రేవడిచెట్టు

(ఉవ్వ నుండి దారిమార్పు చెందింది)


రేవడిచెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కొమ్మలను వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఎప్పుడు పచ్చగా ఉండే మధ్యరకపు చెట్టు. దీని ఆకులు పొడవుగా ఉండి దీని పైన ఉన్న గీతలు (నాళాలు) మడతలతో ఆకర్షణ కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయ నామం Dillenia indica. రేవడిచెట్టును ఉవ్వ, ఉప్పు పొన్న, కలింగ, చిన్నకలింగ, పెద్దకలింగ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీషులో Sand Paper Tree, Elephant apple అని అంటారు. ఇది సాధారణంగా చిన్నది అయినప్పటికీ 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. తక్కువ నుండి క్రిందికి ఉంటుంది ఈ మొక్క స్థానిక ప్రజలకు తినదగిన పండు. ఈ మొక్కలు చైనా, భారతదేశం, శ్రీలంక, నేపాల్, భూటాన్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ లలో కనిపిస్తాయి. సమతులమైన ఉష్ణోగ్రత తేమతో ఉన్న మొక్క. ఇది 1,100 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. కావలసిన ఉష్ణోగ్రతలు 30 - 40 °C పరిధిలో ఉన్న ప్రాంతాలలో పెరుగుతుంది, దీనికి కావలిసిన వర్షపాతము సంవత్సరలో 3,000 - 4,000 మిమీ పరిధిలో అవసరం . ఎండిపోయిన నేలలలో పెరుగగలదు [1] .

రేవడిచెట్టు
Dillenia indica leaves, fruits & buds in Kolkata, West Bengal, India.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
unplaced
Family:
Genus:
Species:
D. indica
Binomial name
Dillenia indica

ఉపయోగములు: ఆయుర్వేద మందుల తయారీలో మన దేశంలో అస్సాంతో పాటు మొత్తం ఈశాన్యంలోని వివిధ తెగల వారు విస్తృతంగా ఉపయోగించే మూలికలలో ఒకటి. ఇది అడవి హరిత మొక్కలలో ఒకటి. సాంప్రదాయకంగా, పండు లోపల ఉన్న రసంతో చుండ్రు, జుట్టు రాలడానికి చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. ఈశాన్య భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఆకులు, బెరడు, ఆకుల రసాలను కలిపి క్యాన్సర్ విరేచనాల చికిత్స కోసం వాడతారు . ఆకులు, కాండం బెరడును రక్తస్రావ నివారిణి, గా ఉపయోగిస్తారు వీటి ఆకులు, బెరడు, పండ్లు, సంప్రదాయ మందుల తయారు చేయడం లో, యాంటీమైక్రోబయాల్, యాంటీఆక్సిడెంట్, అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ నిరోధతతో ఉన్నవి [2]. కొన్ని పరిశోధనలో మధుమేహం వ్యాధి ( డయాబెటిక్) రక్తంలో గ్లూకోజ్, లిపిడ్ స్థాయిలు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తావని బలమైన యాంటీ డయాబెటిక్ ప్రభావాన్ని కలిగి ఉన్నాయని, మధుమేహ (డయాబెటిస్) వ్యాధిని అదుపు చేయవచ్చని అధ్యయనంలో తెలిసింది[3]

మూలాలు మార్చు

  1. "Dillenia indica - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2020-10-09. Retrieved 2020-10-07.
  2. "DILLENIA INDICA (OUTENGA) AS ANTI-DIABETIC HERB FOUND IN ASSAM: A REVIEW | INTERNATIONAL JOURNAL OF PHARMACEUTICAL SCIENCES AND RESEARCH" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-07.
  3. Kamboj, Parul; Talukdar, Narayan C.; Banerjee, Sanjay K. (2019-11-23). "Therapeutic Benefit of Dillenia indica in Diabetes and Its Associated Complications". Journal of Diabetes Research (in ఇంగ్లీష్). Retrieved 2020-10-07.