అటార్నీ జనరల్
భారత దేశంలో అత్యున్నత న్యాయాధికారి అటార్నీ జనరల్ (ఆంగ్లం: Attorney General of India). కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. భారత రాజ్యాంగంలోని 76వ అధికరణ అటార్నీ జనరల్ గురించి తెలుపుతుంది.
భారతదేశం |
ఈ వ్యాసం భారతదేశం రాజకీయాలు, ప్రభుత్వంలో ఒక భాగం. |
|
|
|
నియామకం, జీతభత్యాలు
మార్చుఅటార్నీ జనరల్ ను రాష్ట్రపతి నియమిస్తారు. వేతనాలు, ఇతర సౌకర్యాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే వేతనాన్ని అటార్నీ జనరల్ పొందుతారు. వేతనం కేంద్ర సంఘటిత నిధినుండి చెల్లిస్తారు.
అర్హతలు, పదవీకాలం
మార్చుసుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడానికి కావలసిన అన్ని అర్హతలు అటార్నీ జనరల్ కు ఉండాలి. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకూ అధికారంలో కొనసాగవచ్చు. సాధారనంగఅ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సం. వయస్సు పూర్తయ్యేవరకూ. అయినప్పటికీ మధ్యలోనే రాష్ట్రపతి తొలగించవచ్చు. అటార్నీ జనరల్ పదవీ విరమణ చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలనూ స్వీకరించరాదు. ఇతర కమిషన్లకు ఛైర్మన్ గా వ్యవహరించవచ్చు.
అధికారాలు
మార్చుపార్లమెంటు ఉభయ సభల సమావేశాల్లో, దేనిలోనైనా జరిగే చర్చల్లో పాల్గొనే అధికారం అటార్నీ జనరల్ కు ఉంటుంది. కానీ ఓటు వేసే అధికారం ఉండదు. దేశంలోని ఏ న్యాయస్థానంలోనైనా ప్రభుత్వం తరపున వాదించే అధికారం ఉంటుంది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలను అటార్నీ జనరల్ ద్వారానే తీసుకుంటారు. శాసన, రాజ్యాంగ సంబంధమైన విషయాలు, రాష్ట్రపతి, కేంద్ర మంత్రి మండలి అప్పగించే వివిధ అంశాలపై తన అభిప్రాయాలు, న్యాయ సలహాలు తెలియజేస్తారు. అటార్నీ జనరల్ కు సహాయ సహకారాలందించటానికి ప్రభుత్వం సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ ను నియమించవచ్చు.
అటార్నీ జనరల్
మార్చుThe Attorneys General of India since independence are listed below:[1]
అటార్నీ జనరల్ | పదవీకాలం | ప్రధాన మంత్రి |
---|---|---|
ఎం. సి. సేతల్వాద్ | 28.01.1950 - 01.03.1963 | జవహర్ లాల్ నెహ్రూ |
C.K. దఫ్తరీ | 02.03.1963 - 30.10.1968 | జవహర్ లాల్ నెహ్రూ |
నిరెన్ డే | 01.11.1968 - 31.03.1977 | ఇందిరా గాంధీ |
S.V. గుప్తే | 01.04.1977 - 08.08.1979 | మొరార్జీ దేశాయ్ |
L.N. సిన్హా | 09.08.1979 - 08.08.1983 | ఇందిరా గాంధీ |
K. పరాశరన్ | 09.08.1983 - 08.12.1989 | ఇందిరా గాంధీ; రాజీవ్ గాంధీ |
సోలి సొరాబ్జీ | 09.12.1989 - 02.12.1990 | వి.పి.సింగ్; చంద్రశేఖర్ సింగ్ |
G. రామస్వామి | 03.12.1990 - 23.11.1992 | చంద్రశేఖర్ సింగ్; పి.వి. నరసింహారావు |
మిలోన్ కుమార్ బెనర్జీ | 21.11.1992 - 08.07.1996 | పి.వి. నరసింహారావు |
అశోక్ దేశాయ్ | 09.07.1996 - 06.04.1998 | హెచ్.డి.దేవెగౌడ; ఐ.కే.గుజ్రాల్ |
సోలి సొరాబ్జీ | 07.04.1998 - 04.06.2004 | అటల్ బిహారీ వాజపేయి |
మిలోన్ కుమార్ బెనర్జీ | 05.06.2004 - 07.06.2009 | మన్మోహన్ సింగ్ |
జి.ఇ.వాహన్వతి | 08.06.2009 - 07.06.2012 | మన్మోహన్ సింగ్ |
మూలాలు
మార్చు- ↑ "Attorney General of Independent India". Archived from the original on 2012-06-25. Retrieved 2011-01-05.