ఎం.కె.వెల్లోడి
ఎం.కె.వెల్లోడి గా ప్రసిద్ధి చెందిన ముల్లత్తు కడింగి వెల్లోడి నారాయణ మెనన్ హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, దౌత్యవేత్త, ప్రముఖ ఇండియన్ సివిల్ సర్వీస్ (ICS) అధికారి.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/47/M.K.Vellodi_in_1951.jpg/150px-M.K.Vellodi_in_1951.jpg)
కేరళీయుడైన వెల్లోడి 1896, జనవరి 14న కేరళ రాష్ట్రములోని మలప్పురముకు 12 కిలోమీటర్ల దూరములో ఉన్న కొట్టక్కళ్ పట్టణములో జామోరిన్ రాజవంశంలో జన్మించాడు. ఈయన తండ్రి కె.సి.మనవేదన్ రాజా 1932 నుండి 1937లో మరణించేవరకు కాలికట్ జామోరిన్ గా ఉన్నాడు. వెల్లోడి ఆ కుటుంబంలో నాలుగవ కుమారునిగా జన్మించాడు.[1] జామోరిన్ కళాశాల ( ఆ తరువాత గురువాయురప్ప కళాశాల) లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 25 యేళ్ల వయసులో ఇండియన్ సివిల్ సర్వీసులో చేరి, ఒకటిన్నర దశాబ్దం పాటు అనేక ప్రదేశాలలో కలెక్టరుగా పనిచేశాడు.[2]
1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 వరకు హైదరాబాదు రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేశాడు. ఈయన భారత ప్రభుత్వముచే నియమించబడిన ముఖ్యమంత్రి
నిర్వహించిన పదవులు
మార్చు- 1928 - తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు
- ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టరు
- 1934 - సంయుక్త కార్యదర్శి
- 1937 మార్చి 18 నుండి 1937 నవంబర్ 26 - గంజాం జిల్లా కలెక్టరు[3]
- 1939 - ఒడిషా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి[4]
- 1940 - భారత ప్రభుత్వంలో ధరల సలహా సూచక అధికారి
- 1942 - 1945 ఎగుమతుల నియంత్రణా అధికారి (బొంబాయి)
- 1945 - భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ కార్యదర్శి
- 1945 నవంబరు - 1947 ఇంగ్లాడులో భారత ఉపరాయబారి
- 1947 - ఇంగ్లాడులో ఆపద్ధర్మ భారత రాయబారి
- 1950 జనవరి 26 నుండి 1952 మార్చి 6 - హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి
- 1954, 55 భారతదేశ రక్షణ కార్యదర్శి
- స్విట్జర్లాండ్లో భారత రాయబారి
- 1957 ఆగష్టు 1 నుండి 1958 జూన్ 4 - భారతదేశ కేబినెట్ కార్యదర్శి [5]
- 1958 - 1958 అక్టోబరు - ప్రణాళికా సంఘ కార్యదర్శి
- 1958 - 1959 ఆస్ట్రియాలో భారత రాయబారి[6]
- 1958 - 1961 జర్మనీలో భారత రాయబారి
మూలాలు
మార్చు- ↑ Raja, K. C. R. (3 November 2010). "A Family Reunion". Kcrraja.com. Archived from the original on 19 ఆగస్టు 2011. Retrieved 31 October 2011.
- ↑ varada Smruti - Abburi Chayadevi
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-04-10. Retrieved 2008-12-24.
- ↑ India in ILO, 1969-1993 By P.A.Sangma
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-01. Retrieved 2008-12-24.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-11. Retrieved 2014-08-05.