ఉర్జిత్ పటేల్
ఉర్జిత్ పటేల్ ( 1963 అక్టోబరు 18) ఒక భారతీయ ఆర్థికవేత్త, బ్యాంకర్,, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు. రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా ఉన్నపుడు ద్రవ్య విధానం, ఆర్థిక విధానాలపై పరిశోధన, గణాంకాలు, సమాచార నిర్వహణ, బీమా డిపాజిట్లు, సమాచార హక్కు లాంటి అంశాలు చూసుకునే వాడు. 2016 ఆగస్టు 20 న భారత ప్రభుత్వం రఘురాం రాజన్ తరువాత రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉర్జిత్ పటేల్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రఘురాం రాజన్ పదవీ కాలం 2016 సెప్టెంబరు 4 తో ముగిసింది.సెప్టెంబరు 4 ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవు రోజు కావడంతో[2] 2016 సెప్టెంబరు 6 న ఉర్జిత్ పటేల్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.[3][4]
ఉర్జిత్ పటేల్ | |
---|---|
భారతీయ రిజర్వ్ బ్యాంకు 24 వ గవర్నరు | |
Assumed office సెప్టెంబరు 6 2016 | |
అంతకు ముందు వారు | రఘురాం రాజన్ |
భారతీయ రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నరు | |
In office జనవరి 11 2013 – సెప్టెంబరు 4 2016 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కెన్యా[1] | 1963 అక్టోబరు 28
జాతీయత | భారతీయుడు |
చదువు | యేల్ విశ్వవిద్యాలయం ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లండన్ విశ్వవిద్యాలయం |
వృత్తి | బ్యాంకరు, ఆర్థికవేత్త |
సంతకం |
జీవితం
మార్చుఉర్జిత్ పటేల్ 1963 అక్టోబర్ 28న కెన్యాలో జన్మించాడు. అతని తాతలు గుజరాత్ రాష్ట్రంకు చెందినవారు. పటేల్ భారత స్థూల ఆర్థిక శాస్త్రం, పబ్లిక్ ఫైనాన్స్, మౌలిక సదుపాయాలు, ఆర్థిక మధ్యవర్తిత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పుల ఆర్థిక శాస్త్రం రంగాలలో అనేక సాంకేతిక ప్రచురణలు, పత్రాలను రాయడం జరిగింది.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఆర్ధిక శాస్త్రం(ఎకనామిక్స్) లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, 1986లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందాడు. 1990లో యేల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. 2009 నుంచి బ్రూకింగ్స్ ఇన్ స్టిట్యూషన్ లో నాన్ రెసిడెంట్ సీనియర్ ఫెలోగా ఉన్నారు[5].
జనవరి 2013 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా నియమించబడటానికి ముందు ఉర్జిత్ పటేల్ భారత పౌరసత్వం పొందాడు[6].
పదవులు
మార్చుఉర్జిత్ పటేల్ వృత్తి పరంగా ఎన్నో కీలక పదవులను చేపట్టడం జరిగినది, వాటిలో కొన్ని 1997 నుంచి 2006 వరకు ఐడీఎఫ్ సీ లిమిటెడ్ లో చీఫ్ పాలసీ ఆఫీసర్ గా,1998 నుంచి 2001 వరకు న్యూఢిల్లీలోని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్ గా పనిచేశాడు. 1990 నుంచి 1995 వరకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో అమెరికా, భారత్, బహమాస్, మయన్మార్ సంభందించిన వాటిలో (డెస్క్) పనిచేశాడు[5].
- సలహాదారు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్
- ప్రెసిడెంట్, బిజినెస్ డెవలప్మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్
- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (1997-2006)
- భారత ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ కమిటీ సభ్యుడు (2004-2006)
- నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్
- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
- డిప్యూటీ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4 సెప్టెంబర్ 2016 నుండి 2018)
ప్రస్తుతం
మార్చుఉర్జిత్ పటేల్ 2016 సెప్టెంబర్ నుంచి 2018 డిసెంబర్ వరకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 24వ గవర్నర్ గా పనిచేయడం జరిగింది. ఈ సమయంలో జరిగిన పెద్దనోట్ల రద్దుతో పాటు, వ్యక్తిగత కారణాలతో పటేల్ తన పదవికి రాజీనామా చేసిన తొలి గవర్నర్ గా గుర్తింపు పొందినాడు. ఉర్జిత్ పటేల్ ప్రస్తుతం బీజింగ్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి అభివృద్ధి పెట్టుబడి బ్యాంకు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు.పటేల్ ఆర్థిక శాస్త్రంపై అనేక పుస్తకాలు, పత్రాలను ప్రచురించాడు[7].
మూలాలు
మార్చు- ↑ Roy, Anup. "Urjit Patel: The 'known unknown'". Retrieved 22 August 2016.
- ↑ "Urjit Patel takes over as RBI governor". The Hindu. 5 September 2016.
- ↑ "Urjit Patel appointed RBI Governor". The Hindu. 5 August 2016. Retrieved 5 August 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-09-16. Retrieved 2016-09-21.
- ↑ 5.0 5.1 "Interesting Facts about Urjit Patel | Motilal OswaL". www.motilaloswal.com. Retrieved 2024-01-08.
- ↑ "Former Reserve Bank Governor Urjit Patel named NIPFP chairman". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2024-01-08.
- ↑ "Ex-RBI governor Urjit Patel turns 59 — demonetisation & other deets about him". CNBCTV18 (in ఇంగ్లీష్). 2022-10-28. Retrieved 2024-01-08.