ప్రధాన మెనూను తెరువు

ఎక్కిరాల వేదవ్యాస (1934-2014) ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యావేత్త, ఆధ్యాత్మిక పరిశోధకుడు మరియు యోగా గురువు.

ఎక్కిరాల వేదవ్యాస
Sri-vedavyasa-maharshi ekkirala.jpg
ఎక్కిరాల వేదవ్యాస
జననంఎక్కిరాల వేదవ్యాస
(1934-08-13) 1934 ఆగస్టు 13
ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల
మరణం2014 అక్టోబరు 3 (2014-10-03)(వయసు 80)
వృత్తిఐ.ఏ.ఎస్ అధికారి
ప్రసిద్ధిఆధ్యాత్మిక గురువు,రచయిత, పరిశోధకుడు
తండ్రిఅనంతాచార్యులు
తల్లిబుచ్చమ్మ

జీవిత విశేషాలుసవరించు

ఎక్కిరాల వేదవ్యాస ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాపట్ల లో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు 1934 ఆగష్టు 13న జన్మించాడు. అతడు గురుకుల విధానంలో విద్యాభ్యాసం చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రం ఎం.ఎస్.సి. పూర్తిచేసి లయోలా కళాశాల లో జంతుశాస్త్ర విభాగానికి ప్రధానోపాధ్యాయునిగా పనిచేశాడు. ఇండియన్ ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకు 1959 ఉత్తీర్ణుడైన పిదప ఢిల్లీలో పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ లో ఎం.ఫిల్ చేశారు.[1] అతను 1955 జూన్ 22న రాణి సంయుక్తావ్యాస్ ను వివాహమాడాడు.[2] వేదవ్యాస 1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పి.హెచ్.డి చేశారు. వీరు పరిశోధన అంశం: "Astronomical Dating of Maha Bharatha War"

ఐ.ఎస్.ఎస్. పూర్తయిన పిదప వీరు ప్రభుత్వ సర్వీసులో 1959 నుండి వివిధ పదవులను నిర్వహించారు. వాటిలో కర్నూలు జిల్లా స్పెషల్ కలెక్టర్, డిప్యూటీ సెక్రటరీ లాండ్ రెవిన్యూ, మేనేజింగ్ డైరెక్టర్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, డైరెక్టర్ యూత్ సర్వీసులు, సెక్రటరీ టు కమిషనర్ లాండ్ రెవిన్యూ, డైరెక్టర్ ఆఫ్ లాటరీలు, రెవిన్యూ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ రెప్రాన్ ఫుడ్స్, ఎడిటర్ ఆఫ్ స్టేట్ గెజటీర్ [3] నిర్వహించారు.

ఆంధ్ర దేశంలో ఆధ్యాత్మిక ప్రభంజనాన్ని సృష్టించారు. ఐ.ఏ.ఎస్ అధికారిగా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూనే 150కి పైగా గ్రంథాలు రచించాడు. అనేక పరిశోధన గ్రంథాలు రచించారు. ఎన్నో భక్తి సంబంధ ఉపన్యాసాలు ఇచ్చాడు. "శుభవార్త" అనే భక్తి-జోతిష్య-మాసపత్రికను 1975 నుండి నడిపిస్తున్నారు. అతను అక్టోబరు 03, 2014 న మరణించాడు.

రచనలుసవరించు

 1. మహాభారత కాలనిర్ణయం.
 2. ప్రాచీన భగవద్గీత.
 3. ఇండియాలో జీసస్.
 4. శంభల ప్రభు
 5. హస్త సాముద్రికము.
 6. మంత్ర శాస్త్ర రహస్యాలు.
 7. 1999 కలియుగాంతం-కాల జ్ఞానం-1
 8. 1999 కలియుగాంతం-కల్కిభగవానుడు-2
 9. 1999 కలియుగాంతం-"శాంభాల"-రహస్యాలు-3
 10. అణుయుగంలో హిందూమత౦.
 11. సాధన రహస్యాలు.

మూలాలుసవరించు

 1. http://www.vedavyasabharati.org/index.html
 2. "People Behind the Project". Cite web requires |website= (help)
 3. Dr. Vedavyas, Saint of the Space Age by M.V.S. Prasad, IRS published by Yoga Brotherbood of America USCEFI, Hyderabad-Bangalore, 1990.

బయటి లంకెలుసవరించు