1918
1918 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1915 1916 1917 - 1918 - 1919 1920 1921 |
దశాబ్దాలు: | 1890లు 1900లు - 1910లు - 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- ప్రకాశం జిల్లా వేటపాలెంలో సారస్వత నికేతనం తెలుగు గ్రంథాలయము స్థాపించబడింది.
- జనవరి 22: కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటయింది. ప్రత్యేకాంధ్ర ఏర్పాటులో ఇదో మైలురాయి.
- జనవరి 25: రష్యా దేశం "రిపబ్లిక్ ఆఫ్ సోవియట్స్"గా ప్రకటించబడింది
- నవంబరు 11: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
జననాలు
మార్చు- జనవరి 2: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
- జనవరి 25: కొండవీటి వెంకటకవి, కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (మ.1991)
- మార్చి 1: ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)
- మార్చి 5: జేమ్స్ టోబిన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- మే 11: మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016)
- జూలై 3: ఎస్వీ రంగారావు, తెలుగు సినిమా నటుడు. (మ.1974)
- జూలై 4: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.
- జూలై 14: ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (మ.2007)
- జూలై 18: నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. (మ.2013)
- జూలై 19: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (మ.2007)
- ఆగష్టు 10: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (మ.1985)
- ఆగష్టు 19: శంకర్ దయాళ్ శర్మ, భారత మాజీ రాష్ట్రపతి.
- ఆగష్టు 21: సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1994)
- ఆగస్టు 23: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
- ఆగస్టు 24: సికిందర్ భక్త్, భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- అక్టోబరు 8: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006)
- అక్టోబరు 8: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)
- అక్టోబరు 12: పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (మ.1986)
- నవంబర్ 8: బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మిక వేత్త. (మ.2007)
- నవంబర్ 11: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
- డిసెంబర్ 1: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
- డిసెంబర్ 31: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, సాహితీవేత్త.
- : చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి .
మరణాలు
మార్చు- సెప్టెంబర్ 8: రాయచోటి గిరిరావు, సంఘ సేవకులు, విద్యావేత్త. (జ.1865)
- అక్టోబర్ 15: షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (జ.1835)