ఎం.కుటుంబరావు హోమియోపతి వైద్య శాస్త్ర నిపుణులు. డా.గురురాజు గవర్నమెంటు హోమియోపతిక్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.[1]

జీవిత విశేషాలుసవరించు

ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో 1927, డిసెంబరు 11 న జన్మించారు. ఆయన తండ్రి పేరు గురురాజు. ఆయన ఎం.బి.బి.ఎస్, ఎం.బి.ఎస్. (ఆనర్స్), ఎం.డి (ఆనర్స్) పట్టాలు అందుకున్న తరువాత డి.హెచ్.ఎం లలో ఉత్తీర్ణత సాధించారు.

వైద్య సేవలుసవరించు

ఆయన భారత దేశాధ్యక్షులకు గురవ హోమియోపతిక్ వైద్యులుగా ఉండేవారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చి వారి ఇండియన్ మెడిసన్ అండ్ హోమియోపతి విభాగంలో దీర్ఘకాలిక వ్యాధుల నివారన పరిశోధనకు నేతృత్వం వహించారు. సె.జి.హెచ్.ఎస్ హాస్పటల్ కు సూపరింటెండెంట్ గా, డా.గురురాజు గవర్నమెంటు హోమియోపతిక్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల హోమియోపతి శాఖల సలహాదారుగా పనిచేసారు.[2]

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి - కలకత్తా గవర్నింగ్ బాడీ, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చి ఇన్‌ హోమియోపతి మొదలగు సంస్థలకు గౌరవ సభ్యులుగా విశేష సేవలనందించారు. ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హొమియోపతికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతికి సలహా సంఘ సభ్యులుగా ఉండి హోమియో వైద్య రంగానికి గణనీయమైన సేవలలు చేసారు.

మూలాలుసవరించు

  1. "FInal News_66_Website.pdf" (PDF). మూలం (PDF) నుండి 2017-07-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-05-13. Cite web requires |website= (help)
  2. ఆంధ శాస్త్రవేత్తలు (krishnaveni publishers,vijayawada సంపాదకులు.). శ్రీవాసవ్య. 1 August 2011. p. 123. |access-date= requires |url= (help)

ఇతర లింకులుసవరించు