ఎం.టి.వాసుదేవన్ నాయర్
ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళ రచయిత.[1] ఆయన ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.
M. T. Vasudevan Nair | |
---|---|
![]() | |
Born | కుడల్లూరు, పొన్నై తాలూకా, మలబార్ జిల్లా, బ్రిటిష్ ఇండియా | 15 జూలై 1933
Died | 25 డిసెంబరు 2024 కోళికోడ్, కేరళ, భారతదేశం | (aged 91)
Occupation | Novelist, short story writer, screenplay writer, film director |
Language | మలయాళం |
Nationality | Indian |
Alma mater | Victoria College, Palakkad |
Genre | Novel, short story, children's literature, travelogue, essays |
Subject | Social aspects, Oriented on the basic Malayalam family and cultures |
Literary movement | Realism |
Notable works | Naalukettu, Randamoozham, Manju, Kaalam, Asuravithu, "Iruttinte Athmavu" |
Notable awards | Padma Bhushan, Jnanpith, Sahitya Akademi Award, Kerala Sahitya Akademi Award |
Spouse | కళామండలం సరస్వతి |
Website | |
http://www.mtvasudevannair.com/ |
వ్యక్తిగత జీవితం
మార్చువాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూరు గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్ (పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు.
సాహిత్య రంగం
మార్చు1950దశకం తొలినాళ్ళ నుంచీ చిన్నకథలను వ్రాయడం ప్రారంభించిన వాసుదేవన్ నాయర్ 1958లోని నాలుకెట్టు (కేరళ సంప్రదాయ గృహం), 1962లో అసురవిత్తు (రాక్షస బీజం), 1964లో మంజు (మంచు), 1969లో కాలం, 1984లో రాండమూఝం (రెండవ సారి), విలపయత్ర, పతిరవుం పకల్వెలిచెవుం (అర్థరాత్రీ, పగటివెల్తురు), వారణాసి తదితర నవలలను రచించారు. ఇవేకాక నాటికలు, పరిశోధనాత్మక, సాహిత్యాంశాల వ్యాసాలు, యాత్రాచరిత్రలు, ఆత్మకథాత్మక రచనలు రాశారు. సర్పబిందు, నాలుకెట్టు నవలల్లో ఉమ్మడి కుటుంబాలు కలిగిన కేరళ సామాజిక వ్యవస్థలో ఆధునికత తీసుకువస్తున్న మార్పుల గురించి వాసుదేవన్ నాయర్ ప్రస్తావించారు. మంచు నవలలోని కథాంశం ఇద్దరు వ్యక్తుల అర్థరహితమైన నిరీక్షణ గురించి ఉంటుంది. నైనిటాలుకు యాత్రికునిగా వచ్చిన యువకునితో ప్రేమానుబంధం కలిగుండి అతను తిరిగి ఎప్పుడు వస్తాడోనని యువతి ఆకాంక్ష, కొండజాతి స్త్రీ, ఆంగ్లేయ యాత్రికులకు జన్మించి తన తండ్రిని కలవాలని ఆశించే కుర్రాడి నిరీక్షణలను ఇతివృత్తంగా రాశారు.
సినిమాలు
మార్చుఇతడు దర్శకత్వం వహించిన నిర్మాల్యం సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. నఖక్షతంగళ్ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు.
- ఒప్పోల్ (కథ, స్క్రీన్ ప్లే, మాటలు)
- ఓరు వడక్కన్ వీరగాథ
మూలాలు
మార్చు- ↑ "M. T. Vasudevan Nair, Indian writer". Mtvasudevannair.com. 15 July 1933. Archived from the original on 21 మార్చి 2012. Retrieved 2012-07-12.