ఎం.ఎస్. చౌదరి

ఎం.ఎస్.చౌదరి గా సుపరిచితులైన మాదల మదుసూదన చౌదరి తెలుగు నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.[1]

ఎం.ఎస్. చౌదరి ముఖచిత్రం

జననంసవరించు

కృష్ణా జిల్లా విజయవాడలో 1980, ఫిబ్రవరి 18 జన్మించాడు. తలిదండ్రులు స్వర్ణకుమారి, సత్యనారాయణ గార్లు.

రంగస్థల ప్రవేశంసవరించు

నటజీవితం 1993 లో "Dr. ABCD" నాటకం ద్వారా బాల నటుడిగా ప్రారంభించాడు. ఇప్పటి వరకు 1000కి పైగా నాటక ప్రదర్శనలిచ్చాడు. ఇవికాక పాఠశాలలో కళాశాలలో 1000కి పైగా ప్రదర్శనలిచ్చాడు. ఎన్.టి.ఆర్. కళా వేదిక (విజయవాడ) కు కోశాధికారిగా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నారు.

ఆంధ్ర నాటక రంగస్థల అభివృద్ధికి కృషిసవరించు

నిర్విరామంగా కళాశాల స్థాయిలోను పరిషత్ విభాగాల్లోను విజయవాడ నగరమందు కల సంస్థలతో మమేకమై ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో రాష్రమంతా తిరుగుతూ అన్ని సమాజాలవారు ప్రదర్శిస్తున్న నాటక ప్రదర్శనలను గమనించిన తర్వాత కనిపించిన కొరత...... దాదాపు ఏ నాటకంలోను యువకళాకారులు కనిపించక పోవటం. ఒకవేళ ఏ నాటకంలోనైన ఉన్నవారికి అసలు ప్రాధాన్యత లేకపోవటం. మనసుని కలవరపెట్టి మనసులో ఓ మంచి జీవితాశయాన్ని నాటింది. కేవలం యువ కళాకారులతోనే నాటక ప్రదర్శనలు చేస్తే గొప్పగా ఉంటుందన్న ఆలోచనలో రంగస్థల యువ కళాకారులను తీర్చిదిద్దటం కోసం 2001వ సంవత్సరములో న్యూస్టార్స్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ అనే సమాజాన్ని విజయవాడ నగరమందు స్థాపించటం జరిగింది. అప్పటికే రైల్వే ఉద్వోగానికి అర్హుడై ఉన్నప్పటికి నాటకరంగం పట్ల మక్కువతో ఉద్వోగ అవకాశాన్ని వదుకుని ఎంచుకన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. కేవలం యువ కళాకారులతో తెలుగు నాటకరంగంలో ఎన్నో ప్రయోగాత్మక నాటక ప్రదర్శనలతో ముందుకి ఉరుకుతున్నాడు.ప్రతీ ఏడాది 150 నుంచి 200 వరకు కొత్తవారిని రంగస్థల పరిచయం చేస్తూ 2018 నాటికి 4 వేల మంdrపైగా విద్యార్థులను నాటకరంగానికి పరిచయం చేశారు.

.కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ అవార్డులుసవరించు

 1. 17 నంది అవార్డులు [2018 నాటికి]
 2. 3 టీటీడీ బంగారు గరుడాఅవార్డులు
 3. 5 సార్లు ఆల్ ఇండియా యూనివర్సిటి సిల్వర్ మెడల్
 4. 6 సార్లు ఇంకంటాక్స్ ఆంధ్ర తెలంగాణ వారికి తర్ఫీదు నిచ్చి 3 గోల్డ్ 3 సిల్వర్ జాతియ్య స్థాయిలో సాధించటం.
 5. రైల్వే వారికి నాటకం లో శిక్షణ ఇచ్చి వారిచేత 5 సార్లు దక్షిణస్థాయిలో రెండు సార్లు జాతియ్యస్తాయిలో బహుమతులు సాదించిపెట్టడం.
 6. ఆల్ ఇండియా యూనివర్సిటీ యూత్ ఫస్ట్ లో స్కిట్ మొదటి బహుమతి (ఆంద్రప్రదేశ్ కు తొలి స్వర్ణం)
 7. రాజముండ్రి పేపర్ మిల్లు వారిచే దర్శక రత్న భీరుదు ప్రదానం
 8. ప్రపంచ తెలుగు మహాసభల గౌరవ పురస్కారం
 9. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల యువ పురస్కారం 2011
 10. సాంస్కృతిక శాఖ వారు నిర్వహించిన ఉత్తమ నాటక రచనల పోటిలలో చారిత్రాత్మక విభాగంలో మొదటి 3 ఉత్తమ రచనలలో ఎం.ఎస్.చౌదరి గారు రచించిన " కొమరం భీం " కూడా ఒకటి.
 11. 2014 గుంటూరు హిందు కళాశాల లలిత కళా సమితి వారు సినీ, రంగస్థల రంగాలలో చేస్తున్న సేవకుగాను లలిత కళా వైజంతి పురస్కారం.
 12. రాష్ట్ర ప్రభుత్వం చే ఊగాధి పురస్కారం 2018

పొందిన మరికొన్ని బహుమతులుసవరించు

 1. 400పైగా ఉత్తమ నటుడిగా, 200పైగా ఉత్తమ దర్శకుడిగా, 1000పైగా కళాశాల పోటీలలో బహుమతులు సాధించారు.

ఇతర అవార్డులు / అర్హతలుసవరించు

 1. భారత స్కౌట్ అండ్ గైడ్స్ సేవాదళంలో 1998లో రాష్ట్రపతి అవార్డు
 2. కే.బి.ఎన్.కళాశాల అథ్లెటిక్స్ చాంపియన్ షిప్
 3. నాగార్జున యునివర్సిటి హాండ్ బాల్ టీం ప్లేయర్
 4. ఎన్ సి సిలో ' బి ' సర్టిఫికెట్ ఆప్టికల్స్ రేస్ లో స్టేట్ ఫస్ట్
 5. ఫైరింగ్ కాంపిటిషన్లో స్టేట్ ఫస్ట్
 6. బ్లడ్ డొనేషన్ లో ఎక్కువసార్లు(28) చేసి బ్లడ్ డోనర్ మెడల్ సాధించడం

పేరెన్నికగన్న ప్రదర్శనలుసవరించు

నాటకాలుసవరించు

 1. నరావతారం
 2. 5 గురిలో ఆరవవాడు
 3. గిలి గిలి గిలి దుంతనక్క
 4. జజ్జనకడి జనారె
 5. హైస్సలకిడి అలికిడి జరిగెనమ్మ కిరికిరి
 6. కొమరం భీం
 7. నానాటి బతుకు నాటకం
 8. సుజలాం సుఫలామ్
 9. భారతావనిలో భలిపశువులు

నాటికలుసవరించు

 1. హలాహలం
 2. విషవలయం
 3. ఓ..లచ్చిగుమ్మాడి
 4. పిపీలికం
 5. షాడోలెస్ మాన్
 6. సంభవామి పదే...పదే...
 7. హెచ్చరిక
 8. ఓహోం ఓహోం బిం
 9. రాజహంస
 10. అశ్రువులు
 11. కాంట్రవర్సి
 12. స్వచ్ఛం శివం సుందరం
 13. నానాటి బతుకు నాటకం[2]

పౌరాణిక నాటకాలుసవరించు

 1. శ్రీకృష్ణదేవరాయలు
 2. విధి
 3. కోదండపాణి

నృత్య నాటికలుసవరించు

 1. సహస్రాబ్దికి స్వాగతం
 2. అనగనగా ఓ... మానవుడు
 3. మస్కిటో
 4. ఎయిడ్స్

రచనలుసవరించు

నాటకాలుసవరించు

 1. నరావతారం
 2. 5 గురిలో ఆరవవాడు
 3. గిలి గిలి గిలి దుంతనక్క
 4. జజ్జనకిడి జనారే..
 5. హైస్సలకిడి అలికిడి జరిగెనమ్మ కిరికిరి
 6. కొమరం భీం
 7. భారతావనిలో భలిపశువులు
 8. ఆదిగురువు అమ్మ

నాటికలుసవరించు

 1. హలాహలం
 2. అశ్రువులు
 3. ఓ..లచ్చిగుమ్మాడి
 4. షాడోలెస్ మాన్
 5. పిపీలికం
 6. రామసురుడు
 7. గురువిందగింజ
 8. ఓ... మనిషి
 9. ఓహోం ఓహోం బిం
 10. అమ్మకింక సెలవా ?
 11. కాంట్రవర్సి
 12. స్యచ్చం శివం సుందరం
 13. తిక్కశంఖరయ్య
 14. మీరెలా అర్థం చేసుకుంటే అలా..!
 15. అమరావతికి ఆమడదూరంలో...
 16. ఇదా నా దేశం?
 17. సర్పనీతి
 18. ఆటవేలది
 19. నో ఛాయిస్

బాలల నాటికలుసవరించు

 1. బాల భరతం
 2. మా వీధి ఎంగిలాకులు
 3. ఆవెచ్చని సముద్రగర్భం
 4. మై నేం ఈజ్ గాంధి
 5. భహిష్కరించండి మమ్మల్ని...,
 6. అల్లూరి సీతారామరాజు
 7. పాఠ్య పుస్తకం
 8. పెద్దయ్యాక రైతునవుతా

వీధి నాటికలుసవరించు

 1. ఇండియా టుడే
 2. రాజు పేద

ప్రహసనాలుసవరించు

 1. నేటి భారతం
 2. రానున్నది ప్రళయమే
 3. కాంచవోయి స్వతంత్ర స్వరూపం
 4. అసలెందుకు
 5. బ్రహ్మచేసిన మట్టిబొమ్మ
 6. అడ్వర్టేజ్ మెంటాల్
 7. ఓ..మనసా నీ విలువెంత
 8. మనోహరం
 9. నేటి కన్యాసుల్కం
 10. ఏకలవ్య...
 11. బ్రతకలేక బ్రతుకుదామని..
 12. కొండమీద కోతి
 13. డిమొన్క్రసి (Demoncracy)

ముఖాభినయాలుసవరించు

 1. సైన్స్ డెవిల్ ఆప్ మెంటల్
 2. సేవ్ మి
 3. గాంధి ఫిలాసఫి
 4. సినిమాహాల్
 5. స్టోన్
 6. సూసైడ్
 7. బ్యాడ్ హాబిట్స్
 8. ఎయిడ్స్

నృత్యనాటికలుసవరించు

 1. అనగనగా ఓ మానవుడు
 2. మస్కిటో
 3. ఎయిడ్స్

ఏకపాత్రాభినయాలుసవరించు

 1. జై జవాన్
 2. ఓ విద్యార్థి
 3. విఘత జీవి
 4. నేను సైతం
 5. పార్వతమ్మ కొడుకు మిలట్రీలో ఉన్నాడు

నటించిన సినిమలుసవరించు

 1. మగాడు
 2. అందరికోసం
 3. ప్రేమించే హృదయం
 4. లక్ష్మి
 5. రెయిన్ బో
 6. జంక్షన్
 7. మహాత్మ
 8. 26th కింగ్ స్టన్
 9. గబ్బర్ సింగ్
 10. బ్రేకప్
 11. ఖర్జూరం
 12. పుటుక్కు జరజర డుబుక్కమే
 13. ఆగడు
 14. మెంటల్ పోలిస్
 15. బాహుబలి

సీరియల్స్సవరించు

 1. అలౌకిక
 2. నమ్మలేని నిజాలు
 3. ఘర్షణ
 4. చి.ల.సౌ. స్రవంతి
 5. శుభలేఖ
 6. సింధూరపువ్వు

సేవాకార్యక్రమాలుసవరించు

2000వ సంత్సరం నుంచి యువ కళాకారులను ప్రోత్సహించే భాగంగా ఆంధ్రరాష్ట్రంలో ఎన్నో కళాశాలలకు ఒక్క పైసా కూడా స్వీకరించకుండా ప్రొడక్షన్ ఖర్చులు కూడా భరించి వారికి నాటకాన్ని నేర్పి కళామతల్లి సేవచేసుకోవడం.

మూలాలుసవరించు

 1. Deccan Chronicle, Life Style (4 June 2019). "Factory of dreams". K Kalyan Krishna Kumar. Archived from the original on 2 July 2019. Retrieved 2 July 2019.
 2. నవ తెలంగాణ. "27 నుండి పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలు". Retrieved 3 March 2017.

ఇతర లంకెలుసవరించు