ఉమ్మడి కుటుంబం (సినిమా)

1967 తెలుగు సినిమా

ఉమ్మడి కుటుంబం 1967లో విడుదలైన తెలుగు చలనచిత్రం.తన స్వంత నిర్మాణ సంస్థ రామకృష్ణ, ఎన్. ఎ. టీ కంబైన్స్ పతాకంపై ఎన్ టి రామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారక రామారావు, సావిత్రి, కృష్ణకుమారి మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం టీ. వి. రాజు అందించారు.

ఉమ్మడి కుటుంబం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.టి. రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
సావిత్రి,
ప్రభాకరరెడ్డి,
ఎల్. విజయలక్ష్మి,
సత్యనారాయణ,
వాణిశ్రీ
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ రామకృష్ణ ఎన్.ఎ.టి. కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

థీమ్స్, ప్రభావాలు

మార్చు

సినిమాలో ఒక డ్యూయట్లో కథానాయకిని యమ్‌డన్‌ బ్యూటీ అని వర్ణిస్తారు. ఈ యమ్‌డన్‌ అన్న పదం మొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచి వ్యాప్తిలోకి వచ్చింది. జర్మన్ యుద్ధనౌక ఎం.డన్ అనేది హిందూమహాసముద్రంలో ఒంటరిగా బ్రిటీష్ నౌకాదళాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఆ తర్వాత మద్రాసు తీరానికి వచ్చి పెట్రోలు బంకులపై బాంబులు కురిపించింది. ఆపైన యమ్‌డన్‌ నౌకలోని సిబ్బందిని బంధించినా, యమ్‌డన్‌ అన్న పదబంధం గొప్ప, శక్తివంతమైన, అద్భుతమైన వంటి అర్థాలతో తమిళ, మలయాళ, సింహళ భాషల్లోకి వచ్చి చేరింది. అలా మద్రాసులో వ్యాప్తిలో ఉన్న ఈ పదాన్ని సినిమా పాటలో కవి రాశారు.[1]

అవార్డులు, గౌరవాలు

మార్చు
 • ఉమ్మడి కుటుంబం సినిమాను కేంద్ర ప్రభుత్వం 1968లో మాస్కో చలనచిత్రోత్సవాలకు ఎంపికచేసింది. ఆ సంవత్సరం ఆ ప్రతిష్ఠాత్మక ప్రదర్శన జరుపుకున్న ఏకైక తెలుగు చిత్రం ఉమ్మడి కుటుంబం.[2]

పాటలు

మార్చు
 1. చెప్పాలని వుంది దేవతయే దిగివచ్చి మనుషులలో కలిసిన కథ చెప్పాలని వుంది - ఘంటసాల, పి.సుశీల, రచన: సి. నారాయణ రెడ్డి
 2. కుటుంబం ఉమ్మడి కుటుంబం - ఘంటసాల, పి. లీల, రచన: సి. నారాయణ రెడ్డి
 3. చేతికి చిక్కావే పిట్టా నువ్వు చచ్చిన - ఘంటసాల, ఎన్.టి. రామారావు, రచన: సి. నారాయణ రెడ్డి
 4. జిగిజిగిజిగి జిగి జిగేలుమన్నది చిన్నది - ఎల్. ఆర్. ఈశ్వరి , రచన: సి నారాయణ రెడ్డి
 5. తస్సాదియా తస్సాదియా తమాషైన -ఘంటసాల,ఎన్.టి. రామారావు, రచన:కొసరాజు రాఘవయ్య
 6. బలేమోజుగా తయారైన ఓ పల్లెటూరి - సుశీల, ఘంటసాల, రచన: సి. నారాయణ రెడ్డి
 7. లంకాదహనం (నాటకం) - ఎన్.టి. రామారావు, ఘంటసాల, టి.తిలకం, రచన :కొసరాజు రాఘవయ్య
 8. సదివినోడికన్న ఓరన్న మడేలన్న - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది సత్యం బృందం, రచన: కొసరాజు
 9. సతీసావిత్రి (నాటకం) - ఎన్.టి. రామారావు, ఘంటసాల, టి.తిలకం, రచన:సముద్రాల జూనియర్
 10. హల్లో హల్లో హల్లో మైడియర హల్లో - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, రచన; సి. నారాయణ రెడ్డి .
 11. చెప్పుడు మాటలు వింటే ఎప్పటికీ చేటు, ఘంటసాల, పి.లీల , రచన: సి నారాయణ రెడ్డి.

వనరులు

మార్చు
 • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.
 • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

మూలాలు

మార్చు
 1. యమ్బీయస్, ప్రసాద్. "యమ్‌డన్‌1". గ్రేటాంధ్ర. Retrieved 29 July 2015.
 2. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన