ఉషా సుందరం (1923 -ఏప్రిల్ 6, 2010) భారతీయ పైలట్, జంతు సంక్షేమ కార్యకర్త. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి ఈమె మొదటి మహిళా పైలట్.

ఉషా సుందరం
బెంగళూరులో ఉషా సుందరం
జననం1923
మరణంఏప్రిల్ 6, 2010
మద్రాస్, భారతదేశం
వృత్తిపైలట్, జంతు సంక్షేమ కార్యకర్త
జీవిత భాగస్వామివి. సుందరం
పిల్లలు3

వ్యక్తిగత జీవితం మార్చు

ఉషా సుందరం 1923లో కామాక్షి, టీఎస్ కృష్ణమూర్తి దంపతులకు జన్మించింది. ఈమె జూలై 1941లో మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్‌లో కమర్షియల్ పైలట్, ఏవియేషన్ ఇన్‌స్ట్రక్టర్ అయిన వి.సుందరమ్‌ని వివాహం చేసుకుంది. [1] [2] వీరికి ముగ్గురు పిల్లలు – ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. [2]

వృత్తి మార్చు

ఈమె భర్త సుందరం మైసూర్ మహారాజు అయిన జయచామరాజేంద్ర వడియార్ ఆధ్వర్యంలో మైసూర్ ప్రభుత్వంలో సివిల్ ఏవియేషన్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు 1948లో వడియార్ స్థాపించిన జక్కూర్‌లోని ప్రభుత్వ ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ (GFTS) నుండి మే 1, 1949న, ఉష మొదటి ఉత్తీర్ణత సాధించి, స్వతంత్ర భారతదేశంలో పైలట్ లైసెన్స్ పొందిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది.[3] [4] [5] [6] ఆమె భర్త అప్పటి టాటా ఎయిర్‌లైన్స్‌లో అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు చేపట్టినప్పుడు, సుందరం పైలట్‌గా విమానాలను నడిపింది. [7] ఆమె నడిపిన కొన్ని విమానాలలో డగ్లస్ డకోటా, ట్విన్-ఇంజన్ డిసి-3 డకోటా ఉన్నాయి.[8] 1947 నాటి విభజన అల్లర్ల సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుండి ఆమె తన భర్తతో కలిసి రెస్క్యూ మిషన్ విమానాలను నడిపింది.[7] [9] ఈమె డకోటా విమానంకి పైలెట్ గా ఉన్నప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్‌లతో సహా కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశంలోని అనేక మంది నాయకులు మైసూర్ మహారాజాకి చెందిన డకోటా విమానంలో ప్రయాణించారు.[9] [10] ఆమె భర్తతో కలిసి, 27 గంటల్లో పిస్టన్-ఇంజిన్ విమానాన్ని ఇంగ్లండ్ - భారతదేశం మధ్య నడిపి స్పీడ్ రికార్డ్ సృష్టించింది.[11] [12] [13] ఈ రికార్డు 2008 నాటికి ఉంది. [14] ఈ జంటను మద్రాసు ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన డి హావిలాండ్ డోవ్‌ను ఇంగ్లండ్ నుండి భారతదేశానికి నడపడానికి నియమించుకుంది. ఈమె 1996 వరకు విమానాన్ని నడిపింది.[11]

జంతు సంక్షేమ కార్యకర్త మార్చు

ఉషా 1959లో బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా అనే చెన్నైకి చెందిన జంతు సంక్షేమ సంస్థను స్థాపించింది. ఈ ఫౌండేషన్ వీళ్ళ ఇంటి వద్ద ప్రారంభమైంది, తరువాత 1964లో ఒక సంస్థగా స్థాపించబడింది. [15]

మరణం మార్చు

ఉషా ఏప్రిల్ 6, 2010న 86 ఏళ్ల వయస్సులో మద్రాసులో మరణించింది. [16] ఆమె భర్త 1997లో ఆమె కంటే ముందే మరణించాడు. [17]

మూలాలు మార్చు

  1. Sundaram, V. (1998). An Airman's Saga. Bharatiya Vidya Bhavan. ISBN 978-81-7276-102-8.
  2. 2.0 2.1 "A pioneering woman pilot from Bengaluru who flew rescue missions during partition". The Times of India. 2020-09-29. ISSN 0971-8257. Retrieved 2023-06-10.
  3. "A pioneering woman pilot from Bengaluru who flew rescue missions during partition". The Times of India. 2020-09-29. ISSN 0971-8257. Retrieved 2023-06-10.
  4. "Blue Cross of India cofounder Usha Sundaram, 86 – ANIMAL PEOPLE NEWS". newspaper.animalpeopleforum.org. Retrieved 2023-06-10.
  5. Sundaram, V. (1998). An Airman's Saga. Bharatiya Vidya Bhavan. ISBN 978-81-7276-102-8.
  6. Error on call to Template:cite paper: Parameter title must be specified
  7. 7.0 7.1 "A pioneering woman pilot from Bengaluru who flew rescue missions during partition". The Times of India. 2020-09-29. ISSN 0971-8257. Retrieved 2023-06-10.
  8. "Blue Cross of India cofounder Usha Sundaram, 86 – ANIMAL PEOPLE NEWS". newspaper.animalpeopleforum.org. Retrieved 2023-06-10.
  9. 9.0 9.1 Sethu, Divya (2022-03-09). "Independent India's First Woman Pilot Rescued Indians During Partition". The Better India. Retrieved 2023-06-10.
  10. "Book review: V. Sundaram's 'An Airman's Saga'". India Today. Retrieved 2023-06-10.
  11. 11.0 11.1 "A pioneering woman pilot from Bengaluru who flew rescue missions during partition". The Times of India. 2020-09-29. ISSN 0971-8257. Retrieved 2023-06-10.
  12. "Flying high". The Hindu. 2018-04-30. ISSN 0971-751X. Retrieved 2023-06-10.
  13. "Times of India Publications". web.archive.org. 2013-06-14. Archived from the original on 2013-06-14. Retrieved 2023-06-10.
  14. "Blue Cross of India cofounder Usha Sundaram, 86 – ANIMAL PEOPLE NEWS". newspaper.animalpeopleforum.org. Retrieved 2023-06-10.
  15. "Blue Cross of India cofounder Usha Sundaram, 86 – ANIMAL PEOPLE NEWS". newspaper.animalpeopleforum.org. Retrieved 2023-06-10.
  16. "Blue Cross of India cofounder Usha Sundaram, 86 – ANIMAL PEOPLE NEWS". newspaper.animalpeopleforum.org. Retrieved 2023-06-10.
  17. Gupta, Abhijit Sen (2022-03-20). "Usha Sundaram flew rescue missions during partition and piloted VIPs later". The Siasat Daily. Retrieved 2023-06-10.