సి. కాశీం

తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, విమర్శకులు
(చింతకింది కాశీం నుండి దారిమార్పు చెందింది)

చింతకింది కాశీం. తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి, సాహిత్య విమర్శకులు. వృత్తిరీత్యా తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులు.[1] విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలోనూ గణనీయమైన పాత్ర పోషించారు. ఊరూరా తన ఉపన్యాసాలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. అతను సైద్ధాంతిక రాజకీయ విశ్లేషణలనందించిన మేథావి, వక్త.

ఆచార్య డా. సి.కాశీం
డా. సి. కాశీం, తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు, ఓయూ
జననంచింతకింది కాశీం
గ్రామం : అచ్చంపేట, జిల్లా : నాగర్ కర్నూల్
నివాస ప్రాంతంఅచ్చంపేట, తెలంగాణ India
వృత్తితెలుగు ఆచార్యులు
ఉద్యోగంఉస్మానియా విశ్వవిద్యాలయము
ప్రసిద్ధికవి, విమర్శకులు, ఆచార్యులు

స్వస్థలం

మార్చు

నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతానికి చెందిన నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. విప్లవం ద్వారా సామాజిక మార్పు సాధ్యమనే దృక్పథంతో ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. అతను సంపాదకత్వం వహిస్తున్న "నడుస్తున్న తెలంగాణ" మాసపత్రిక తెలంగాణలో బలమైన ప్రతిపక్ష గొంతుగా నిలిచింది.

వృత్తి జీవితం

మార్చు

కాశీం మొదట్లో హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. తర్వాత హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పని చేసారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పని చేస్తున్నారు.

రచనలు

మార్చు
  1. పొలమారిన పాలమూరు (దీర్ఘ కవిత)
  2. గుత్తికొండ (దీర్ఘ కవిత)
  3. నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్నా (వ్యాసాలు)
  4. తెలంగాణ ఉద్యమాలు-పాట (వ్యాసాలు)
  5. తెలంగాణ సాహిత్య వ్యాసాలు
  6. కాశీం కవిత్వం
  7. తెలంగాణ సాహిత్య వ్యాసాలు
  8. మానాల (దీర్ఘ కవిత)
  9. వర్గీకరణ నాలుగు వ్యాసాలు
  10. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు - విద్రోహ రాజకీయాలు (వ్యాసాలు)
  11. ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం (పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం)
  12. ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం (ఎం.ఫిల్ పరిశోధనా పత్రం)

'పొలమారిన పాలమూరు ' రచనను 2003 లో వెలువరించారు. ఇది పాలమూరు జిల్లాలోని తీవ్రమైన కరువు నేపథ్యంలో వెలువరించిన దీర్ఘకవిత. 2003 లో పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లోని టౌన్ హాలులో నిర్వహించిన 'పాలమూరు గోస ' కవి, గాయక సమ్మేళనంలో ఆవిష్కరించి, తన గొంతుకను వినిపించారు.

కాశీం కవిత్వంపై వ్యాఖ్యలు

మార్చు

కాశీం కవిత్వంపై పలువురు రచయితలు, ఆయన ఉద్యమ సహచరులు పలు వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో కొన్ని...

  • "కాశీం కవిత్వం సహజంగా కురిసే వర్షంలా ఉంటుంది. పారే నదిలా ఉంటుంది. మొలకెత్తే విత్తనంలా ఉంటుంది. పంటపొలం లా ఉంటుంది. ఆయన కవిత్వంలో తేమ ఎక్కువ." - నాళేశ్వరం శంకరం
  • "అతని జీవితమే అతన్ని ఇంతటి స్థాయికి తెచ్చింది." - ఎండ్లూరి సుధాకర్
  • "ఆయన కవిత్వంలో అడుగుపెడితే అక్షరాలు తిరగబడుతున్న అలజడినీ, ఇగం పట్టిన పనిముట్టు మంట కాగుతున్న ఇగురం ధ్వనిస్తుంది. ఆయన అనుభవం మన అనుభవంలోకి కవిత్వం ద్వారా ప్రవేశింపగలిగాడు. - నందిని సిధారెడ్డి
  • "కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలే ఆయన కవనాక్షరం రూపుదిద్దుకుంటుంది." -వరవరరావు

అరెస్టు

మార్చు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చింతకింది కాసింను సీపీఐ (మావోయిస్ట్)తో సంబంధాలు కలిగి ఉన్నారని, పట్టణ ప్రాంతాల్లో మావోయిస్టు భావజాలాన్ని ప్రచారం చేశారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు 2020 జనవరి 18న అరెస్టు చేశారు.[2]

మూలాలు

మార్చు
  1. The Hindu (18 January 2020). "OU professor held for Maoist links; 20 students detained" (in Indian English). Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  2. Sakshi (19 January 2020). "ఓయూ ప్రొఫెసర్‌ కాశిం అరెస్టు". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సి._కాశీం&oldid=4294820" నుండి వెలికితీశారు