లాలాజలం
లాలాజలం (Saliva) లాలాజల గ్రంధులు నుండి తయారయే స్రావాలు.
ప్రతి రోజూ సుమారు 0.75 నుండి 1.5 లీటర్ల వరకు లాలాజలం తయారౌతుంది. అయితే ఇది వ్యక్తుల్ని బట్టి వారి ఆహారపు అలవాట్లను బట్టి మారుతుంది. మనం నిద్ర పోయినప్పుడు అతి తక్కువగా మాత్రమే ఊరుతుంది.
విధులు
మార్చు- నోరు, ఆహార నాళాన్ని తేమగా ఉంచుతుంది.
- ఆహారంలోని పిండిపదార్ధాలను విచ్ఛిన్నం చేస్తుంది.
- నోటినుండి ఆహారం జీర్ణకోశం వరకు సాఫీగా జారడానికి సాయపడుతుంది.
- నోటిలోని ఆమ్లాల్ని సమానంచేసి దంతక్షయాన్ని నిరోధిస్తుంది.
లాలాజలం అద్భుతం
లాలాజలం మనకే కాదు జంతువులకు కూడా ఇది అద్భుత ఔషధమే. జంతువులకు గాయాలు తగిలితే అవి డాక్టర్ దగ్గరకు పోలేవుకదా. అవి తమ నాలుకతో గాయాన్ని నాకుతాయి. గాయాలు మానుతాయి. మానవులకు కూడా ఇది వర్తిస్తుంది కానీ నాలుకతో నాకవలసిన అవసరంలేదు. నోటిలోని లాలాజలాన్ని గాయం చేతితో తీసి గాయం మీద పూయండి. ఎంత త్వరగా మానుతుందో చూడండి. కండ్లకలక వస్తే చాలాబాధగా ఉంటుంది. కండ్లకలక వస్తే కళ్ళు ఎర్రగా మారడం, మంటలు జిలలు విపరీతమైన బాధఉంటుంది. నోటిలో లాలాజలాన్ని కళ్ళకు కాటుకలాగా పెట్టండి. ఒక్కరోజులో ఎర్రదనం తగ్గుతుంది, మంటలు, జిలలు తగ్గుతాయి. ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కళ్ళద్ధాలు పెట్టకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పిల్లలకు రోజూ ఉదయంలేవగానే వారినోటిలోని లాలాజలం వారికంటికి కాటుకలాగా పెట్టండి. ఇలా మూడునెలలు చేస్తే పిల్లలు కళ్ళద్ధాలు పెట్టుకునే అవస్థ తప్పుతుంది. అతిభయంకరమైన చర్మవ్యాధులు కూడా లాలాజలం పూయడం వలన నయమౌతాయి. సొరియాసిస్ కూడా నయమైన సంఘటనలు ఉన్నాయి భగవంతుడు మన నోట్లోనే మన జబ్బులకు ఔషధాన్ని ఏర్పాటుచేశాడు. ఇంత గొప్ప ఔషధన్ని మన అలవాట్లవల్ల ఉమ్మి, ఉమ్మి వృధా చేసుకుంటున్నాం. ఇది స్వతసిద్దంగా భగవంతుడు మన నోట్లో ఏర్పాటుచేసిన ఔషధం. jaibhaarat.org
ఉమ్మేస్తే రూ.వెయ్యి జరిమానా
మార్చుస్వైన్ఫ్లూతో వణికిపోతున్న పుణె నగరంలో వ్యాధిని అరికట్టడానికి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా విధించనున్నట్లు నగర పాలక సంస్థ ప్రకటించింది. అంతకుముందు ఈ జరిమానా రూ.25గా ఉండేది. ఉమ్మిలో వైరస్ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలదాకా సజీవంగా బతికుండే అవకాశం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. (ఈనాడు27.9.2009)