ఎంఎస్ మణి
ఎంఎస్ మణి (1926–2008) మలయాళ సినిమా దర్శకుడు, ఎడిటర్.[1] 1992లో నఖశతంగల్ (1990), అయ్యర్ ది గ్రేట్ (1992) సినిమాలకు ఉత్తమ ఎడిటర్ గా రెండుసార్లు భారత జాతీయ చలనచిత్ర అవార్డును, 1972లో ఎడిటింగ్ విభాగంలో కేరళ స్టేట్ అవార్డును గెలుచుకున్నాడు.[2] 1948లో ఆశాదీపం సినిమాతో సినిమారంగంలోకి వచ్చిన మణి,[3] 300కు పైగా సినిమాలకు ఎడిటింగ్ చేశాడు. ఇతడు ఎడిటింగ్ చేసిన కథాపురుషన్, విధేయన్, సర్గం, ఒరు వడక్కన్ వీరగాథ, అనంతరం, అమృతం గమ్యాలు వంటి సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.[4] అనేక హిందీ, తమిళ సినిమాలకు కూడా ఎడిటింగ్ చేశాడు. డాక్టర్, సత్యభామ, సుబైదా, తలిరుకల్, విలక్కాపట్ట బంధంగల్, జలకన్యక వంటి ఏడు సినిమాకు దర్శకత్వం వహించాడు. 1980లలో ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడిగా నిలిచాడు.[5]
ఎంఎస్ మణి | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు, ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1949–2003 |
జీవిత భాగస్వామి | సీతామణి |
పిల్లలు | కార్తీక్ |
జననం
మార్చుతమిళనాడు రాష్ట్రంలోని తిరువనంతపురంలోని పూజపురకు చెందిన మణి , 1926 నవంబరులో మృత్యుంజయ అయ్యర్ - బాలాంబాల్ దంపతులకు జన్మించాడు.
అవార్డులు
మార్చు- 1990 – అయ్యర్ ది గ్రేట్ చిత్రానికి ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు
- 1992 – సర్గం చిత్రానికి ఉత్తమ ఎడిటింగ్ జాతీయ చలనచిత్ర అవార్డు
- కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
- 1972 – మరమ్ చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
సినిమాలు (కొన్ని)
మార్చుఎడిటర్
మార్చు- ఆశాదీపం (1953)
- స్నేహసీమ (1954)
- కూడప్పిరప్పు (1956)
- నైరు పిడిచ పులివాలు (1958)
- చతురంగం (1959)
- జ్ఞానసుందరి (1961)
- వియర్పింటే విలా (1962)
- పుతీయ ఆకాశం పుతీయ భూమి (1962)
- డాక్టర్ (1963)
- సత్యభామ (1963)
- ఓరు వడక్కన్ వీరగాథ 91989)
- పంజాగ్ని (1986)
- నఖశతంగల్ (1996)
- ఓ ఫాబీ (1992)
- ఈవిడెయో ఒరు శత్రువు (1983)
- వరన్మారే ఆవశ్యముండు (1983)
- పూమాడతే పెన్ను (1984)
- వెల్లం (1984)
- వికటకవి (1984)
- అంజామ్ హిందీ (1986)
- అమృతం గమ్య (1987)
- మాంగై ఒరు గంగై (తమిళం) (1987)
- అరణ్యకం (1988)
- ఒలియంబుకల్ (1990)
- పావకూతు (1990)
- సర్గం (1992)
- పరిణయం (1994)
- ఎన్ను స్వంతం జానకికుట్టి (1998)
- ప్రేమ్ పూజారి (1999)
దర్శకత్వం
మార్చు- పుతీయ ఆకాశం పుతీయ భూమి (1962)
- డాక్టర్ (1963)
- సత్యభామ (1963)
- సుబైదా (1965)
- తలిరుకల్ (1967)
- విలక్కాప్పెట్ట బంధంగల్ (1969)
- జలకన్యక (1971)
మరణం
మార్చుమణి గుండెకు సంబంధించిన వ్యాధితో తన 81 ఏళ్ళ వయసులో 2008, మార్చి 9న చెన్నైలోని శ్రీరామచంద్ర ఆసుపత్రిలో మరణించాడు. ఇతడికి భార్య సీతామణి, ఏకైక కుమారుడు కార్తీక్ ఉన్నారు.[6]
మూలాలు
మార్చు- ↑ "MS Mani:Profile and Biography, Malayalam Movie Editor MS Mani latest Photo Gallery | Video Gallery, Malayalam Movie Editor MS Mani, MS Mani Filimography ,MS Mani Films and Cinemas, MS Mani Awards and Nominations". Archived from the original on 11 September 2014. Retrieved 2023-05-08.
- ↑ "official website of INFORMATION AND PUBLIC RELATION DEPARTMENT OF KERALA". Archived from the original on 2016-03-03. Retrieved 2023-05-08.
- ↑ "MS Mani".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-10. Retrieved 2023-05-09.
- ↑ Vijayakumar, B. (5 June 2011). "ADIMAKAL 1969". The Hindu. Retrieved 2023-05-08.
- ↑ "- Malayalam News". Archived from the original on 11 September 2014.