ఎదిరె చెన్నకేశవులు

కవి, జర్నలిస్ట్, రచయిత మరియు సాహితీవేత్త. తెలంగాణ తొలితరం కథరచయిత

ఎదిరె చెన్నకేశవులు కవి, జర్నలిస్ట్, రచయిత, సాహితీవేత్త. తెలంగాణ తొలితరం కథరచయిత.[1]

ఎదిరె చెన్నకేశవులు
జననంఎదిరె చెన్నకేశవులు
ఆగష్టు 15, 1918
India మహబూబ్ నగర్ , తెలంగాణ
నివాస ప్రాంతంమహబూబ్ నగర్ , తెలంగాణ
వృత్తికవి, జర్నలిస్ట్ & సాహితీవేత్త.
తల్లిదండ్రులునారాయణ, బాలకృష్ణమ్మ

బాల్యం - విద్యాభ్యాసం

మార్చు

చెన్నకేశవులు 1918, ఆగష్టు 15 న నారాయణ, బాలకృష్ణమ్మ దంపతులకు మహబూబ్ నగర్లో జన్మిచారు. ప్రాథమిక విద్య మహబూబ్ నగర్ లోనే జరిగింది.

జీవిత విశేషాలు

మార్చు

విద్యార్థి దశలోని ఆంధ్ర బాల సంఘాన్ని స్థాపించారు. జర్నలిస్ట్ గా గోల్కొండ పత్రికకు వెన్నుదన్నుగా ఉన్నారు. నేత అనే వార పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ప్రసిద్ధి గాంచిన హిందీ పత్రిక మిలాప్కు ప్రతినిధిగా ఉన్నారు. సహకార సహజీవనం సంపుటిని ప్రారంభించారు. అభ్యుదయ రచయిత అనే కథ సంపుటి సుజాత పత్రికలో 1950లో ప్రచురితం అయింది. ఇతను తొమ్మిది కథలు వ్రాసారు. రాష్ట్ర గ్రంథాలయ సంఘానికి సహా వ్యవస్థాపకుడిగా ఉండేవారు. చేనేత ఉద్యమకారుడు. హైదరాబాద్ కేంద్ర చేనేత సహకార సంఘానికి సహా వ్యవస్థాపకులుగా ఉన్నారు.

రచనలు

మార్చు
  • సహకార సహజీవనం (సంపుటి)
  • పొట్టకోసం (1968- కథ)
  • అదృశ్య హస్తం (నవల)
  • పతిత (నవల)
  • అభ్యుదయ రచయిత (1950- కథ)

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ. "మరుగునపడిన మాణిక్యం". Retrieved 22 August 2017.