అలీగఢ్

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం

అలీగఢ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం. ఇది అలీగఢ్ జిల్లా ముఖ్యపట్టణం. కాన్పూర్‌కు వాయవ్యంగా 307 కి.మీ., న్యూ ఢిల్లీకి ఆగ్నేయంగా సుమారు 130 కి, మీ. దూరంలో ఉంది. అలీగఢ్ ప్రక్కనే ఉన్న జిల్లాలు గౌతమ బుద్ధ నగర్, బులంద్‌షహర్, సంభల్, బదాయూన్, కాస్‌గంజ్, హాత్‌రస్, మధుర . 2011 నాటికి, అలీగఢ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన 53 వ నగరం.

అలీగఢ్
నగరం
అలీగఢ్ is located in Uttar Pradesh
అలీగఢ్
అలీగఢ్
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
నిర్దేశాంకాలు: 27°53′N 78°05′E / 27.88°N 78.08°E / 27.88; 78.08Coordinates: 27°53′N 78°05′E / 27.88°N 78.08°E / 27.88; 78.08
దేశం భారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఅలీగఢ్
జిల్లాఅలీగఢ్
సముద్రమట్టం నుండి ఎత్తు
178 మీ (584 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం8,74,408
 • ర్యాంకు53
పిలువబడువిధం (ఏక)అలీగఢ్
భాషలు
 • అధికారికహిందీ[2]
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
202001,202002
టెలిఫోన్ కోడ్0571
జాలస్థలిaligarh.nic.in

జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం, అలీగఢ్ జనాభా 8,74,408. వీరిలో 4,61,772 మంది పురుషులు, 4,12,636 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 1,19,543. అక్షరాస్యత రేటు 59.15%, అందులో పురుషుల అక్షరాస్యత రేటు 63.42%, స్త్రీల్ అక్షరాస్యత రేటు 54.37%. నగరంలో ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 68.5%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 62.9%, స్త్రీల అక్షరాస్యత రేటు 70.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 1,38,184, షెడ్యూల్డ్ తెగల జనాభా 332. 2011 నాటికి అలీగఢ్‌లో 1,47,363 గృహాలు ఉన్నాయి. [1]

భౌగోళికంసవరించు

అలీగఢ్ 27°53′N 78°05′E / 27.88°N 78.08°E / 27.88; 78.08 వద్ద [3] సముద్ర మట్టం నుండి సుమారు 178 మీటర్ల ఎత్తున ఉంది. ఈ నగరం గంగా, యమునా నదుల దోఅబ్ లో ఉంది.

శీతోష్ణస్థితిసవరించు

అలీగఢ్‌లో ఋతుపవనాలతో ప్రభావితమయ్యే తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. ఇలాంటి శీతోష్ణస్థితి ఉత్తర మధ్య భారతదేశానికి మామూలే. వేసవికాలం ఏప్రిల్‌లో మొదలై మే నెలలో ఉష్ణోగ్రతలు పెరగడంతో వేడిగా ఉంటుంది. సగటు ఉష్ణోగ్రతలు 28–38 °C (82–100 °F) . రుతుపవనాలు జూన్ చివరలో మొదలై, అక్టోబరు ఆరంభం వరకు కొనసాగుతాయి. అధిక తేమను కలిగిస్తాయి. అలీగఢ్ వార్షిక వర్షపాతం 800 మి.మీ. శీతాకాలం డిసెంబరులో ప్రారంభమై, ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు 5–11 °C (41–52 °F) మధ్య ఉంటాయి . అలీగఢ్‌లో శీతాకాలాలు సాధారణంగా తేలికపాటివి. 2011–12లో అతి తక్కువ ఉష్ణోగ్రత 1C గా నమోదైంది. పొగమంచు విపరీతంగా పడుతుంది.

శీతోష్ణస్థితి డేటా - Aligarh (1981–2010, extremes 1932–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.7
(87.3)
33.3
(91.9)
41.7
(107.1)
44.8
(112.6)
47.5
(117.5)
46.7
(116.1)
44.5
(112.1)
42.1
(107.8)
40.2
(104.4)
41.7
(107.1)
36.1
(97.0)
32.8
(91.0)
47.5
(117.5)
సగటు అధిక °C (°F) 19.8
(67.6)
23.5
(74.3)
30.3
(86.5)
37.0
(98.6)
40.1
(104.2)
39.2
(102.6)
35.3
(95.5)
33.4
(92.1)
33.6
(92.5)
32.8
(91.0)
27.9
(82.2)
22.3
(72.1)
31.3
(88.3)
సగటు అల్ప °C (°F) 7.1
(44.8)
9.5
(49.1)
14.3
(57.7)
19.9
(67.8)
24.2
(75.6)
26.3
(79.3)
26.0
(78.8)
25.2
(77.4)
23.5
(74.3)
18.4
(65.1)
12.6
(54.7)
8.3
(46.9)
18.0
(64.4)
అత్యల్ప రికార్డు °C (°F) 0.0
(32.0)
1.7
(35.1)
3.9
(39.0)
10.9
(51.6)
15.5
(59.9)
18.6
(65.5)
19.9
(67.8)
19.9
(67.8)
14.8
(58.6)
11.0
(51.8)
2.9
(37.2)
1.2
(34.2)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 13.4
(0.53)
15.4
(0.61)
9.1
(0.36)
9.8
(0.39)
29.0
(1.14)
65.8
(2.59)
207.4
(8.17)
234.5
(9.23)
112.2
(4.42)
19.7
(0.78)
4.3
(0.17)
7.2
(0.28)
727.7
(28.65)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.4 1.0 0.9 2.6 3.9 9.0 10.4 5.9 0.9 0.5 0.7 38.3
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 64 56 46 32 34 46 67 75 67 53 57 61 55
Source: India Meteorological Department[4][5]

రవాణాసవరించు

దస్త్రం:Aligarhjunctionpic.jpg
అలీగఢ్ రైల్వే స్టేషన్

అలీగఢ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నగరం లోని స్టేషన్లలో ముఖ్యమైనది. ఢిల్లీ-కోల్‌కతా మార్గంలో ఒక ముఖ్యమైన స్టేషనిది. ఇది ఎ-క్లాస్ రైల్వే స్టేషన్. ఈ మార్గం లోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇది అలీగఢ్‌ను పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్, ముంబై సెంట్రల్, కోల్‌కతా, భోపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్, ఇండోర్, జమ్మూ, గ్వాలియర్, లక్నో, ఝాన్సీ, పూరి, కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్, ఎటావా జంక్షన్ రైల్వే స్టేషన్, తుండ్లా జంక్షన్ రైల్వే స్టేషన్, ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, వారణాసి వంటి ముఖ్యమైన ప్రదేశాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి. అలీగఢ్ రైల్వే స్టేషన్ గుండా ప్రతిరోజూ 136 రైళ్ళు ప్రయాణిస్తాయి. ప్రతిరోజూ 2,04,000 మంది ప్రయాణికులు ఈ స్టేషను గుండా ప్రయాణిస్తారు. అలీగఢ్ నుండి బరేలీకి ఒక బ్రాంచ్ రైల్వే లైన్ ఉంది.

కింది రహదారులు అలీగఢ్ గుండా పోతున్నాయి:

  • జాతీయ రహదారి 91 - కోల్‌కతా - న్యూ ఢిల్లీ లను కలిపే ఈ మార్గం లోని ఘజియాబాద్-బులంద్‌షహర్-అలీగఢ్ విభాగాన్ని 4-లేన్లకు విస్తరించారు.
  • జాతీయ రహదారి 93 - ఇది మొరాదాబాద్‌ - ఆగ్రా రహదారి. దీనిలో అలీగఢ్ - ఆగ్రా విభాగాన్ని బ్రజ్‌భూమి ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించారు.
  • యమునా ఎక్స్‌ప్రెస్ వే - ఇది గ్రేటర్ నోయిడాను ఆగ్రాతో కలిపే 6 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Census of India: Search Details". www.censusindia.gov.in. Retrieved 29 September 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 8 డిసెంబరు 2020.
  3. "Falling Rain Genomics, Inc – Aligarh". Fallingrain.com. Archived from the original on 11 October 2011. Retrieved 13 October 2011.
  4. "Station: Aligarh Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 27–28. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M210. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 27 April 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=అలీగఢ్&oldid=3797173" నుండి వెలికితీశారు