గాయం

(గాయాలు నుండి దారిమార్పు చెందింది)

గాయం (Injury) అనగా దెబ్బలు తగలడం.

  • శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుండి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయమందుము. గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును.
Minor abrasion injury.

గాయమైనచోట ఇన్ఫ్లమేషన్ కి గురియై 1. వాపు, 2. ఎరుపెక్కడం, 3. ఉష్ణోగ్రత పెరగడం, 4. నొప్పిగా ఉండడం, 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి .

రకాలు సవరించు

శారీరక గాయాలు సవరించు

  • బ్రూయీ -: చర్మము క్రింద రక్తము గూడికట్టి గీక్కు పోయేలా ఉండే గాయము .
  • గంటు: పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును .
  • బొబ్బలు: మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము.
  • బెణుకు: కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడిదుడుకులుగా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు, నొప్పి వచ్చుట.

ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. ఉపశయము చేయుట ప్రధమ చికిత్సలో చూడండి.

గాయం మానడం సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=గాయం&oldid=3028506" నుండి వెలికితీశారు