గుడివాడ

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, గుడివాడ మండల పట్టణం

గుడివాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన ప్ర‌ముఖ‌ పట్టణం.[3] ఇది మున్సిపాలిటీ, గుడివాడ రెవెన్యూ డివిజన్‌లోని గుడివాడ మండలానికి ప్రధాన కార్యాలయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగమైన రాష్ట్రంలోని నగరాల్లో ఇది ఒకటి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 118,167 [4]జనాభాతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా కలిగిన ఇరవై-ఏడవ నగరం, భారతదేశంలో మూడు వందవ అత్యధిక జనాభా కలిగిన నగరం.

గుడివాడ
గుడివాడ
విదర్బపురి
భారతదేశంలో గుడివాడ స్థానం
గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం (పాత‌ది)
గుడివాడ is located in India
గుడివాడ
గుడివాడ
భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్‌లో గుడివాడ స్థానం
గుడివాడ is located in Andhra Pradesh
గుడివాడ
గుడివాడ
గుడివాడ (Andhra Pradesh)
Coordinates: 16°26′N 80°59′E / 16.43°N 80.99°E / 16.43; 80.99
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంగుడివాడ
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyగుడివాడ పురపాలకసంఘం
Area
 • Total12.67 km2 (4.89 sq mi)
Population
 (2011)[2]
 • Total1,18,167
 • Density9,300/km2 (24,000/sq mi)
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (ఐ.ఎస్.టి)
పిన్‌కోడ్
521301
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91-08674
Vehicle registrationAP 39

చరిత్ర మార్చు

ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న‌గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.

అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలుతో పాటు గుడివాడ కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి, మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని, ఆ నివేదికను పుణీలో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.

పేరు వెనుక చరిత్ర మార్చు

 
కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను

గుడివాడని పూర్వం గుడులువాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణంలో చాలా దేవాల‌యాలు ఉన్నాయి.

సమీప మండలాలు మార్చు

నందివాడ, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, పామర్రు, ముదినేప‌ల్లి, ఉయ్యూరు

రవాణా సౌకర్యాలు మార్చు

 • గుడివాడ పట్టణం నుండి దగ్గర, దూర అన్నిప్రాంతాల‌కు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
 • గుడివాడ ప్రాంతం నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, రాజ‌మండ్రి, బెజవాడ, తిరుపతి, బెంగుళూరు, హైదరాబాదు, మచిలీపట్నంతోపాటు తెలుగు రాష్ట్రాల‌లో దాదాపు అన్ని ప్రాంతాల‌కు బ‌స్సు, రైల్వే స‌దుపాయం ఉంది.
 • ఈ పట్టణం నుండి 37 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయం ఉంది.

రైలు వసతి మార్చు

 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిచి, బయలు దేరుటకు సిద్దంగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
 • గుడివాడ రైల్వే జంక్షన్.
 • విజ‌య‌వాడ - గుడివాడ - భీమవరం - నరసాపురం
 • గుడివాడ‌ - మచిలీపట్నం
 • గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి, విశాఖపట్నం, ముంబై, షిరిడి, హౌరా, పూరి, భిలాసాపూర్, భువనేశ్వర్, విజయవాడ, హైదరాబాదు, బెంగ‌ళూరు, ఎర్నాకులం, టాటానగర్, చెన్నై రైళ్లు ఉన్నాయి.

సాధారణ బండ్లు మార్చు

 
గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషనులో నిలిచి ఉన్న ఒక ప్యాసింజర్ రైలు.

రైళ్లు వివరాలు:

 • 17049 - మచిలీపట్నం నుండి సికిందరాబాద్.
 • 17255 - నరసాపురం నుండి హైదరాబాదు.
 • 17213 - 17231 - నరసాపురం నుండి నాగర్సొల్.
 • 17210 - కాకినాడ నుండి బెంగళూరు.
 • 17644 - కాకినాడ నుండి చెన్నపట్నం.
 • 18519 - విశాఖపట్నం నుండి ముంబాయి.
 • 17015 - విశాఖపట్నం నుండి హైదరాబాదు.
 • 17404 - నరసాపురం నుండి తిరుపతి.
 • 17479 - పూరి నుండి తిరుపతి.
 • 17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.

గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. ఇది రైల్వే జంక్షన్. విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ

విద్యా సౌకర్యాలు మార్చు

 • ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితం),
 • వి.కె.ఆర్, వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల., ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది.
 • గురురాజు ప్రభుత్వ హొమియోపతీ వైద్య కళాశాల (1945లో స్థాపితం దక్షిణ భారతదేశంలో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
 • కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల.
 • గుడివాడ పట్టణంలో ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాలయ, శ్రీ విద్య, కేవి కామర్సు, బాబు సిద్ధార్ధ మొదగునవి
 • విశ్వ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్

మౌలిక సదుపాయాలు మార్చు

త్రాగునీటి సౌకర్యం మార్చు

ప్రధాన త్రాగునీటి సరఫరా కేంద్రంలో, 106 ఎకరాలలో విస్తరించియున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్.

వైద్య సౌకర్యం మార్చు

ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం మార్చు

ఈ కేంద్రాన్ని 14.46 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధిచేయనున్నారు.

గురురాజా ప్రభుత్వ హోమియో వైద్యశాల మార్చు

బ్యాంకులు మార్చు

 1. అలహాబాదు బ్యాంక్, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కిన్నెర్ కాంప్లెక్స్, గుడివాడ.
 2. ఐసీఐసీఐ బ్యాంకు
 3. యాక్సిస్‌ బ్యాంకు
 4. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
 5. సిటీ యూనియన్‌ బ్యాంకు
 6. ఐ.డి.బి.ఐ.బ్యాంక్.
 7. ఆంధ్ర బ్యాంకు మెయిన్ బ్రాంచ్
 8. ఆంధ్ర బ్యాంకు కే టీ ర్ కాలేజీ బ్రాంచ్
 9. ఆంధ్ర బ్యాంకు ఏ యాన్ ర్ భూషణ్ గుళ్లు బ్రాంచ్
 10. ఆంధ్ర బ్యాంకు వలెవర్తిపాడ్ బ్రాంచ్
 11. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్
 12. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బజార్ బ్రాంచ్
 13. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా గౌరీశంకరపురం బ్రాంచ్
 14. స్టేట్ర్ బ్యాంకు అఫ్ ఇండియా రాజేంద్రనగర్ బ్రాంచ్
 15. ఇండియన్ బ్యాంకు
 16. ఇండియన్ ఓవెర్సెస్ బ్యాంకు
 17. బ్యాంకు అఫ్ ఇండియా
 18. బ్యాంకు అఫ్ బరోడా
 19. కెనరా బ్యాంకు
 20. విజయ బ్యాంకు
 21. సిండికేట్ బ్యాంకు
 22. కోస్టల్ బ్యాంకు
 23. సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా
 24. యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

 • శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం
 • శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం: ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఈ దేవాలయము ప్రసిద్ధి కల దేవాలయము. ఇక్కడ స్వామి వారి కల్యాణము ఒక పేద్ద మహొత్సవంలా జరుగుతాయి. ఈ ఆలయంలో, 2014, నవంబరు-3, సోమవారం నుండి, 6వ తేదీ గురువారం వరకు, స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 6వ తేదీ గురువారం నాడు, స్వామివారికి స్నపనం, విశేష అలంకరణ, వేదవిన్నపం, చతుస్థానార్చన, సర్వ ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారతోరణబలి, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, అనంతరం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. మన గుడి కార్యక్రమం క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అన్నదానసత్రంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, జ్యేష్ఠమాసంలో, శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు.
 • శ్రీ నాగమ్మ తల్లి దేవాలయం:సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయం బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.
 • శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం:ఈ ఆలయంలో 2014, నవంబరు-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు.
 • శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం:ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు.
 • శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం:ఈ ఆలయంలో 2016, ఫిబ్రవరి-18వ తేదీ గురువారంనాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు.
 • శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఈ ఆలయములో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా మూడురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున స్వామివారు చతుర్భుజ ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. మూడవరోజున హనుమజ్జయంతినాడు, స్వామివారు పంచముఖాంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. ఈ మూడురోజులూ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు.
 • శ్రీ శంకరమందిరం:ఈ మందిరం స్థానిక బంటుమిల్లి రహదారిలోని ఉంది.
 • శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015, మే నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన ఆదివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
 • శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం:ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.
 • శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం:ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు.
 • శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం:ఈ ఆలయం స్థానిక నీలామహల్ రహదారిలో ఉంది.
 • మూడు ఉపాలయాల సముదాయం:శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, జూన్-4వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ ఆదివారంనాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శివాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు.
 • శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం:శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016, ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు.
 • శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:ఈ ఆలయం బిళ్లపాడులో ఉంది
 • శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం
 • శ్రీ బాలబావి గణపతి స్వామివారి ఆలయం:ఈ ఆలయం స్థానిక 9వ వార్డులోని కఠారి రంగనాయకమ్మ వీధిలో ఉంది.
 • శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:స్థానిక పామర్రు రహదారిలోని ఈ ఆలయ 19వ వార్షికోత్సవంగా 2015, డిసెంబరు-24వ తేదీ గురువారంనాడు, ఆలయంలోని బాబాకు 108 కలశాలతో క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి నక్షత్రమాలిక పఠనం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.
 • భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం:ఈ ఆశ్రమం కార్మికనగర్ లో, రామాలయం వెనుకఉంది. ఈ ఆశ్రమంలో స్వామివారి 33వ ఆరాధనోత్సవాలు, 2015, ఆగష్టు-23, 24తేదీలలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015, నవంబరు-21వ తేదీ శనివారంనాడు, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016, ఫిబ్రవరిలో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి.
 • శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016, మే-7వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు.
 • శ్రీ పార్శ్వనాథస్వామివారి ఆలయం:గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, పర్వాపజుషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, మార్వాడీలు, 2017, ఆగష్టు-19 నుండి 27 వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ 9 రోజులూ ఉపవాస దీక్షలు పాటించారు. 9వ రోజూ మరియూ ఆఖరి రోజైన 27వతేదీ ఆదివారంనాడు, 18 రకాల పూజా సామాగ్రితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.

శాసనసభ నియోజకవర్గం మార్చు

పూర్తి వ్యాసం గుడివాడ శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

ప్రముఖులు మార్చు

 • కొల్లి ప్రత్యగాత్మ కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కోటయ్య ప్రత్యగాత్మ (1925 అక్టోబరు 31 - 2001 జూన్ 6) (తెలుగు సినిమా దర్శకుడు. ఇతను 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించాడు.
 • అట్లూరి సత్యనాథం ఇర్విన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గాను, ఏరోస్పేస్, మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో మూలాలు కలిగిన అతను ప్రస్తుతం సంయుక్త అమెరికా రాష్ట్రాల పౌరుడు. ఇతను యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసిన రంగాలు: కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస్ లెన్త్ అండ్ టైం స్కేల్స్; కంప్యూటర్ మోడలింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్;మెష్లెస్ అండ్ అదర్ నోవల్ కంప్యుటేషనల్ మెథడ్స్; స్ట్రక్చరల్ లాంగెవిటీ, ఫైల్యూర్ ప్రివెన్షన్, అండ్ హెల్త్ మేనేజ్మెంట్. బహుముఖ ప్రజ్ఞాశాలి.
 • ఎం.కుటుంబరావు హోమియోపతి వైద్య శాస్త్ర నిపుణులు. గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించాడు.

పట్టణ విశేషాలు మార్చు

గుడివాడ పట్టణంలోని గౌతం కాన్సెప్ట్ పాఠశాల సమీపంలో, సర్వే నం.175,176 లలో శ్రీ కాళహస్తి దేవస్థానానికి చెందిన 12 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను, 2012 నుండి రెవెన్యూశాఖ పర్యవేక్షించుస్తుంది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

 1. 1.0 1.1 "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
 2. "District Census Handbook – Krishna" (PDF). Census of India. pp. 16–17, 48. Retrieved 18 January 2015.
 3. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
 4. "Gudivada City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-03-27.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గుడివాడ&oldid=3789899" నుండి వెలికితీశారు