ఊర్ధ్వపుండ్రాలు

పుండ్రము అనగా గీత! ఊర్ద్వపుండ్రము అనగా నిలువు గీత వైష్ణవానికి ఊర్ధ్వ పుండ్రాలు,శైవానికి త్రిపుండ్రాలు(త్రి=మూడు,పుండ్రాలు=గీతలు). వూర్ధ్వ పుండ్ర ధారణ సంసార బంధం నుంచి తొలగిస్తుందట. వూర్ధ్వ పుండ్రనామాలు వంకరటింకరగా ఉండకూడదు. చూడటానికి సౌమ్యంగా, మనోహరంగా ఉండాలి. ముక్కు మొదలు నుంచి నుదుటి భాగం చివరి వరకూ అటూ ఇటూ కనుబొమల మీదుగా రెండు పక్కలా ఒక అంగుళం వెడల్పు కలదిగానూ, మధ్యలో అంతరాళం రెండు అంగుళాల వెడల్పు ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. నుదురు, రెండు భుజాల పైభాగం, మెడ వెనుక, వెన్నెముక కింద కంఠభాగం అనే ఆ ఆరు స్థానాలలోనూ నాలుగు అంగుళాల వెడల్పున పొట్ట మీద, పొట్టకు అటూ ఇటూ పది అంగుళాల ప్రమాణంతోనూ, బాహువులు, వక్షస్థలం మీద ఎనిమిది అంగుళాల ప్రమాణంతోనూ వూర్ధ్వ పుండ్రాలను ధరించాలి. నామాల మధ్య ఉండే అంతరాళం లో వైష్ణవులు కుంకుమను,శ్రీ వైష్ణవులు పసుపును అలంకరించుకోవాలి.

ఊర్ధ్వపుండ్రాలు