ఎం.భిక్షపతి యాదవ్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో శేరిలింగంపల్లి శా
(ఎం.భిక్షపతి యాదవ్‌ నుండి దారిమార్పు చెందింది)

ఎం.భిక్షపతి యాదవ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

ఎం.భిక్షపతి యాదవ్‌

మాజీ ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు అరికెపూడి గాంధీ
నియోజకవర్గం శేరిలింగంపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1949
కొండాపూర్ గ్రామం, శేరిలింగంపల్లి మండలం , రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సందయ్య
సంతానం ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు [1]
నివాసం మసీద్‌బండ, కొండాపూర్, హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎం.భిక్షపతి యాదవ్‌ తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా,శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్ గ్రామంలో జన్మించాడు . ఆయన ఆర్.సి.పురం లోని ప్రభుత్వ పాఠశాలలో 1968లో పదవ తరగతి వరకు చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఎం.భిక్షపతి యాదవ్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా 1960వ దశకంలో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1971 నుండి 81వరకు కొండాపూర్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. భిక్షపతి యాదవ్‌ 1981 నుండి 87వరకు ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా పని చేసి, 1988లో నూతనంగా ఏర్పడ్డ శేరిలింగంపల్లి మున్సిపాలిటీకి తొలి చైర్మన్ గా (1988-1992) పని చేశాడు. ఆయన 1993లో ఏర్పడ్డా లయన్స్ క్లబ్ శేరిలింగంపల్లి తొలి చైర్మన్ గా నియమితుడై 1997 వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు. 2000లో శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చైర్మన్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు, 2001లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

ఆయన • 2002 నుండి 2009 వరకు పీసీసీ జాయింట్ సెక్రటరీగా, 2003లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా పని చేశాడు. భిక్షపతి యాదవ్‌ 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డా శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మువ్వా సత్యనారాయణపై 1327 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.[3]

2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ పై అసంతృప్తిగా ఉన్న భిక్షపతి యాదవ్ 18 నవంబర్ 2020లో కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ లో చేరాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (3 March 2020). "మాజీ ఎమ్మెల్యే భిక్షపతి కుమారుడు మృతి". Sakshi. Archived from the original on 11 July 2021. Retrieved 11 July 2021.
  2. TN Satish (2009). "2009 MLA Winners in Andhra Pradesh Assembly". Archived from the original on 14 March 2021. Retrieved 11 July 2021.
  3. Eenadu (26 October 2023). "తొలి ప్రథమ పౌరుడు..ఎమ్మెల్యే ఆయనే". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  4. Sakshi (4 November 2018). "గాంధీ భవన్‌ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు". Archived from the original on 20 January 2021. Retrieved 11 July 2021.