ఉమెన్ ఇన్ రెడ్

వికీపీడియాలోని ఒక ప్రాజెక్ట్.

ఉమెన్ ఇన్ రెడ్ అనేది వికీపీడియాలోని ఒక ప్రాజెక్ట్. వికీ వ్యాసాలలో మహిళా వ్యాసాల సంఖ్యను పెంచి ప్రస్తుత లింగవివక్షను పరిష్కరించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. మహిళల జీవిత చరిత్రలు, మహిళల రచనలు, మహిళల సమస్యలకు సంబంధించిన విషయాల గురించి వ్యాసాలను రూపొందించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. వికీపీడియాలో ఈ వ్యాసం లేదు అనే దానిని ఎరుపు రంగులో సూచించే దాన్ని అనుసరించి వికీపీడియా వ్యాసాలలో హైపర్‌లింక్‌ల పేరుతో ఈ ప్రాజెక్టుకు పేరు పెట్టబడింది.

ఉమెన్ ఇన్ రెడ్
ఉమెన్ ఇన్ రెడ్ ప్రాజెక్టు లోగో
స్థాపన2015; 10 సంవత్సరాల క్రితం (2015)
వ్యవస్థాపకులురోజర్ బామ్‌కిన్, రోజీ స్టీఫెన్‌సన్ గుడ్‌నైట్
పద్ధతిsఎడిట్-ఎ-థాన్స్

చరిత్ర

మార్చు

2015లో రోజర్ బామ్‌కిన్ అనే వికీపీడియా వాడుకరి ఈ ఉమెన్ ఇన్ రెడ్‌ ప్రాజెక్టును ప్రతిపాదించింది. తరువాత రోజీ స్టీఫెన్‌సన్ గుడ్‌నైట్ అనే మరొక వాడుకరి తన బృందంతో ఈ ప్రాజెక్టులో చేరింది. మొదట్లో "ప్రాజెక్ట్ ఎక్స్ఎక్స్" అనే పేరు పెట్టగా, అది తరువాత వికీప్రాజెక్ట్ ఉమెన్ ఇన్ రెడ్ గా మార్చబడింది.[1]

ప్రాజెక్ట్ నడుస్తున్న తరువాత, ఎమిలీ టెంపుల్-వుడ్ అనే వాడుకరి కూడా ఇందులో చేరింది. వికీపీడియాలో స్వచ్చంద రచన గురించి ఈమెను ఎవరైనా వేధిస్తున్నప్పుడు, మహిళా శాస్త్రవేత్త గురించి కొత్త వికీపీడియా వ్యాసాన్ని రాయడం ఈమె ప్రత్యేకత.[1]

లింగ అగాధాన్ని పూరించడానికి చేసిన కృషికి స్టీఫెన్‌సన్-గుడ్‌నైట్, టెంపుల్-వుడ్స్ లను 2016లో ఇటలీలోని ఎసినో లారియోలో జరిగిన వికీమానియాలో వికీపీడియాను సహ-స్థాపకుడు జిమ్మీ వేల్స్, వికీపీడియన్స్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించాడు.[1]

పద్ధతులు

మార్చు
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2017 ఉమెన్ ఇన్ రెడ్ ఎడిట్-ఎ-థాన్స్ బ్యాడ్జి

ఉమెన్ ఇన్ రెడ్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోని వివిధ నగరాల్లో వికీపీడియా ఎడిట్-ఎ-థాన్స్ నిర్వహిస్తారు.[2] ఆ రోజంతా వికీపీడియా సవరణ, కొత్తవారికి శిక్షణ కార్యక్రమాలు, మహిళా వ్యాసాల సమాచారం రాయండం వంటివి ఉంటాయి.[3] మహిళా వికీపీడియన్ల సంఖ్యను పెంచడం కూడా ఈ ప్రాజెక్టు మరో లక్ష్యం. వికీపీడియా అనేది "ఎవరైనా రాయగల, మార్చగల ఉచిత స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం" అయినప్పటికీ, 2015 నాటికి వికీపీడియాలో 10 శాతం మాత్రమే మహిళలు వ్యాసాలు రాస్తున్నారు.[4][5][6]

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాడుకరులు వికీపీడియాలో రాయదగిన 150 మహిళల జాబితాలను తయారుచేయడంలో సహాయపడతారు, ఇలా చేయడం వల్ల వ్యాసాలను రాయడం సులభమవుతుంది.[7]

2016, డిసెంబరు 22 నాటికి ఈ ప్రాజెక్టులో భాగంగా 45,000 మహిళా వ్యాసాలు కొత్తగా రాయబడ్డాయి. 2015, జూలై నాటికి ఆంగ్ల భాషా జీవిత చరిత్రలలో 15 శాతం ఉన్న పొడవైన వ్యాసాల శాతం 2016, డిసెంబరు 22 నాటికి 16.8 శాతానికి పెరిగింది.[8]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Redden, Molly (March 19, 2016). "Women in science on Wikipedia: will we ever fill the information gap?". The Guardian. Archived from the original on November 8, 2017. Retrieved 9 January 2021.
  2. Chemistry, The Royal Society of (August 18, 2017). "Improving gender balance on Wikipedia". www.rsc.org. Archived from the original on October 12, 2017. Retrieved 9 January 2021.
  3. "Wikipedia editing marathons add women's voices to online resource". Houston Chronicle. Archived from the original on November 9, 2017. Retrieved 9 January 2021.
  4. Andrew Lih (June 20, 2015). "Can Wikipedia Survive?". www.nytimes.com. Washington. Archived from the original on June 21, 2015. Retrieved 9 January 2021. ...the considerable and often-noted gender gap among Wikipedia editors; in 2011, less than 15 percent were women.
  5. Statistics based on Wikimedia Foundation Wikipedia editor surveys 2011 Archived 2017-07-02 at the Wayback Machine (Nov. 2010-April 2011) and November 2011 Archived జూన్ 5, 2016 at the Wayback Machine (April – October 2011)
  6. Hill, Benjamin Mako; Shaw, Aaron; Sánchez, Angel (June 26, 2013). "The Wikipedia Gender Gap Revisited: Characterizing Survey Response Bias with Propensity Score Estimation". PLoS ONE. 8 (6): e65782. Bibcode:2013PLoSO...865782H. doi:10.1371/journal.pone.0065782. PMC 3694126. PMID 23840366. Archived from the original on December 14, 2014.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  7. Stein, Lucia (December 9, 2016). "Wikipedia edit-a-thon tackles internet gender gap". ABC News. Archived from the original on March 7, 2017. Retrieved 9 January 2021.
  8. Kessenides, Dimitra; Chafkin, Max (December 22, 2016). "Is Wikipedia Woke? The ubiquitous reference site tries to expand its editor ranks beyond the Comic Con set". Bloomberg.com. Archived from the original on September 23, 2017. Retrieved 9 January 2021.

ఇతర లంకెలు

మార్చు