ఎం.ఎస్‌.బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

ఎం.ఎస్‌.బాబు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 04 మార్చి 1971
5 వెంకటాపురం (పిళ్లారిమిట్ట) గ్రామం, చిత్తూరు మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఎం.బీల
సంతానం ఇద్దరు

జననం, విద్యాభాస్యంసవరించు

ఎం.ఎస్‌.బాబు 04 మార్చి 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, చిత్తూరు మండలం, 5 వెంకటాపురం (పిళ్లారిమిట్ట) గ్రామంలో జన్మించాడు.[2] ఆయన ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకున్నాడు.[3]

రాజకీయ జీవితంసవరించు

ఎం.ఎస్‌.బాబు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శిగా పని చేస్తూ పూతలపట్టు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎల్. లలిత కుమారిపై 29163 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4]

మూలాలుసవరించు

  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (17 August 2020). "ఎమ్మెల్యే పొలంబాట". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  4. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.