ఎం. రఘుమారెడ్డి
మల్‌రెడ్డి రఘుమారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. తెలుగుదేశం పార్టీ తరపున 1984 నుండి 1989 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]
ఎం. రఘుమారెడ్డి | |||
ఎం. రఘుమారెడ్డి | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మల్లారెడ్డిపల్లి, చింతపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ | 1964 మే 24||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నర్సింహారెడ్డి | ||
జీవిత భాగస్వామి | మణి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
మతం | హిందూ, భారతీయ |
జననం, విద్య
మార్చురఘుమారెడ్డి 1946, జూన్ 27న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, మల్లారెడ్డిపల్లి గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రిపేరు నర్సింహారెడ్డి. అగ్రికల్చర్ విభాగంలో డిగ్రీ పూర్తిచేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
మార్చురఘుమారెడ్డికి 1964, మే 24న మణితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ఉద్యోగ వివరాలు
మార్చుఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ అధికారిగా పనిచేశాడు. వ్యవసాయ అధికారుల సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు.[4]
రాజకీయ జీవితం
మార్చుతెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి వచ్చిన రఘుమారెడ్డి, 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు.[5]
మూలాలు
మార్చు- ↑ "8th Loksabha Members". www.loksabha.nic.in. Archived from the original on 2021-09-29. Retrieved 2021-11-08.
- ↑ Sakshi (14 October 2023). "ఎమ్మెల్యేలయ్యారు.. ఎంపీలూ అయ్యారు!". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
- ↑ "Loksabha Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
- ↑ "Shri M. Raghuma Reddy | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.
- ↑ "ఎమ్మెల్యే అయ్యారు.. ఎంపీ అయ్యారు !". Sakshi. 2018-11-05. Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.