ఎం.ఆర్.ఐ (MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్" (magnetic resonance imaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లోపల యున్న అవయవాలను చూచుటకై వైద్యులు ఉపయోగిస్తారు, దీని సహాయముతో శస్త్ర చికిత్స చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి" (magnetic resonance tomography) సులభంగ "ఎం.ర్.టి" (M.R.T) అని కూడా పిలుస్థారు.

ఎం.ర్.ఐ యంత్రము
Sequential sections from an MRI of the brain, concurrently showing slices through transverse, sagittal, and coronal planes (left to right).
Para-sagittal MRI of the head, with aliasing artifacts (nose and forehead appear at the back of the head)

చరిత్రసవరించు

ఎం.ర్.ఐను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్ (Felix Block) అనే శాస్త్రవేత్త 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్ధి కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు[1].పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిశోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. పీటర్ మానస్పీల్డ్ (Peter Mansfield), పాల్ లౌతర్బుర్ (Paul Lauterbur, పీటర్ మానస్పీల్డ్ 2003లో నొబెల్ బహుమతి పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.[2][3]

ఎలా పనిచేస్తుందిసవరించు

మనిషి శరీరములో నీరు వుంటుంది, నీటిలోని హైడ్రొజన్ అణువుల్లో ప్రోటాన్లు వుంటాయి, అవి అయస్కాంత తరంగాలచె ప్రభావితం అవుతాయి. ఎం.ర్.ఐ యంత్రములోనికి మనిషిని ప్రవేశ పెట్టిన తరువత మనిషి శరీరము లోనికి అయస్కాంతతరంగాలను ప్రసురింపచేస్తుంది. మనిషి శరీరములో హైడ్రోజన్ అణువులు ప్రభావితం అవుతాయి, దానితో అ అణువులలో వుండే ప్రోటాన్లు ఆ అయస్కాంత తరంగాలు వస్తున్న దిక్కునకు తగ్గటుగా వరుసక్రమములో నిలబడుతయి.అలా నిలిచిన ప్రోటాన్లు ద్వారా అయస్కాంత శక్తి శరీరములోనికి ప్రవహిస్తాయి, యం.ర్.ఐ యంత్రము ఆ తరంగలను ఆపినవెంటనే మనిషి శరీరములో వరుసగా నిలబడియున్న ప్రోటాన్లు యధాస్థితికి చేరుతాయి. అలా చేరే సమయములో రేడియో ప్రీక్వెసీ పరిధిలోని అయస్కాంత తరంగాలను వెలువరుస్తాయి, వీటిని అర్.అఫ్. కాయల్స్ ద్వారా సేకరించి, ఆ తరంగాలను సాంఘనిక యంత్రానికి (కంప్యూటర్) అనుసంధించి పురియర్ ట్రాంస్పార్ం అనే పధ్దతి ద్వార మనిషి లోపలి అవయవాల చిత్రాన్ని సాంఘనిక యంత్రము శ్రుష్టిస్తుంది.[1]

ఉపయోగాలుసవరించు

ఎం.ర్.ఐ.ను ఉపయోగించి శరీరములోని గడ్డలను, కండరాల సమస్యలు, మెదడులోని సమస్యలు, మల్టిపల్ స్క్లారసిస్, వెన్ను పూస సమస్యలు మొదలగు వాటిని కనుగొనవచ్చను.

సూచికలుసవరించు

  1. 1.0 1.1 Bio medical instrumentation by Dr.Arumugam
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-20. Retrieved 2013-08-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-09. Retrieved 2013-08-05.

యితర లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎం_అర్_ఐ&oldid=3820092" నుండి వెలికితీశారు