాంఫోర్డ్ యూనివర్శిటీ గురుదత్తా కూడా హర్దా జిల్లాకు చెందిన వారే.
రామేష్వర్ అగ్నిభోజ్
మార్చుగత పర్లమెంటు సభ్యుడు స్వాతంత్ర్య సమర యోధుడు జిల్లా నుండి మొదటిసారిగా మంత్రిపదవిని వహించిన రామేశ్వర్ అగ్నిభోజ్ జిల్లాలోని దళిత కుటుంబానికి చెందిన వాడు. ఆయన జిల్లాలోని మసంగావ్‌లో జన్మించి దళితుల అభివృద్ధి కొరకు పాటుపడ్డాడు.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 570,302, [1] |
ఇది దాదాపు. | సొలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 534వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 171 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.21%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 932:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 74.04%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
See also
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Wyoming 563,626
వెలుపలి లింకులు
మార్చు- [1] list of places in Harda