అమీర్ ఖుస్రో
అమీర్ ఖుస్రో లేదా 'అమీర్ ఖుస్రో దేహ్లవి'గా అబుల్ హసన్ యమీనుద్దీన్ ఖుస్రో (Abul Hasan Yamīn al-Dīn Khusrow) (పర్షియన్:ابوالحسن یمینالدین خسرو) మధ్య యుగపు (సా.శ. 1253-1325) పారశీక కవి. సూఫీ గురువు నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు. ఇతడు పాటియాలాలో జన్మించాడు. ఉర్దూ, హిందుస్తానీ కవి యే గాక శాస్త్రీయ సంగీతకారుడు. ఖవ్వాలి పితామహుడుగా పేరొందాడు. హిందూస్థానీ సంగీతం పునరుద్ధరించిన ఘనుడు. 'తరానా' సంగీత హంగు సృష్టికర్త. తబల, సితార్ సృష్టికర్త. సంగీతకారుడు, విజ్ఞాని, కవి, సూఫీ సంతుడు. గజల్ వృధ్ధికారుడు. దోహా లకు, పహేలీ లకు, హిందూస్తాని పారశీక భాషా సమ్మేళనానికి నాంది కర్త. ఖుస్రో సమాధి నిజాముద్దీన్ ఔలియా సమాధి (ఢిల్లీ) ప్రక్కనే చూడవచ్చు. ఖుస్రో 7గురు ఢిల్లీ సుల్తానుల పరిపాలనాకాలాన్ని చూసాడు.
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్ |
భారత్‌లో మస్జిద్‌లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం |
దోహాలకు ఉదాహరణ
మార్చుకాశ్మీర సౌందర్యాన్ని చూసి ఈ దోహా చెప్పాడు
اگر فردوس بر روی زمین است
همین است و همین است و همین است
అగర్ ఫిర్దోస్ బర్ రూయె జమీనస్త్
హమీనస్తో హమీనస్తో హమీనస్త్
సారాంశం:
ఒకవేళ భూమిపై స్వర్గమంటూ ఉంటే
అది ఇదే, అది ఇదే, అది ఇదే
రచనలు
మార్చు- తోహ్ ఫ-తుస్-సఘీర్ (చిరు బహుమానం)
- వస్తుల్-హయాత్ (జీవనకాలం)
- ఘుర్రతుల్-కమాల్
- బఖియ-నఖియ
- ఖిస్స చహార్ దర్వేష్ (నాలుగు దర్వేష్ ల గాథ)
- నిహాయతుల్ కమాల్
- ఖిరాన్-ఉస్-స ఆదైన్
- మిఫ్తాహుల్-ఫుతూహ్ (జయాజయం)
- ఇష్ఖియ/మస్నవి దువర్రానె ఖిజ్ర్ ఖాన్
- నోహ్ సిపహర్ (మస్నవి)
- ఆషికి తుగ్లక్ నామా
- ఖమ్స-ఎ-నిజామి
- ఏజాజె ఖుస్రవి
- ఖజైనుల్ ఫుతూహ్
- అఫ్ జలుల్ ఫవాయిద్
- ఖాలిఖ్ బారి (మహా సృష్టికర్త)
- జవాహర్-ఎ-ఖుస్రవి
- లైలా మజ్ను
- ఆయిన-ఎ-సికందరి
- ముల్లా-ఉల్-అన్వార్
- షిరీన్-వ-ఖుస్రో