ఎం.ఐ. షానవాస్ (22 సెప్టెంబర్ 1951 - 21 నవంబర్ 2018) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఎం.ఐ. షానవాస్
ఎం.ఐ. షానవాస్


పదవీ కాలం
2009–2018
ముందు కొత్త నియోజకవర్గం
తరువాత రాహుల్ గాంధీ
నియోజకవర్గం వయనాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-09-22)1951 సెప్టెంబరు 22
కొట్టాయం, ట్రావెన్‌కోర్-కొచ్చిన్, భారతదేశం
మరణం 2018 నవంబరు 21(2018-11-21) (వయసు 67)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

ఎం.ఐ. షానవాస్ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) కార్యనిర్వాక అధ్యక్షుడిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎం.ఐ. షానవాస్ 1951లో అలప్పుజాలో ఇబ్రహీం కుట్టి, నూర్జహాన్ బేగం దంపతులకు జన్మించాడు. షానవాస్ కోజికోడ్‌లోని ఫరూక్ కళాశాల నుండి ఆంగ్లంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎర్నాకులంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఎం.ఐ. షానవాస్ విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి కాలికట్ యూనివర్శిటీ యూనియన్ చైర్మన్‌గా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, కేపీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి ఎం. రహ్మతుల్లాపై 1,53,439 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

ఎం.ఐ. షానవాస్ 2014లో వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 20,870 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 15 సెప్టెంబర్ 2014 నుండి 21 నవంబర్ 2018 వరకు పార్లమెంటు సభ్యుల కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLADS) కమిటీ సభ్యుడిగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సలహా కమిటీ సభ్యుడిగా పని చేశాడు.

షానవాస్ 2018 నవంబరు 21న చెన్నైలో మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[1][2]

మూలాలు

మార్చు
  1. The Indian Express (21 November 2018). "Kerala Congress MP MI Shanavas passes away at 67" (in ఇంగ్లీష్). Retrieved 30 July 2024.
  2. The Hindu (21 November 2018). "KPCC working president M.I. Shanavas passes away" (in Indian English). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.