ఎం. సి. సేతల్వాద్

న్యాయవాది మరియు రాజకీయవేత్త

ఎం.సి సేతల్వాద్ (1884 – 1974) భారతీయ న్యాయవాది. అతను అత్యధిక కాలం భారతదేశానికి సేవలంచిందిన మొదటి అటార్నీ జనరల్. (1950–1963).[1] భారతదేశ ప్రభుత్వంచే దేశంలో చట్టబద్ధమైన సంస్కరణలకు తప్పనిసరిగా ఉండవలసిన "మొదటి భారతదేశ న్యాయ కమీషన్"కు అతను చైర్మన్ గా (1955–1958) కూడా వ్యవహరించాడు. 1961 లో అతను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా కూడా ఉన్నాడు.[2]

ఎం.సి.సేతల్వాద్

భారతదేశ అటార్నీ జనరల్
పదవీ కాలం
28 జనవరి 1950 – 1 మార్చి 1963

చైర్మన్, 1వ లా కమీషన్ ఆఫ్ ఇండియా
పదవీ కాలం
1955 – 1958

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
బంధువులు తీస్తా సేతల్వాద్, మనుమరాలు
వృత్తి న్యాయవాది

అతను 1957లో భారత ప్రభుత్వ రెండవ అత్యున్నన పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారం పొందాడు.[3]

జీవితంసవరించు

అతను ప్రముఖ న్యాయవాది "చిమన్‌లాల్ హరిలాల్ సేతల్వాద్" కుమారుడు. మోటీలాల్ చిమన్‌లాల్ సేతల్వాద్ బొంబాయిలో పెరిగాడు. అతను ముంబై లోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో చదివాడు.

అతను బొంబాయిలో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభిచాడు. తరువాత బొంబాయి అడ్వకేటి జనరల్ గా సేవలనంచించాడు. 1950 లో జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం యొక్క నిర్మాణాత్మక కాలంలో భారత అటార్నీ జనరల్ గా పదవీ బాధ్యతను చేపట్టాడు.

అతను కొన్నిసార్లు ప్రభుత్వ ముఖ్యమైన కేసులు, మరికొన్నిసార్లు వివాదస్పద కేసులలో వాదించాడు. అతను భారత-పాకిస్తాన్ సరిహద్దు కోసం రాడ్‌క్లిఫ్ ట్రిబ్యునల్లో, కాశ్మీర్ పై అనేక UN కార్యకలాపాలతో కూడా పాల్గొన్నాడు.అతను భారతదేశ మొదటి న్యాయకమిషన్ కు చైర్మన్ గా కూడా వ్యవహరించాడు. ఈ సంస్థ కీలకమైన సంస్కరణలు, శాసనంపై ప్రభుత్వానికి సలహా ఇవ్వలేదు కానీ కమిషన్ యొక్క భవిష్యత్తు కార్యాచరణకు ఒక ప్రణాళికను రూపొందించింది.[4]

అతను 1974లో మరణించాడు.[5]

వ్యక్తిగత జీవితంసవరించు

అతని కుమారుడు అతుల్ సేతల్వాద్ (1933 అక్టోబరు 25 - 2010 జూలై 22) [6] ముంబైలో న్యాయవాది. కోడలు సీతా సేతల్వాద్ గ్రామీణ కళల కళాకారిణి. మనుమరాలు తీస్తా సేతల్వాద్ జర్నలిస్టు, విద్యావేత్త.[7]

గ్రంథములుసవరించు

  • My life; law and other things, 1970.
  • Motilal Chimanlal Setalvad (1968). Bhulabhai Desai. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు