మున్నూరి లక్ష్మణ్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2021 అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[1][2]ఆయన అక్టోబరు 15న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[3]

ఎం.లక్ష్మణ్

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
13 అక్టోబర్ 2021
నియమించిన వారు రామ్‌నాథ్‌ కోవింద్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1965-12-24) 1965 డిసెంబరు 24 (వయసు 58)
వేల్చల్ గ్రామం, మోమిన్‌పేట్‌ మండలం , వికారాబాదు జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎం.లక్ష్మణ్‌ 1965 డిసెంబరు 24లో తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, మోమిన్‌పేట్‌ మండలం, వేల్చల్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా వర్సిటీలో న్యాయవాద విద్యను అభ్యసించి 1991లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[4][5]

వృత్తి జీవితం

మార్చు

ఎం.లక్ష్మణ్‌ హైదరాబాద్, రంగారెడ్డి కోర్టులతో పాటు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి, న్యాయమూర్తుల నియామకానికి నిర్వహించిన పోటీ పరీక్షల్లో అదనపు జిల్లా జడ్జి (ఏడీజే)గా ఎంపికై 2008లో మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టులో ఏడీజేగా నియమితులయ్యాడు. ఆయన నిజామాబాద్, నాంపల్లిలోని ఆర్థికనేరాల ప్రత్యేక కోర్టు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో స్పెషల్‌ జడ్జిగా పనిచేశాడు.

ఎం.లక్ష్మణ్‌ కార్మిక న్యాయస్థానం కోర్టులో విధులు విధులు నిర్వహిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2021 సెప్టెంబరు 16న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సభ్యులు ఉదయ్‌ యూ లలిత్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు వారి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడంతో దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో అక్టోబరు 13న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. Sakshi (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు". Sakshi. Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Namasthe Telangana (13 October 2021). "ఏడుగురు కొత్త జడ్జీలకు రాష్ట్రపతి ఆమోదం". Archived from the original on 14 October 2021. Retrieved 15 October 2021.
  3. ETV Bharat News (15 October 2021). "హైకోర్టు నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  4. Eenadu (14 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకం". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  5. Eenadu (14 October 2021). "హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  6. V6 Velugu (13 October 2021). "తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Andrajyothy (19 August 2021). "సైన్యంలో..న్యాయంలో మహిళలకు జస్టిస్‌". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.