ఎంఏఎల్ నరసింహారావు

ఎం ఏ ఎల్ నరసింహారావు (ముక్కామల వేంకట లక్ష్మీ నరసింహారావు) నేత్ర వైద్యుడు.[1]

జీవిత విశేషాలు మార్చు

అతను చీమకుర్తి లో కంటి డాక్టరు. అతను తొలిసారి కంటిలోని నల్లగుడ్డును మార్చిన వైద్యుడు. ఇతని వైద్యానికి మెచ్చిన విశ్వనాధ సత్యనారాయణ తాను రాసిన గోపికా గీతలు కావ్యాన్ని అతనికి అంకితమిచ్చాడు,[2] వెంపరాల సూర్యనారాయణ, తుమ్మల సీతారామమూర్తి మొదలైన సాహితీ దిగ్గజాలు ఇతని దగ్గర కంటి వైద్యం కోసం వచ్చేవారు. అతను ప్రకాశం జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గా పనిచేశాడు.అతనికి ఆయుర్వేద పరిషత్ జ్యోతి ప్రధాత బిరుదు ఇచ్చింది.[1] అతను ఒంగోలులో వైద్యశాల ఆరంభించి చాలా ఏళ్ళు సంగీత ఉత్సవాలు నిర్వహించాడు. .తానే వయొలిన్ నేర్చుకున్నాడు. చీమకుర్తి పరిసర గ్రామాలలో సైకిల్ పై తిరిగి ప్రభుత్వ వైద్యునిగా ప్రజలకు వైద్యం చేశాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "స్ఫూర్తిప్రదాత ఎంవిఎల్‌ నరసింహరావు". Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2023-05-28. Retrieved 2022-06-10.
  2. టి శ్రీరంగస్వామి (1994). విశ్వనాథ వారి కృష్ణకావ్యాలు.