ఎటా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఎటా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఎటా జిల్లాకు ముఖ్యపట్టణం. ఎటా జిల్లా అలీగఢ్ డివిజన్‌లో భాగం. ఎటా, కాన్పూర్- ఢిల్లీ హైవే [1] పై ఉంది, సమీప నగరాలు కస్గంజ్, అలీగఢ్. [2] ఉర్దూ కవి అమీర్ ఖుస్రో ఎటాలోని పాటియాలీలో జన్మించాడు

ఎటా
పట్టణం
ఎటా is located in Uttar Pradesh
ఎటా
ఎటా
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 27°38′N 78°40′E / 27.63°N 78.67°E / 27.63; 78.67
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఎటా
Founded byరాజా దిల్ సుఖ్ రామ్ బహదూర్
Population
 (2011)
 • Total1,31,023
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-82
Websitehttp://etah.nic.in/

చరిత్ర మార్చు

7 వ శతాబ్దానికి చెందిన చైనా యాత్రికుడు జువాన్జాంగ్ ఎటా ప్రాంతాన్ని వర్ణిస్తూ, దేవాలయాలు మఠాలతో సమృద్ధిగా ఉందని పేర్కొన్నాడు. 8 వ శతాబ్దానికి ముందు బౌద్ధమతం అణచివేత, గిరిజనుల ఆధిపత్యం తరువాత, తూర్పు వైపుకు వలస వెళ్ళే యాదవులు ఈ ప్రాంతంపై పట్టు సాధించారు. మిగతా ఎగువ భారతదేశంతో పాటు ఇది కూడా 1017 లో ఘజనీ మహమూద్ ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తరువాత ఇది ముస్లిం సామ్రాజ్యంతో పాటు ఉత్థాన పతనాలను చూసింది. 18 వ శతాబ్దం చివరలో, వజీర్ అలీ ఖాన్ పాలించిన ప్రాంతంలో ఒక భాగంగా ఉండేది. 1801 లో లక్నో ఒప్పందం ప్రకారం బ్రిటిష్ రాజ్యంలో చేరింది.

భౌగోళికం మార్చు

ఎటా 27°38′N 78°40′E / 27.63°N 78.67°E / 27.63; 78.67 వద్ద [3] సముద్ర మట్టం నుండి 170 మీటర్ల ఎత్తున ఉంది. ఈసన్ నది పట్టణం గుండా ప్రవహిస్తుంది.

జనాభా మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, ఎటా పట్టణ సముదాయం జనాభా 1,31,023. వీరిలో పురుషులు 69,446, ఆడవారు 61,577. అక్షరాస్యత 85.62% [4]

ఎటాలో మతం
మతం శాతం
హిందూ మతం
  
78.30%
ఇస్లామ్
  
17.92%
జైన మతం
  
2.8%
ఇతరాలు†
  
0.6%
ఇతర మతాల్లో
సిక్కుమతం (0.2%), బౌద్ధం (<0.2%) ఉన్నాయి

2001 జనగణన ప్రకారం, [5] ఎటా జనాభా 107,098. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జనాభా 10% పెరిగింది. అంతకుముందు దశాబ్దంలో 36%తో పోలిస్తే ఇది బాగా తక్కువ.[6] పట్టణంలో 20,303 గృహాలు ఉన్నాయి. మహిళల జనాభా 55,927 కాగా, మొత్తం జనాభాలో పురుషులు 62,590 మంది ఉన్నారు. జనాభాలో 11,786 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు కాగా, 65 మంది షెడ్యూల్డ్ తెగల వారున్నారు.

ఎటా అక్షరాస్యత 68%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీ అక్షరాస్యత 63%. ఎటా జనాభాలో 14% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

రవాణా మార్చు

ఎటాలో రైలు మార్గాన్ని భారతదేశ మొదటి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ 1959 లో ప్రారంభించాడు. [7] రైలు ఎటా నుండి తుండ్లా వరకు, అలాగే కస్గంజ్, అలీగఢ్ వరకు నడుస్తుంది. ఢిల్లీ, ఆగ్రా, అలీగఢ్ లకు ప్రత్యక్ష రైళ్ల కోసం సర్వేను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఎటా నుండి ఆగ్రా వరకు ఎటా-ఆగ్రా ఫోర్ట్ ప్యాసింజర్ స్పెషల్ నడవడం మొదలైంది. [8] [9]

మూలాలు మార్చు

  1. "Official Website of Nagar Palika Parishad, Etah / Etah City / History of Etah City". web.archive.org. 2019-09-17. Archived from the original on 2019-09-17. Retrieved 2020-09-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Uttar Pradesh, Town Amenities (Excel - Row 901)". Censusindia.gov.in. 2011. Retrieved 14 September 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. Falling Rain Genomics, Inc – Etah. Fallingrain.com. Retrieved on 2014-01-02.
  4. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  6. "Uttar Pradesh, Town Amenities (Excel - Row 901)". Censusindia.gov.in. 2011. Retrieved 14 September 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. Jul 5, Arvind Chauhan / TNN / Updated:; 2015; Ist, 23:26. "A train that halts at the wave of a hand | Agra News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-01. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  8. "Etah Railway Station (ETAH) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-01.
  9. "North Eastern Railway". Archived from the original on 2021-09-27.
"https://te.wikipedia.org/w/index.php?title=ఎటా&oldid=4101618" నుండి వెలికితీశారు