ఇది 1965లో వచ్చిన ఒక తెలుగు సినిమా. అభ్యుదయ భావాలతో కె.బి.తిలక్ అనుపమ పతాకంపై చిత్రాలు నిర్మించారు.హిందీ చిత్రం 'ఝూలా'కు తెలుగు రూపం ఉయ్యాల జంపాల. స్త్రీపురుష ప్రణయానుబంధానికి సంబంధించిన విశిష్టమైన కథతో రూపొందింది ఈ సినిమా. కళావిలువలు ఉన్నా ఈ చలన చిత్రం ఆర్థికంగా పరాజయాన్నే చవిచూసింది, కానీ సినిమాలోని అపురూపమైన పాటల వల్లనే చిరకాలం సినీ ప్రియులకు గుర్తుండిపోయింది.[1]

ఉయ్యాల జంపాల
(1965 తెలుగు సినిమా)

సినిమాలోని కొండగాలి తిరిగింది పాటలో దృశ్యం
దర్శకత్వం కె.బి.తిలక్
తారాగణం కొంగర జగ్గయ్య,
కృష్ణకుమారి,
వాసంతి,
ప్రభాకరరెడ్డి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ అనుపమ ఫిల్మ్స్
భాష తెలుగు

చిత్రకథ

మార్చు

ఆస్తిపరుడు, ధనవంతుడు అయిన శ్రీపతి(గుమ్మడి)కి మధు(ప్రభాకరరెడ్డి), రవి(జగ్గయ్య) కొడుకులు. రవికి పాటలు రాయడం సరదా కాగా మధుకి ఛాయాగ్రహణం అంటే ఇష్టం. అన్నదమ్ములిద్దరూ గోదావరి ప్రాంతంలో జరుగుతున్న తిరునాళ్ళకు వెళ్ళగా తాను రాసిన పాట పాడుకుంటున్న రవికీ, ఫోటోలు తీస్తున్న మధుకీ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో అందగత్తె అయిన శశిరేఖ(కృష్ణకుమారి) కనిపిస్తుంది. రవి ఆమె ఛాయలకే వెళ్ళలేకపోగా, మధు మాత్రం ఆమెను బతిమాలి ఫోటో తీస్తాడు. ఆ సమయంలోనే ఇద్దరూ ఆమెకు మనసిస్తారు.
మధు స్త్రీలోలుడు. అతను సుశీల అనే అనాథ యువతిని మోసం చేసి, తప్పును రవిపై నెట్టేస్తాడు. శ్రీపతి అది నిజమేనని నమ్మి, రవిని తిట్టడంతో బాధపడి ఇల్లువదిలి వెళ్ళిపోతాడు. రవి గోదావరి మధ్యలోని ఓ లంక గ్రామానికి చేరుకుని అక్కడ రహస్యంగా గోపి అనే పేరుతో సుబ్బయ్య అనే వ్యక్తి ఇంట్లో చేరతాడు. అదే గ్రామంలోని పోస్టుమాస్టారు, బడి పంతులు అయిన వైకుంఠం కూతురే అన్నదమ్ములిద్దరికీ తిరునాళ్ళలో ఎదురుపడ్డ శశరేఖ. ఆమె కోసం వెళ్లి అదే బళ్లో గోపీ(రవి మారుపేరు) మాస్టారుగా చేరతాడు. ఆమెకు రవి పేరిట ప్రేమలేఖలు రాస్తూ ప్రేమిస్తూంటాడు తప్ప తానుగా తన ప్రేమను వ్యక్తం చేయడు. దీన్ని అవకాశంగా తీసుకున్న మధు తానే రవినని మోసగించి శశిని పెళ్ళాడబోతాడు. అతని చేతిలో మోసగింపబడ్డ సుశీల అదే గ్రామంలోని పాఠశాలలో వీటన్నిటికన్నా ముందుగానే టీచరమ్మగా స్థిరపడివుంటుంది. దీనితో నిజం బయటపడుతుంది.
నిజానికి శ్రీపతి స్వంతకుమారుడు రవియేనని, మధు శ్రీపతి స్నేహితుడు మాధవరావు కొడుకని తెలుస్తుంది. చివరకు ఇంతగా ప్రేమించిన వ్యక్తులను మోసగించినందుకు మధు పశ్చాత్తాపం చెంది సుశీలను క్షమించమనడం, నిజం తెలుసుకున్న శ్రీపతి, శశి రవిని ఆదరించడంతో కథ సుఖాంతమవుతుంది.[1]

నిర్మాణం

మార్చు

స్క్రిప్ట్ అభివృద్ధి

మార్చు

ఉయ్యాల జంపాల సినిమా అప్పటికి రెండు దశాబ్దాల క్రితమే విడుదలైన హిందీ సినిమా ఝాలా ఆధారంగా నిర్మించారు. అయితే సినిమాను అచ్చంగా అనుకరించకుండా తెలుగు వాతావరణానికి, జీవినవిధానానికి అనుగుణంగా కథాంశంలో, స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేశారు. ముందుగా పాటలన్నీ స్వరపరిచి వాటికి అనుగుణంగానే కథలోని సన్నివేశాలు, సందర్భాలు రాసుకోవడం విశేషం.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల బృందం
ఉంగరాల జుట్టువాడు, ఊరించే కన్నులవాడు, ఒయ్యారివి నేవేనంటూ, వియ్యమాడ వస్తాడు ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు మంగళంపల్లి బాలమురళీకృష్ణ
ఓ పోయే పోయే చినదాన, నీ తీయని మనసు నాదేనా ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
దాచిన దాగదు వలపు ఇక దాగుడు మూతలు వలదు చక్కని కోపము చల్లని తాపము ఎందుకు మనలో మనకు ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
నీలోన ఊగె నాలోన ఊగె చూడ చక్కటి ఊయలొక్కటి ఉయ్యాల జంపాల ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
రుక్మిణమ్మా రుక్మిణమ్మా కృష్ణమూర్తితో నువ్వు కులికావమ్మా ఆరుద్ర పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల బృందం

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 రవిచంద్రన్, కంపల్లె (22 Feb 2015). "కొండగాలి తిరిగింది... గుండె ఊసులాడింది". ఆదివారం ఆంధ్రజ్యోతి: 22, 23.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.